newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

జ‌గ‌న్‌పై పోరాడేందుకు ఆయుధం దొరికిన‌ట్లే..!

25-06-201925-06-2019 14:40:25 IST
Updated On 25-06-2019 15:02:34 ISTUpdated On 25-06-20192019-06-25T09:10:25.905Z25-06-2019 2019-06-25T09:09:01.435Z - 2019-06-25T09:32:34.361Z - 25-06-2019

జ‌గ‌న్‌పై పోరాడేందుకు ఆయుధం దొరికిన‌ట్లే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
త‌న‌కు 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకువ‌స్తాన‌ని, ఎంపీలంతా ఒక్కతాటిపై నిల‌బ‌డి పార్లమెంటులో పోరాడుతార‌ని ఎన్నిక‌ల ముందు వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రచార నినాదంగా మార్చుకున్నారు. ప్రత్యేక హోదాపై జ‌గ‌న్ ముందునుంచీ ఒకే స్టాండ్‌పైన ఉన్నారు. ప్రత్యేక హోదానే రాష్ట్రానికి సంజీవ‌ని అని గ‌ట్టిగా వాదిస్తున్నారు.

ఊరూరా తిరిగి యువ‌భేరీలు పెట్టి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజ‌ల్లో ఉంచేందుకు ప్రయ‌త్నించారు. జ‌గ‌న్ ఇంత భారీ విజ‌యాన్ని సాధించేందుకు క‌లిసి వ‌చ్చిన అంశాల్లో ఇది కూడా ఒక‌టి. అయితే, ఇప్పుడు ఇదే ప్రత్యేక హోదా అంశం జ‌గ‌న్‌ను ఇరుకున పెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ఇప్పుడు జ‌గ‌న్‌పై పోరాడేందుకు ప్రతిప‌క్షాలు ఆయుధంగా వాడుకోబోతున్నాయి.

అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ కేంద్రంపై పోరాటం కంటే స‌ఖ్యత‌నే మేల‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు కేంద్రం ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు మొగ్గు చూప‌డ‌టం లేదు. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సోమ‌వారం పార్ల‌మెంటులో ఏపీకి హోదా ఇచ్చే ప్ర‌తిపాద‌న‌లు ఏమీ లేవ‌ని మ‌రోసారి తేల్చిచెప్పారు.

ఈ అంశం ఆధారంగానే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాలు న‌డిచే అవ‌కాశం ఉంది. ప్రత్యేక హోదా తెస్తార‌నే న‌మ్మ‌కంతోనే వైసీపీకి ప్రజ‌లు 22 మంది ఎంపీల‌ను గెలిపించార‌ని, కాబ‌ట్టి ప్రత్యేక హోదా తీసుకువ‌చ్చేందుకు వైసీపీ ఏం చేస్తోంద‌ని ఇప్పటికే తెలుగుదేశం స‌హా ఇత‌ర ప్రతిప‌క్ష పార్టీలు ప్రశ్నలు ప్రారంభించాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌క‌ట‌న తెలుగుదేశం వారికి ఆయుధంగా దొరికింది.

ఇప్ప‌టికే సీపీఐ కార్యద‌ర్శి రామ‌కృష్ణ ప్రత్యేక హోదా కోసం అఖిల‌ప‌క్షం ఏర్పాటుచేయాల‌ని జ‌గ‌న్‌కు లేఖ రాశారు. పోరాటాల ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యమ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు.

ఇక‌, తెలుగుదేశం పార్టీ కేంద్రంపై పోరాటానికి విరామం ప్రక‌టించినా ప్రత్యేక హోదా అంశంపై జ‌గ‌న్‌ను ఇరుకున పెట్టేందుకు సిద్ధం అవుతోంది. దీంతో రానున్న రోజుల్లో ప్రత్యేక హోదా కోసం ఆందోళ‌న‌లు, పోరాటాలు పెరిగే అవ‌కాశం ఉంది.

జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్ ఈ మేర‌కు ఆందోళ‌న‌లు ప్రారంభించ‌వ‌చ్చు. తెలుగుదేశం సైతం ఈ మేర‌కు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసి ప్ర‌జ‌ల్లోకి వెళ్లే అవ‌కాశం ఉంది. ఇదే జ‌రిగితే రాష్ట్ర ప్ర‌భుత్వం వైఖ‌రి ఏంట‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అధికారంలో ఉన్నందున క‌చ్చితంగా ఆందోళ‌న‌ల‌ను నియంత్రించేందుకు ప్ర‌య‌త్నించాల్సిందే. ఇదే చేస్తే ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని జ‌గ‌న్ అణిచేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ‌తాయి.

చంద్ర‌బాబు సైతం ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడ ఇందుకు మిన‌హాయింపు ఏమీ కాదు. ఇదే స‌మ‌యంలో కేంద్రంపై పోరాడేందుకు జ‌గ‌న్ సుముఖంగా లేరు.

క‌లిసిన‌ప్పుడ‌ల్లా ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని అడ‌గ‌డం త‌ప్పితే ఏమీ చేయ‌లేమ‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే స్ప‌ష్టంగా చెప్పారు. జ‌గ‌న్ పోరాడ‌క‌పోయినా ఇత‌ర పార్టీలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో రానున్న రోజుల్లో ప్ర‌త్యేక హోదా అంశం జ‌గ‌న్‌పై పోరాడేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ఆయుధంగా మార‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle