newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

జ‌గ‌న్ కంచుకోట‌లో టీడీపీ పాగా వేసేనా..?

31-03-201931-03-2019 08:18:16 IST
2019-03-31T02:48:16.623Z31-03-2019 2019-03-31T02:48:11.155Z - - 26-08-2019

జ‌గ‌న్ కంచుకోట‌లో టీడీపీ పాగా వేసేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన క‌డ‌ప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఈసారి సీట్లు, ఓట్ల సంఖ్య‌ను పెంచుకోవాలని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ మేర‌కు ఐదేళ్లుగా ఈ జిల్లా అభివృద్ధిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. అదే స‌మ‌యంలో వైసీపీ నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించి టీడీపీని బ‌లోపేతం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ద‌శ‌లో క‌డ‌ప స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ అభ్య‌ర్థి, జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డిని ఓడించి సంచ‌ల‌నం సృష్టించారు. అదే ఊపుతో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని టీడీపీ భావిస్తోంది.

ఆది నుంచీ క‌డ‌ప జిల్లాపై వై.ఎస్.రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుటుంబ ప్ర‌భావం ఎక్కువ ఆయ‌న జీవించి ఉన్న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి జిల్లాపై ఆధిప‌త్యం ఉండేది. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం జ‌గ‌న్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే జిల్లాలో మెజారిటీ ప్ర‌జ‌లు నిలిచారు. ఉప ఎన్నిక‌లు, 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ జిల్లాలో పూర్తి ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. 2014 ఎన్నిక‌ల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 9 స్థానాల‌ను వైసీపీ కైవ‌సం చేసుకుంది.

అనంత‌రం క‌డ‌ప జిల్లాపై దృష్టి పెట్టిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించారు. దీంతో జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి, బ‌ద్వేల్ ఎమ్మెల్యే జ‌య‌రాములు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. జిల్లాలో పార్టీ బ‌లోపేతం కోసం ఆదినారాయ‌ణ‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి కూడా క‌ట్ట‌బెట్టారు. త‌ర్వాత ఆయ‌న టీడీపీ బ‌లోపేతానికి బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో జిల్లాకు సాగునీరు అందివ్వ‌డంలో, అభివృద్ధిలో టీడీపీ ప్ర‌త్యేక చొర‌వ చూపింది. దీంతో ఈసారి క‌డ‌ప జిల్లాలో మెజారిటీ స్థానాలు ద‌క్కించుకుంటామ‌ని టీడీపీ ధీమాగా ఉంది.

పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో కూడా జ‌గ‌న్ మెజారిటీని త‌గ్గిస్తామ‌ని, క‌డ‌ప పార్ల‌మెంటును ద‌క్కించుకుంటామ‌ని అంటోంది. అయితే, క‌డ‌ప ఎంపీ సీటుపై టీడీపీ స్థానిక నేత‌ల‌కు కూడా పెద్ద‌గా ఆశ‌లు లేవు. అందుకే ఇక్క‌డి నుంచి పోటీ చేసేందుకు ఆదినారాయ‌ణ‌రెడ్డి మొద‌ట స‌సేమిరా అన్నారు. చివ‌ర‌కు వారి కుటుంబానికి ఎమ్మెల్సీ ప‌ద‌వి హామీతో ఆయ‌న పోటీలో ఉన్నారు. గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉన్నా వైసీపీకే ఈ సీటులో మొగ్గు క‌నిపిస్తోంది.

క‌డ‌ప జిల్లా ఓట‌ర్లు సాగునీరు ఇవ్వ‌డంపై, అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌భుత్వం ప‌ట్ల కొంత సానుకూలంగానే ఉన్నారు. అయితే, త‌మ జిల్లా వ్య‌క్తిగా జ‌గ‌న్ ప‌ట్ల ఇంకా ఎక్కువ సానుకూల‌తతో ఉన్నారు. దీంతో ఈసారి కూడా మెజారిటీ స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. అయితే, జ‌మ్మల‌మ‌డుగు, మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం టీడీపీ గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంది. 

జ‌మ్మల‌మ‌డుగులో ద‌శాబ్దాలుగా ప‌ట్టున్న ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి ఒక్క‌ట‌వ‌డంతో తెలుగుదేశం పార్టీ బ‌లోపేత‌మైంది.ప్ర‌జ‌లు కూడా వీరి క‌ల‌యిక ప‌ట్ల సానుకూలంగా ఉన్నారు. ఇద్ద‌రు ఫ్యాక్ష‌న్ నేత‌లు ఒక్కటి కాగా వీరికి పోటీగా వైసీపీ త‌ర‌పున యువ డాక్ట‌ర్ సుధీర్ రెడ్డి బ‌రిలో ఉన్నారు. ఆయ‌న ఇక్క‌డ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మైదుకూరు నుంచి బ‌డా వ్యాపారి పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పోటీ చేస్తున్నారు. ఇక్క‌డ 1978 నుంచి ఆరుసార్లు డీఎల్ ర‌వీంద్రారెడ్డి, మూడుసార్లు ర‌ఘురామిరెడ్డి విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ర‌ఘురామిరెడ్డినే వైసీపీ మ‌ళ్లీ అభ్య‌ర్థిగా నిల‌బెట్టింది. ఆయ‌న‌కు సుధాక‌ర్ యాద‌వ్ గ‌ట్టి పోటీ ఇస్తున్నార‌నే అంచ‌నాలు ఉన్నాయి.

అయితే, నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టున్న డీఎల్ ర‌వీంద్రారెడ్డి వైసీపీలో చేర‌డంతో ఆ పార్టీకి అద‌న‌పు బ‌లం చేకూరింది. ఇప్ప‌టికైతే వైసీపీ బ‌లంగా క‌నిపిస్తున్నా గెలుపు అంత సులువు కాద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

ఇక‌, తెలుగుదేశం పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో గెలుచుకున్న సిట్టింగ్ స్థానం రాజంపేటలో మాత్రం ఈసారి వైసీపీ హ‌వా క‌నిపిస్తోంది. టీడీపీ త‌ర‌పున గెలిచిన మేడా మ‌ల్లిఖార్జున‌రెడ్డి వైసీపీలోకి వ‌చ్చి పోటీ చేస్తున్నారు. అప్ప‌టివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే అమ‌ర్ నాథ్ రెడ్డి మొద‌ట అలిగినా ఇప్పుడు మేడాకు పూర్తి స‌హ‌క‌రిస్తున్నారు. దీంతో వైసీపీ బ‌లం పుంజుకుంది. మొత్తానికి క‌డ‌ప జిల్లాలో ఇప్ప‌టికైతే వైసీపీ హ‌వానే ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా బాగానే క‌ష్ట‌ప‌డుతుంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle