newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

జ‌గ‌న్ కు బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిందా..?

28-05-201928-05-2019 11:33:29 IST
Updated On 26-06-2019 15:08:34 ISTUpdated On 26-06-20192019-05-28T06:03:29.712Z28-05-2019 2019-05-28T06:03:26.400Z - 2019-06-26T09:38:34.223Z - 26-06-2019

జ‌గ‌న్ కు బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో త‌మ శ‌త్రువును, త‌మ‌ను ఎన్నిక‌ల వేళ ఇబ్బంది పెట్టిన చంద్ర‌బాబు నాయుడును చిత్తుగా ఓడించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బీజేపీ పెద్ద‌లు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షాను జ‌గ‌న్ క‌లిసిన నేప‌థ్యంలో జ‌గ‌న్ ను ఎన్డీఏలోకి ఆహ్వానించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్నిక‌ల‌కు ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని బీజేపీ పేద్ద‌ల‌తో స‌త్సంబంధాలు నెర‌పుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక కామ‌న్ శ‌త్రువుగా ఉన్న చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టేందుకు జ‌గ‌న్ కు బీజేపీ కొంత‌మేర స‌హ‌క‌రించింద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఈ అంశాన్ని ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని భావించినా పెద్ద‌గా క‌లిసి రాలేదు.

ఇక‌, ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం సాధించిన త‌ర్వాత జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని మోడీ, అమిత్ షాను క‌లిశారు. కేంద్రంలో ఎన్డీఏకు 350 వ‌ర‌కు సీట్లు ఉండ‌టంతో కేంద్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు త‌న అవ‌స‌రం ఉంటుంద‌నుకున్న జ‌గ‌న్ అంచ‌నాలు త‌ప్పాయి. దీంతో ఇప్పుడు డిమాండ్ చేసి సాధించే అవ‌కాశం లేక‌పోవ‌డంతో సామ‌ర‌స్యంగానే కేంద్రంతో స‌త్సంబంధాలు పెంచుకొని రాష్ట్రానికి కావాల్సిన‌వి సాధించ‌డం త‌ప్ప జ‌గ‌న్ కు మ‌రో మార్గం లేదు.

జ‌గ‌న్ తో సుదీర్ఘ భేటీ త‌ర్వాత ప్ర‌ధాని మోడీ సూచ‌న‌ల మేర‌కే అమిత్ షాను జ‌గ‌న్ క‌లిశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ భేటీతో కేంద్ర ప్ర‌భుత్వంలో చేరాల్సిందిగా జ‌గ‌న్ ను ఆహ్వానించార‌ట‌. ఇందుకు గానూ ఒక మంత్రి ప‌ద‌వి, రెండు స‌హాయ మంత్రి ప‌ద‌వులు వైసీపీకి ఇస్తామ‌ని అమిత్ షా చెప్పార‌ట‌. అయితే, రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలని జ‌గ‌న్ మెలిక పెట్టార‌ని స‌మాచారం.

దీంతో ఈ అంశంపై చ‌ర్చిద్దామ‌ని అమిత్ షా చెప్పార‌ని తెలుస్తోంది. ప్ర‌త్యేక హోదా కాకుండా రాష్ట్రానికి మ‌రేవిధంగా అయినా సాయం చేసేందుకు కేంద్రం ముందుకు రావ‌చ్చు అంటున్నారు. ప్ర‌స్తుతానికి కేంద్రంలో మ్యాజిక్ ఫిగ‌ర్ కంటే చాలా ముందున్న ఎన్డీఏకు జ‌గ‌న్ అవ‌స‌రం ఇప్పుడు లేకున్నా భ‌విష్య‌త్ లో ఉంటుంది. రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌కు సంబంధించిన కీల‌క బిల్లుల‌ను ఆమోదించుకునేందుకు కేంద్రానికి లోక్‌స‌భ‌లో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి.

జ‌గ‌న్ కు ఉన్న 22 మంది ఎంపీల మ‌ద్ద‌తు ఎన్డీఏకు ఇచ్చి ప్ర‌భుత్వంలో చేరితే కేంద్రానికి ఇది సులువవుతుంది. రాజ్య‌స‌భ‌లోనే జ‌గ‌న్ కు వ‌చ్చే సీట్లు బీజేపీకి క‌లిసివ‌స్తాయి. అందుకే అమిత్ షా జ‌గ‌న్ కు కేంద్ర ప్ర‌భుత్వంలో చేరాల‌ని ఆహ్వానం అందించారు. ప్ర‌త్యేక హోదా ఇస్తే మాత్రం బేష‌ర‌తుగా జ‌గ‌న్ కేంద్రానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మే కాకుండా కేంద్ర ప్ర‌భుత్వంలో చేర‌వ‌చ్చు. 

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   31 minutes ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   2 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   2 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   3 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   3 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   3 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   3 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   a day ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   24-05-2020


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   24-05-2020


ఇంకా

Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle