newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

జ‌గ‌న్ కోసం గురువు... చంద్ర‌బాబు కోసం శిష్యుడు..?

25-09-201925-09-2019 06:15:14 IST
Updated On 25-09-2019 12:26:45 ISTUpdated On 25-09-20192019-09-25T00:45:14.140Z25-09-2019 2019-09-25T00:45:06.631Z - 2019-09-25T06:56:45.837Z - 25-09-2019

జ‌గ‌న్ కోసం గురువు... చంద్ర‌బాబు కోసం శిష్యుడు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌కు ఉన్న డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. కొన్ని మిన‌హా ఆయ‌న ఎవ‌రి కోస‌మైనా వ్యూహ‌క‌ర్తగా ప‌నిచేస్తే ఆ పార్టీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన‌ట్లేన‌నే న‌మ్మ‌కం ఏర్ప‌డింది. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చారిత్ర‌క విజ‌యం సాధించిన జ‌గ‌న్ కోసం కూడా పీకే ప‌నిచేయ‌డంతో ఆయ‌న‌కు డిమాండ్ మ‌రింత పెరిగిపోయింది. ఏపీలో జ‌గ‌న్ విజ‌యం వెనుక పీకే వ్యూహాలు ఎక్కువ‌గా ప‌నిచేశాయ‌ని చంద్ర‌బాబు నాయుడు స‌హా అంతా భావిస్తున్నారు.

వాస్త‌వానికి, ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందే ప‌సిగ‌ట్టారు. ప్ర‌శాంత్ కిషోర్‌ను నైతికంగా దెబ్బ‌కొట్టేందుకు అప్ప‌ట్లో ఆయ‌న‌పై అనేక విమ‌ర్శ‌లు చేశారు. కొన్నిసార్లు ఇవి శృతిమించి బిహార్ గ్యాంగ్ అని కూడా పీకేని ఉద్దేశించి బాబు ఆరోపించారు. అయితే, ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత జ‌గ‌న్ విజ‌యానికి పీకే వ్యూహాలు బాగా ప‌నిచేశాయ‌నే నిర్ధార‌ణ‌కు చంద్రబాబు వ‌చ్చారు.

అయితే, త‌మ కోసం ప‌నిచేయాల్సిందిగా చంద్ర‌బాబు.. ప్ర‌శాంత్ కిషోర్‌ను కోరిన‌ట్లు ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. కానీ, పీకే ఇప్ప‌టికీ వైసీపీతో ఒప్పందాన్ని కొన‌సాగిస్తున్నారు. పైగా చంద్ర‌బాబు.. పీకేను వ్య‌క్తిగ‌తంగా శ‌త్రువుగా భావించి విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ప్ర‌శాంత్ కిషోర్‌ను చంద్ర‌బాబు సంప్ర‌దించే అవ‌కాశాలు లేవ‌నే చెప్పాలి. టీడీపీ కూడా ఈ వార్త‌ల‌ను ఖండించింది.

కాగా, ఇప్పుడు చంద్ర‌బాబు త‌మ పార్టీకి పీకే లాంటి ఒక వ్యూహ‌క‌ర్త‌ను నియ‌మించుకోవాల‌ని భావిస్తున్నారని, ఇందుకోసం రాబిన్ శ‌ర్మ అనే ఓ ప్రొఫెష‌న‌ల్‌ను సంప్ర‌దించార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి రాజ‌కీయ వ్యూహాలు ప‌న్న‌డంలో చంద్ర‌బాబు దిట్ట‌. మ‌రి, రాబిన్ శ‌ర్మ‌ను సంప్ర‌దించాల్సిన అవ‌స‌రం ఏంటి అనే చ‌ర్చ అంత‌టా మొద‌లైంది.

రాబిన్ శ‌ర్మ‌కు పెద్ద చ‌రిత్ర‌నే ఉంది. ఆయ‌న ప్ర‌శాంత్ కిషోర్ శిష్యుడు. ఆయ‌న‌తో క‌లిసి సిటిజ‌న్స్ ఫ‌ర్ అకౌంట‌బుల్ గ‌వ‌ర్నెన్స్‌(సీఏజీ) అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌శాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థ‌లోనూ ఆయ‌న కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 2014 ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోడీ విజ‌యానికి బాగా ఉప‌యోగ‌ప‌డిన చాయ్ పే చ‌ర్చ కార్య‌క్ర‌మానికి ప్ర‌చార బాధ్య‌త‌లు రాబిన్ శ‌ర్మ‌నే చూశారు.ఆ ఎన్నిక‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ ప్ర‌చారాన్ని ఆయ‌నే చూసుకున్నారు.

2015లో ఐప్యాక్ సంస్థ బిహార్‌లో నితీష్ కుమార్ కోసం ప‌నిచేసింది. అప్పుడు హ‌ర్ ఘ‌ర్ నితీష్ - హ‌ర్ మ‌న్ నితీష్ పేరుతో నిర్వ‌హించిన ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను కూడా రాబిన్ విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రాహుల్ గాంధీ నిర్వ‌హించిన ఖాట్ స‌భ‌ల ప్ర‌చారాన్ని రాబిన్ శ‌ర్మ‌నే చూసుకున్నారు.త‌ర్వాత కొంత‌కాలం కాంగ్రెస్ పార్టీకి క్యాంపెయిన్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసి ఎన్నిక‌ల ముందు నేతా యాప్ అనే ఓ సంస్థ‌కు సీఈఓగా ప‌నిచేశారు.

ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన రాబిన్ శ‌ర్మ రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌చార బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌డంలో ఆరితేరి ఉన్నారు. పీకే టీమ్‌లో కీల‌క స‌భ్యుడిగా ప‌నిచేసిన అనుభ‌వంతో ఆయ‌న ఇప్పుడు స్వంతంగా ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో చంద్ర‌బాబు ఆయ‌న‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. భారీ ప్యాకేజీకి డీల్ కూడా కుదిరింద‌నే వార్త‌లు వ‌స్తున్నా టీడీపీ వ‌ర్గాలు ధృవీక‌రించ‌డం లేదు. ఒక‌వేళ ఇది నిజ‌మే అయితే ఇప్ప‌టికే ప్ర‌చారం చేసుకోవ‌డంలో ముందుండే టీడీపీకి అద‌న‌పు బ‌లం ల‌భించ‌నున్న‌ట్లే.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle