newssting
BITING NEWS :
*ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-అశ్వత్థామరెడ్డి *తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ *రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి శివసేన ఎంపీ లేఖ.. రాజ్యసభలో మేం కూర్చునే వరస క్రమాన్ని మార్చడంపై అభ్యంతరం *ఢిల్లీ: ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ... రైతు సమస్యలపై చర్చించేందుకే వెళ్లానన్న శరద్ పవార్ *హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ లోని హీరో నాని, వెంకటేష్, రామానాయుడు స్టూడియోల్లో ఐటీ అధికారుల సోదాలు *కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన లోక్‌సభ ఎంపీల భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు.. 10 వేలకు పైగా ప్లెక్సీలు తొలగించిన జీహెచ్‌ఎంసీ*బేగంపేట్‌-అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్ విధానంలో మెట్రోసేవలు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

జ‌గ‌న్ ఆఫ‌ర్ అందుకుంటారా..?

12-05-201912-05-2019 08:42:07 IST
Updated On 28-06-2019 15:01:51 ISTUpdated On 28-06-20192019-05-12T03:12:07.717Z12-05-2019 2019-05-12T03:00:03.400Z - 2019-06-28T09:31:51.214Z - 28-06-2019

జ‌గ‌న్ ఆఫ‌ర్ అందుకుంటారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప‌లువురు అభ్య‌ర్థుల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. గెలిపించి పంపించండి మంత్రిని చేస్తాను అంటూ జ‌గ‌న్ ముగ్గురు వైసీపీ అభ్య‌ర్థుల‌కు అధికారికంగా ప్ర‌జ‌ల ముందే హామీ ఇచ్చారు. ఇలా హామీ పొందిన వారు ఎన్నిక‌ల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి వ‌స్తే చాలు మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌డం ఖాయ‌మే.

మంత్రి నారా లోకేష్ పోటీ చేసిన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని వైసీపీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. లోకేష్ పోటీ చేస్తార‌ని తెలియ‌క‌ముందు ఇక్క‌డి నుంచి వేరే అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని ఆ పార్టీ భావించినా లోకేష్ పోటీ చేస్తార‌ని తెలియ‌గానే ఆయ‌న‌కు ధీటైన అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డినే దింపారు జ‌గ‌న్. ముఖ్య‌మంత్రి కుమారుడు కావ‌డం, మంత్రి అవ్వ‌డం వ‌ల్ల నారా లోకేష్ కు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో సానుకూలత ఏర్ప‌డింది.

మంత్రి అవ్వ‌డం వ‌ల్ల లోకేష్ గెలిస్తే అభివృద్ధి జ‌రుగుతుంద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉండ‌టం వైసీపీకి మైన‌స్ అవుతుంద‌ని గుర్తించిన జ‌గ‌న్.. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తాన‌ని ప్ర‌చార స‌భ‌లోనే ప్ర‌క‌టించారు. మొద‌టి ఎన్నిక‌ల్లోనే నారా లోకేష్ ను ఓడించి టీడీపీని ఇరుకున పెట్టాల‌ని సైతం జ‌గ‌న్ ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఆళ్లకు కొంత మేలు జ‌రిగింది.

ఇక‌, ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌పై దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ విజ‌యం సాధించారు. ఈసారి మ‌ళ్లీ వీరిద్ద‌రే పోటీ ప‌డ్డారు. దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ బ‌ల‌మైన అభ్య‌ర్థిగా ఉన్నారు. దీంతో బాలినేనికి జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి హామీని ప్ర‌జ‌ల్లోనే ఇచ్చారు.

వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌ర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంత్రి ప‌దవి వ‌దులుకొని మ‌రీ జ‌గ‌న్ వెంట న‌డిచారు. ఈ కృత‌జ్ఞ‌త‌తో పాటు బాలినేని గెలుపున‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే ఉద్దేశ్యంతో జ‌గ‌న్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఇది బాలినేని శ్రీనివాస్ రెడ్డికి బాగా క‌లిసివ‌చ్చింద‌ని పోలింగ్ స‌ర‌ళి బ‌ట్టి వైసీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

ఇక‌, ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడుపైన కుప్పంలో పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్ర‌మౌళికి కూడా జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి హామీ ఇచ్చారు. ఆయ‌న‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తాన‌ని చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఆయ‌న‌కు ఈ హామీ ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌మౌళిపై చంద్ర‌బాబు 47 వేల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఈసారి జ‌గ‌న్ ఇచ్చిన హామీతో చంద్ర‌మౌళికి ఓట్లు పెరుగుతాయ‌ని, చంద్ర‌బాబు మెజారిటీ త‌గ్గుతుంద‌ని వైసీపీ నేత‌లు అంచ‌నా వేసుకుంటున్నారు.

మొత్తంగా జ‌గ‌న్ నుంచి మంత్రి ప‌ద‌వి హామీ పొందిన ముగ్గురు నెత‌ల్లో చంద్ర‌మౌళి మిన‌హా మిగ‌తా ఇద్ద‌రూ టీడీపీకి గ‌ట్టి పోటీనే ఇచ్చారు. ఒక‌వేళ గ‌నుక వీరు గెలిచి, వైసీపీ అధికారంలోకి వ‌స్తే మంత్రిల‌వ్వ‌డం ఖాయం. మ‌రి, వీరి జాత‌కాలు ఎలా ఉంటాయో 23న తేల‌నుంది.

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

   11 hours ago


ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

   12 hours ago


టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

   13 hours ago


ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

   14 hours ago


మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన  వైకాపా ఎంపీ

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన వైకాపా ఎంపీ

   16 hours ago


జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

   16 hours ago


ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

   17 hours ago


బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!?  అలర్టైన ఏపీ సీఎం!

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!? అలర్టైన ఏపీ సీఎం!

   19 hours ago


ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

   19 hours ago


 ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

   19 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle