newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

జ‌గ‌న్‌లో అసంతృప్తి ఎందుకో..?

13-09-201913-09-2019 08:00:02 IST
2019-09-13T02:30:02.535Z13-09-2019 2019-09-13T02:29:35.162Z - - 20-09-2019

జ‌గ‌న్‌లో అసంతృప్తి ఎందుకో..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారట‌. ప్ర‌భుత్వం తీసుకుంటున్న అనేక మంచి నిర్ణ‌యాలు, అమ‌లులోకి తీసుకొస్తున్న ప‌థ‌కాల‌కు త‌గినంత ప్ర‌చారం ద‌క్క‌డం లేద‌ని, ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం లేద‌నేది ఆయ‌న భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మీడియా మేనేజ్‌మెంట్‌లో ముందుండే తెలుగుదేశం పార్టీ ముందు ప్ర‌భుత్వంలో ఉన్నా వైసీపీ తేలిపోతోంది. అందుకే పాజిటీవ్ ప‌బ్లిసిటీ కంటే నెగ‌టీవ్ ప‌బ్లిసిటీనే ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లోకి వెళుతోంది.

ముఖ్య‌మంత్రిగా వంద రోజుల పాల‌న‌ను పూర్తి చేసుకున్న జ‌గ‌న్ కొన్ని మంచి ప‌నులు చేప‌ట్టారు. మ‌రికొన్ని త‌ప్ప‌ట‌డుగులూ ఉన్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కానీ, ఎన్నిక‌ల ముందు న‌వ‌ర‌త్నాల్లో, బ‌డ్జెట్‌లో చెప్పిన చాలా హామీల‌ను అమ‌లు చేసే దిశ‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మ‌రికొన్ని ప‌థ‌కాల అమ‌లుకు టైమ్‌టేబుల్ పెట్టుకున్నారు.

వీటితో పాటు ప‌లు చారిత్ర‌క నిర్ణ‌యాలు సైతం జ‌గ‌న్ తీసుకున్నారు. నామినేటెడ్ ప‌ద‌వులు, ప‌నుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ బిల్లు తేవ‌డం, ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికుల‌కు 75 శాతం రిజ‌ర్వేష‌న్లు, కాంట్రాక్టుల ఖ‌రారుకు జ్యుడిషియ‌ల్ క‌మిటీ ఏర్పాటు వంటి ప‌లు నిర్ణ‌యాలు కీల‌క‌మైన‌వే. వీటిపై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా, కొన్ని స‌మ‌స్య‌లు ఉన్నా చ‌రిత్ర‌లో నిలిచిపోయేవ‌ని వైసీపీ భావిస్తోంది. కానీ, వీటికి కావాల్సినంత ప‌బ్లిసిటీ ద‌క్క‌లేదు.

స‌రిగ్గా ఈ బిల్లులు అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టే స‌మ‌యంలో టీడీపీ ఇత‌ర అంశాల‌ను తెర‌పైకి తీసుకురావ‌డం, అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయ‌డం, ఇలా వాటి ప‌ట్ల చ‌ర్చ జ‌ర‌గ‌కుండా చంద్ర‌బాబు వ్యూహం బాగానే ప‌నిచేసింది.

ఇక‌, ఇటీవ‌ల కూడా జ‌గ‌న్ తీసుకుంటున్న అనేక నిర్ణ‌యాల కంటే ఇసుక కొర‌త‌, వ‌ర‌ద నివార‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌నేదే ఎక్కువగా ప్ర‌జ‌ల్లోకి టీడీపీ తీసుకెళ్ల‌గ‌లిగింది. రాజ‌ధాని వ్య‌వ‌హారంలో నెల‌కొన్న గంద‌ర‌గోళం కూడా ప్ర‌భుత్వం చేప‌ట్టిన మంచి ప‌నుల‌కు మైలేజ్ ద‌క్క‌కుండా చేసింద‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి.

ఇక‌, తాజాగా టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌లు, చంద్ర‌బాబు హౌజ్ అరెస్ట్ వంటివి స్థానిక మీడియా నుంచి జాతీయ మీడియా వ‌ర‌కు పెద్ద ఎత్తున వైర‌ల్‌గా మారాయి.

టికి వైసీపీ కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసినా పెద్ద‌గా స‌క్సెస్ కాలేద‌నే చెప్పాలి. గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా సోష‌ల్ మీడియాలో, బ‌య‌ట ప్ర‌చారం క‌ల్పించుకోవ‌డంలో బ‌ల‌మైన మీడియా మ‌ద్ద‌తు ఉన్న టీడీపీని ఎదుర్కున్న వైసీపీ ఇప్పుడు ప్ర‌భుత్వంలోకి వ‌చ్చాక విఫ‌ల‌మ‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అందుకే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ విష‌యంలో కొంత అసంతృప్తిగా ఉన్నార‌ని తెలుస్తోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle