newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

జ‌గ‌న్‌పై ఆ ముద్ర వేస్తున్నారా..??

26-07-201926-07-2019 08:33:43 IST
Updated On 26-07-2019 12:25:52 ISTUpdated On 26-07-20192019-07-26T03:03:43.930Z26-07-2019 2019-07-26T03:03:35.774Z - 2019-07-26T06:55:52.694Z - 26-07-2019

జ‌గ‌న్‌పై ఆ ముద్ర వేస్తున్నారా..??
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఇటీవ‌ల ఓ ప్ర‌చారం పెద్ద ఎత్తున ప్రారంభ‌మైంది. త‌న స్వంత మ‌తానికి జ‌గన్ పెద్ద‌పీట వేస్తున్నార‌నేది ఈ ప్ర‌చారం సారాంశం. ముఖ్యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్ సీఎం అయిన నాటి నుంచి పెద్ద ఎత్తున ఈ ప్ర‌చారం ప్రారంభం కాగా ఎక్కువ‌గా హిందువుల మ‌నోభావాలు దెబ్బ తీసేలా జ‌రుగుతోంది. హిందువుల‌కు వ్య‌తిరేకంగా జ‌గ‌న్ ప‌ని చేస్తున్నార‌నేది ఈ ప్ర‌చారం వెనుక ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.

క్షేత్ర‌స్థాయిలో పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ఈ ప్ర‌చారానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వైఎస్ కుటుంబం క్రైస్త‌వ మ‌తాన్ని ఆచ‌రిస్తుంద‌నేది రాష్ట్రంలో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే, వైఎస్సార్ ను ఒక మ‌తానికి చెందిన నేత‌గా ఏపీ ప్ర‌జ‌లు చూడ‌లేదు. అందుకే ఆయ‌నకు ప్ర‌జ‌లు రెండుసార్లు అధికారం క‌ట్ట‌బెట్టారు. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత వైఎస్ కుటుంబంపై కొంత మ‌తం ముద్ర ప‌డింది. ముఖ్యంగా వైసీపీ గౌర‌వాధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ బైబిల్‌ను చేతిలో పట్టుకొని ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డంతో ఆమె ఒక మ‌తానికి ప్ర‌చారం చేస్తోంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆరోప‌ణ‌లు గుప్పించారు.

అయితే, తాను కొత్త‌గా ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నందున కేవ‌లం ధైర్యం కోస‌మే బైబిల్ ప‌ట్టుకుంటున్నాన‌ని ఆమె చెప్పినా ఈ ఆరోప‌ణ‌లు ఆగ‌లేదు. 2014 ఎన్నిక‌ల్లో అంత‌ర్గ‌తంగా వైసీపీ ఒక క్రిష్టియ‌న్ పార్టీ అనే ప్రచారం జ‌రిగింది. ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మికి ఇదీ ఒక కార‌ణ‌మే అని గుర్తించిన జ‌గ‌న్ తర్వాత ఎక్క‌డా త‌న‌పై మ‌తం ముద్ర ప‌డ‌కుండా చూసుకున్నారు. అన్ని మ‌తాలూ త‌న‌కు స‌మాన‌మే అని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

రుషీకేష్‌లో స్వ‌రూపానందేంద్ర ఛాతుర్మాస దీక్ష‌కు వెళ్ల‌డం, ప‌లువురు పీఠాధిప‌తులు, మ‌ఠాధీప‌తుల ఆశీర్వాదం తీసుకోవ‌డం, ప్ర‌తీ ప‌నిని ప్రారంభించే ముందు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డం చేశారు. స్వంత జిల్లా క‌డ‌ప వెళ్లిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న క‌డ‌ప ద‌ర్గా, పులివెందుల సీఎస్ఐ చ‌ర్చి, గండి వీరాంజ‌నేయ స్వామిని ద‌ర్శించుకుంటారు. ఇలా ఎప్పుడూ త‌న‌కు అన్ని మ‌తాలూ స‌మాన‌మేన‌ని జ‌గ‌న్ చెబుతుంటారు. దీంతో ఆయ‌న‌ను కూడా ఒక మ‌తానికి చెందిన నేత‌గా చూడ‌కుండా గ‌త ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం క‌ట్ట‌బెట్టారు ప్ర‌జ‌లు.

ఇక‌, జ‌గ‌న్ గెలిచిన నాటి నుంచి ఆయ‌న క్రిష్టియ‌న్ల‌కు అనుకూలంగా ఉంటున్నారనే ప్ర‌చారం మొద‌లైంది. త‌న బాబాయి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మ‌న్‌గా నియ‌మించేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడైతే దేశ‌వ్యాప్తంగా ఒక క్రిష్టియ‌న్‌కు టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే, సుబ్బారెడ్డి నిత్యం పూజ‌లు చేసే హిందువు. అయినా ఈ ప్ర‌చారంతో త‌న‌కు తాను హిందువున‌ని నిరూపించుకోవాల్సి వ‌చ్చింది.

త‌ర్వాత కూడా నిత్యం సోష‌ల్ మీడియాలో ప్రార్థ‌న‌ల‌కు రానందుకు పింఛ‌న్లు తీసేశారని, ప‌థ‌కాలు ఇవ్వ‌మంటున్నార‌ని ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. తాజాగా, టీటీడీ విద్యాధికారిగా జ‌గ‌న్ బంధువు క్రిష్టోఫ‌ర్‌ను నియ‌మిస్తున్న‌ట్లుగా భారీ ప్ర‌చారం జ‌రిగింది. ఓ వార్తా ఛాన‌ల్‌కు చెందిన వెబ్‌సైట్ కూడా ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించింది. అస‌లు, ఈ ఆలోచ‌న కూడా ప్ర‌భుత్వం చేయ‌లేదు. అంత‌టి పిచ్చి ప‌ని చేసే అవ‌కాశం కూడా లేదు. కానీ, పెద్ద ఎత్తున జ‌రిగిన ఈ ప్ర‌చారంతో టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.

అస‌లు ఎవ‌రు ఇలా ప్ర‌చారం చేస్తున్నార‌నేది వైసీపీ ఆరా తీస్తోంది. రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న ఓ పార్టీ సానుభూతిప‌రులు ఈ ప్ర‌చారం వెనుక ఉండి ఉండ‌వ‌చ్చ‌ని వైసీపీ నేత‌లు అనుమానిస్తున్నారు. త‌మ నాయ‌కుడు అన్ని మ‌తాల‌ను స‌మానంగా చూస్తార‌ని, ఒక మ‌తానికి ప‌క్ష‌పాతిగా ఉండ‌ర‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. గ‌తంలో వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు దూప దీప నైవేధ్యం ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి మూత‌బ‌డ్డ వంద‌లాది ఆల‌యాలు మ‌ళ్లీ తెరిపించార‌ని గుర్తు చేస్తున్నారు. మ‌రి, ఈ ప్ర‌చారాన్ని వైసీపీ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.


Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle