newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

జ‌గ‌న్‌.. బాబులా మిగిలిపోతారా..?

20-06-201920-06-2019 07:54:22 IST
Updated On 21-06-2019 14:54:51 ISTUpdated On 21-06-20192019-06-20T02:24:22.315Z20-06-2019 2019-06-20T02:13:57.448Z - 2019-06-21T09:24:51.160Z - 21-06-2019

జ‌గ‌న్‌.. బాబులా మిగిలిపోతారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఒక సెంటిమెంట్‌లా మారింది. ఇందుకోసం ఉద్య‌మాలు జ‌ర‌గ‌కున్నా ప్ర‌త్యేక హోదా వ‌స్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని, హోదా త‌మ హ‌క్కు అనే భావ‌న మాత్రం ప్ర‌జ‌ల్లో ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌లప‌డుతుంద‌నుకున్న స‌మ‌యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవ‌డానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం. ఇచ్చిన నిధుల లెక్క‌లను ప‌క్క‌న‌పెట్టి చివ‌ర‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వలేద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉండ‌టంతో ఆ పార్టీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది.

బీజేపీతో పొత్తు పెట్టుకొని నాలుగేళ్లు ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీపైనా ఈ ఎఫెక్ట్ భారీగానే ప‌డింది. ప్ర‌త్యేక ప్యాకేజీకి అంగీక‌రించ‌డం, చివ‌ర‌కు మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా కావాల‌ని చెప్ప‌డం ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌లేదు. హోదా ఇవ్వ‌క‌పోయినా బీజేపీతో నాలుగేళ్లు చంద్ర‌బాబు ఉండి ఎన్నిక‌ల ముందు బ‌య‌ట‌కు వ‌చ్చార‌నే వాద‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. దీంతో ఆ పార్టీకి కూడా ఎన్నిక‌ల్లో కోలుకోలేని దెబ్బ త‌గిలింది. అయితే, ఒంటరిగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగే బ‌లం ఉన్న మోడీతో స‌ఖ్య‌త‌గా ఉండ‌ట‌మే మేల‌ని చంద్ర‌బాబు మొద‌ట్లో భావించారు.

ప్ర‌త్యేక హోదా నినాదం ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌డం, విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌కుండా బీజేపీ, టీడీపీ మోసం చేస్తుంద‌నే వాద‌న‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజ‌ల్లోకి తీసుకెళ్ల‌డంతో టీడీపీ బీజేపీ నుంచి సైడ్ అయిపోయి తీవ్రంగా వ్య‌తిరేకించింది. నాలుగేళ్ల ముందు న‌రేంద్ర మోడీని పొగిడిన టీడీపీ నేత‌లే త‌ర్వాత అనేక విమ‌ర్శ‌లు చేశారు. బీజేపీపై ఉన్న వ్య‌తిరేక‌త త‌మ‌కు అంట‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించినా ఆయ‌న వ్యూహం విఫ‌ల‌మైంది.

కాగా, ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైఖరి కూడా 2014 త‌ర్వాత చంద్ర‌బాబు అవ‌లంభించిన వైఖ‌రిలానే ఉంది. కేంద్రంలో గ‌తం కంటే ఎక్కువ సీట్లు సాధించిన న‌రేంద్ర మోడీతో క‌య్యం కంటే స‌ఖ్య‌తే మేల‌ని జ‌గ‌న్ అంటున్నారు. ఇదే మాట అప్పుడు చంద్ర‌బాబు చెప్పారు. బీజేపీతో క‌లిసే ఉన్నారు. అయినా, రాష్ట్రానికి పెద్ద‌గా ఒరిగిందేమీ లేదు.

ఇప్పుడు కూడా ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయ‌మ‌ని బీజేపీ గ‌ట్టిగా చెబుతోంది. అయినా జ‌గ‌న్ మాత్రం హోదా కోసం త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీలో తీర్మాణం చేయ‌డంతో పాటు క‌లిసిన‌ప్పుడ‌ల్లా మోడీనే ఇదే అడుగుతాన‌న్నారు. అయితే, ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్ ముందునుంచీ ఒకే స్టాండ్ మీద ఉన్నారు. ఇది ఆయ‌న‌కు ఎన్నిక‌ల్లో చాలా ప్ల‌స్ అయ్యింది. జ‌గన్ గెలిస్తే హోదా తెస్తాడ‌నే నమ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డింది.

ఒక‌వేళ జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించి ప్ర‌త్యేక హోదా సాధించ‌గ‌లిగితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్లో హీరో కావ‌డం ఖాయం. అదే క‌నుక సాధించ‌లేక‌పోతే మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబులా ఈ విష‌యంలో విఫ‌ల‌మైన‌ట్లే.

పైగా బీజేపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త కొన‌సాగుతుంది. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సైతం ఈ వ్య‌తిరేక‌త మోయాల్సి రాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కూడా బీజేపీతో స్నేహంగా ఉంటున్నందున ఆ పార్టీపై వ్య‌తిరేక‌త‌ను మోయాల్సిందే. మొత్తంగా బీజేపీతో ఎక్కువ దోస్తీ చేసినా జ‌గ‌న్‌కు క‌ష్ట‌మే.. ఎక్కువ దుష్మ‌న్ అయినా క‌ష్ట‌మే అన్న‌ట్లు ఉంది వ్య‌వ‌హారం.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle