newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

జ‌గ‌న్ ఇలాఖాలో చంద్ర‌బాబుకు షాకిచ్చిన టీడీపీ నేత‌లు

26-11-201926-11-2019 08:08:15 IST
2019-11-26T02:38:15.199Z26-11-2019 2019-11-26T02:34:47.978Z - - 19-01-2020

జ‌గ‌న్ ఇలాఖాలో చంద్ర‌బాబుకు షాకిచ్చిన టీడీపీ నేత‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్వంత జిల్లా క‌డ‌ప‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు షాక్ త‌గిలింది. సోమ‌వారం జరిగిన క‌డ‌ప జిల్లా టీడీపీ స‌మీక్ష స‌మావేశానికి చంద్ర‌బాబు హాజ‌ర‌య్యారు. అయితే, ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు టీడీపీ ముఖ్య నేత‌లు మొహం చాటేశారు. స్వ‌యంగా అధినేత హాజ‌రైన కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

క‌డ‌ప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట‌. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అండ‌గా నిలుస్తున్నారు ఇక్క‌డి ప్ర‌జ‌ల్లో. 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చినా క‌డ‌ప‌లో మాత్రం వైసీపీ 10లో 9 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నిక‌ల్లో మొత్తం క్లీన్‌స్వీప్ చేసింది. మూడు ద‌శాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి క‌డ‌ప జిల్లా కంచుకోట‌గా ఉన్నా తెలుగుదేశం పార్టీకి కూడా న‌మ్మ‌కంగా ప‌నిచేసే నేత‌లు ఉన్నారు.

వ‌రుస ఓట‌ములు ఎదుర‌వుతున్నా వీరే జిల్లాలో పార్టీని నిల‌బెడుతున్నారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మాత్రం గ‌తానికి భిన్నంగా ఉంది. జిల్లాలో వైసీపీ మ‌రింత బ‌లం పుంజుకుంది. రాష్ట్రంలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. దీంతో క‌డ‌ప జిల్లా టీడీపీ నేత‌ల్లో నైరాశ్యం నెల‌కొంది. అందుకే సైలెంట్ అయిపోయారు.

టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేసి జిల్లాలో చ‌క్రం తిప్పిన ఆదినారాయ‌ణ‌రెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ లాంటి ముఖ్య నేత‌లే జ‌గ‌న్‌ను త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌నే ఆలోచ‌న‌తో బీజేపీలో చేరిపోయారు.

జిల్లాలో ఉన్న మిగ‌తా టీడీపీ నేత‌ల్లో ఎక్కువ మంది పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. పార్టీని మ‌ళ్లీ గాడిన పెట్టేందుకు అన్ని జిల్లాల్లో స‌మీక్ష నిర్వ‌హిస్తున్న చంద్ర‌బాబు నాయుడు సోమ‌వారం క‌డ‌ప‌లో నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశం జిల్లాలో టీడీపీ ప‌రిస్థితికి అద్దం ప‌ట్టింది. ఎమ్మెల్సీలు బీటెక్‌ ర‌వి, శివ‌నాథ‌రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజులురెడ్డి, బ‌ద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజ‌య‌మ్మ‌, రాయ‌చోటి మాజీ ఎమ్మెల్యే పాల‌కొండ్రాయుడు, ప‌లువురు నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌లు స‌మీక్షా స‌మావేశానికి డుమ్మా కొట్టారు.

జిల్లాలో తెలుగుదేశం పార్టీ భ‌విష్య‌త్‌పై నేత‌ల్లో అప‌న‌మ్మ‌కం ఉంది. జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో 30 వేల నుంచి 90 వేల మెజారిటీ వైసీపీకి వ‌స్తోంది. ఈ ప‌రిస్థితుల్లో టీడీపీలో ఉంటే భ‌విష్య‌త్ ఉంటుందా అనే ఆందోళ‌న ఆ పార్టీ నేత‌ల్లో ఉంది.

కాగా, మ‌రికొంద‌రు నేత‌లు మాత్రం వైసీపీలోకి వెళ్ల‌లేక‌, ప్ర‌త్యామ్నాయం లేక‌, టీడీపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేక ఆ పార్టీలోనే కొన‌సాగుతున్నారు. అయితే, క‌డ‌ప జిల్లాలో పార్టీ బ‌లోపేతంపై చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్టాల్సిన త‌క్ష‌ణ అవ‌స‌రం అయితే ఉంది.

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   15 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   18 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   19 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   20 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle