newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

జ‌గ‌న్ గ్రాండ్ విక్టరీతో ప్ర‌శాంత్ కిషోర్‌కు ఫుల్ గిరాకీ..!

22-07-201922-07-2019 07:29:10 IST
Updated On 22-07-2019 12:11:59 ISTUpdated On 22-07-20192019-07-22T01:59:10.143Z22-07-2019 2019-07-22T01:59:05.654Z - 2019-07-22T06:41:59.546Z - 22-07-2019

జ‌గ‌న్ గ్రాండ్ విక్టరీతో ప్ర‌శాంత్ కిషోర్‌కు ఫుల్ గిరాకీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌శాంత్ కిషోర్‌. రాజ‌కీయ వ‌ర్గాలకు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌. ఎన్నిక‌ల్లో వ్యూహం ప‌న్న‌డం అనేది కూడా ఒక వ్యాపారంగా మార్చిన వ్య‌క్తి ఆయ‌న‌. బిహార్‌కు చెందిన ప్ర‌శాంత్ కిషోర్‌కు కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా స‌క్సెస్ రేట్ కాస్త ఎక్కువ‌. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ప‌నిచేశారు. సుమారు ఏడాది పాటు ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ జ‌గ‌న్ కోసం ప‌నిచేసి.. వైసీపీ అఖండ విజ‌యానికి ఒక కార‌ణమైంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌శాంత్ కిషోర్ స‌క్సెస్ కావ‌డంతో ఆయ‌న‌కు ఇప్పుడు గిరాకీ బాగా పెరిగింది. ప్ర‌శాంత్‌తో ప‌లు పార్టీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇండియ‌న్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీ(ఐప్యాక్‌) అనే సంస్థ‌ను స్థాపించిన ప్ర‌శాంత్ వివిధ పార్టీల‌కు ఎన్నిక‌ల వ్యూహాలు ర‌చించి, వాటిని అమ‌లు చేస్తుంటారు. 2014లో ఆయ‌న న‌రేంద్ర మోడీతో ఒప్పందం చేసుకున్నారు.

ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఘ‌న విజ‌యం సాధించారు. త‌ర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కోసం, బిహార్ ఎన్నిక‌ల్లో జేడీయూ కోసం ఆయ‌న ప‌నిచేసి స‌క్సెస్ అయ్యారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో మాత్రం మ‌హాకూట‌మి త‌ర‌పున ప‌నిచేసి ఫెయిల్ అయ్యారు.

దీంతో ఆయ‌న‌కు ఆ మ‌ధ్య కొంత డిమాండ్ త‌గ్గింది. ఈ స‌మ‌యంలో ప్ర‌శాంత్ కిషోర్‌తో జ‌గ‌న్ ఒప్పందం చేసుకొని ఏపీలో దింపారు. జ‌గ‌న్ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ప్ర‌శాంత్‌కు డిమాండ్ పెరిగింది. 2021 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీతో స‌వాల్‌ను ఎదుర్కుంటున్న మ‌మ‌తా బెన‌ర్జీ ఇప్పుడు ప్ర‌శాంత్ కిషోర్‌నే న‌మ్ముకున్నారు. ఆయ‌న‌తో తృణ‌మూల్ కాంగ్రెస్ ఒప్పందం జ‌రిగింది. కల‌క‌త్తాలో జ‌రిగిన భారీ ర్యాలీతో ఆయ‌న ప‌ని కూడా ప్రారంభించారు.

బెంగాల్‌లో బీజేపీ ఎదుగుతుండ‌టం మ‌మ‌తా బెన‌ర్జీని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. 42 పార్ల‌మెంటు సీట్లున్న బెంగాల్‌లో 2014లో మ‌మ‌తా ఏకంగా 34 సీట్లు గెలుచుకున్నారు.

కానీ, ఈ ఎన్నిక‌ల్లో 22కి ప‌డిపోయారు. ఇదే స‌మ‌యంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 18 ఎంపీ సీట్లు సాధించింది. వ‌రుస‌గా రెండుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన మ‌మ‌తాపై స‌హ‌జంగానే వ్య‌తిరేక‌త ఉండ‌టం, బీజేపీ హిందుత్వ కార్డు ప్ర‌యోగిస్తుండ‌టంతో మ‌మ‌తా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఆమె ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపారు.

ఇక‌, మ‌హారాష్ట్ర‌లోనూ శివ‌సేన ప్ర‌శాంత్ కిషోర్‌ను న‌మ్ముకుంది. మ‌హారాష్ట్ర‌లో ఎప్పుడూ బీజేపీతో పొత్తు పెట్టుకునే శివ‌సేన బీజేపీ కంటే త‌క్కువ సీట్లు సాధించి ఆ పార్టీకి త‌మ్ముడిగా ఉంటోంది. శివ‌సేన కంటే ఎక్కువ సీట్లు ద‌క్కించుకొని బీజేపీ పెద్ద‌న్న‌గా నిలుస్తోంది.

ఈసారి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు ద‌క్కించుకొని పెద్ద‌న్న పాత్ర‌తో పాటు మొద‌టిసారి అధికారంలోకి రావాల‌ని శివ‌సేన భావిస్తోంది. ఇక‌, మూడో త‌రం నేత‌గా శివ‌సేన చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌నున్నారు.

జ‌గ‌న్ మాదిరిగానే ఆయ‌న సుదీర్ఘ పాద‌యాత్రకు వెళ్ల‌నున్నారు. దీంతో ఆయ‌న‌ను లీడ‌ర్‌గా నిల‌బెట్టేందుకు ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాలు అవ‌స‌ర‌మ‌ని ఉద్ద‌వ్ భావించారు. అందుకే ప్ర‌శాంత్ కిషోర్‌తో శివ‌సేన కూడా ఒప్పందం కుదుర్చుకుంది. త‌మిళ‌నాడులో అన్నా డీఎంకే కూడా ప్ర‌శాంత్ కిషోర్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది.

ఒక‌, ఏపీలో టీడీపీ కూడా ప్ర‌శాంత్‌తో చ‌ర్చ‌లు జ‌రిపింద‌నే ప్ర‌చారం జ‌రిగినా టీడీపీ నేత‌లు ఖండించారు. ప్ర‌స్తుతం జేడీయూ ఉపాధ్య‌క్షుడిగా ఉన్న ప్రశాంత్ ఆ పార్టీకి ఎలాగూ వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. ఇలా జ‌గ‌న్ గెలుపు ఎఫెక్ట్‌తో ప్ర‌శాంత్ కిషోర్‌కు డిమాండ్ బాగా పెరిగింది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle