newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

జ‌గ‌న్ గారూ.. ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారు సార్‌..!

27-10-201927-10-2019 15:05:01 IST
2019-10-27T09:35:01.616Z27-10-2019 2019-10-27T09:34:56.241Z - - 20-11-2019

జ‌గ‌న్ గారూ.. ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారు సార్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో నెల్లూరు ఒక‌టి. జిల్లాలోని ప‌దికి ప‌ది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ సీట్ల‌ను వైసీపీ కైవ‌సం చేసుకుంది. దీంతో సీఎం జ‌గ‌న్ త‌న కేబినేట్‌లో రెండు మంత్రివ‌ర్గ‌ ప‌ద‌వులను ఈ జిల్లాకే కేటాయించారు. ఇప్పుడు అదే అస‌లు స‌మ‌స్య‌గా మారింది. ప్ర‌తిప‌క్షంలో ఉన్నంత కాలం క‌లిసి ప‌నిచేసిన నాయకులు ఇప్పుడు ఒక‌రిమీద ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

ఎమ్మెల్యేలు, మంత్రుల ఆధిప‌త్య పోరుతో పార్టీలో అంత‌ర్యుద్ధం న‌డుస్తున్న‌ట్టు స‌మాచారం. ఎన్నిక‌ల త‌రువాత ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌టం లేద‌ని, జిల్లా పార్టీలో ఉన్న వ‌ర్గ‌పోరుతో ద్వితీయ‌, తృతీయ శ్రేణి నాయ‌క‌త్వం తీవ్ర అసంతృప్తిని వ్య‌క్త ప‌రుస్తోంది.  

దీంతో అధికార వైసీపీ క‌ల‌హాల కుంప‌టిగా మారుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్ర‌తినిధులుగా ఉన్న ఎమ్మెల్యేల మ‌ధ్యే విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. అధికారంలోకి వ‌చ్చి ఐదు నెల‌లు గ‌డుస్తున్నా అంద‌రూ ఒక్క‌చోట చేరిన దాఖ‌లాలే లేవు. పార్టీ స్థితిగ‌తుల గురించి భారీ మెజార్టీతో గెలిపించిన ప్ర‌జ‌ల‌ను, ప్రాంతాల అభివృద్ధిని గ‌రించి చ‌ర్చించుకున్న సంద‌ర్భం కూడా లేదు.

ఎవ‌రికి వారు వేర్వేరుగా ఉంటున్నారు. అవ‌కాశం దొరికిన‌ప్పుడు ఒక‌రిపై మ‌రొక‌రు నిప్పులు కురిపించుకుంటున్నారు. ఇది కింది స్థాయిలో ఉన్న‌వారికి కాస్త ఇబ్బందిక‌రంగానే అనిపిస్తుంద‌ట‌. వైసీపీ నాయ‌కులు అధికారంలోకి వ‌చ్చిన కొద్ది కాలంలోనే త‌లోదారి వెతుక్కున్నారు.

జిల్లా ప‌రిధిలో ప‌ది మంది ఎమ్మెల్యేలు గెలిచార‌న్న సంతోషం.. ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయన్న ఆనందం కూడా లేకుండా పోతుంద‌ని వైసీపీ శ్రేణులు మీడియా ముందు బాహాటంగానే అంటున్నారు. మంత్రులు ఇద్ద‌రూ ఏకాకులుగా మిగిలిపోయారు. ఎమ్మెల్యేలు గ్రూపులుగా విడిపోయారు.

ఎంపీడీవో వివాదం సంద‌ర్భంగా ఎమ్మెల్యేలు కాటంరెడ్డి, కాకాణి పేర్లు వార్త‌ల్లోకి వ‌చ్చాయి. కానీ, అధికార పార్టీ నేత‌ల మధ్య వెలుగు చూడ‌ని ఇలాంటి విభేదాలు చాలానే ఉన్నాయ‌ట‌. రాష్ట్ర మంత్రివ‌ర్గంలో అత్యంత కీల‌క‌మైన నీటిపారుద‌ల, పారిశ్రామిక శాఖ‌ల మంత్రి ప‌ద‌వులు జిల్లాకు ద‌క్క‌డంతో ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని అంతా ఆశించారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా సొంత పార్టీ నేత‌ల నుంచి అనీల్‌కుమార్ యాద‌వ్, మేక‌పాటి గౌత్‌రెడ్డిల‌కు ల‌భిస్తున్న గౌర‌వం సొంత జిల్లాలో క‌నిపించ‌డం లేదంటున్నారు. క‌నీసం ఎమ్మెల్యేలు కూడా వారాని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెవులు కొరుక్కుంటున్నారు నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణులు. వైసీపీ అధికారంలోకి రావ‌డానికి గ‌ల కార‌ణాల్లో ప్ర‌ధాన‌మైన‌ది ఎన్నిక‌ల‌కు ముందు నాయ‌కుల మ‌ధ్య‌ స‌ఖ్య‌త‌నే. ఇప్పుడు అదే లోపించింద‌న్న మాట‌లు నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణుల నుంచి విన‌వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle