newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా పిల‌వ‌ర‌ట‌.?!

21-11-201921-11-2019 15:08:58 IST
Updated On 21-11-2019 17:01:27 ISTUpdated On 21-11-20192019-11-21T09:38:58.075Z21-11-2019 2019-11-21T08:36:38.340Z - 2019-11-21T11:31:27.542Z - 21-11-2019

జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా పిల‌వ‌ర‌ట‌.?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ధ్య రాజ‌కీయ వైరం కాస్తా శృతిమించి వ్య‌క్తిగ‌త వైరంగా మారుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య ఇటీవ‌లి మాట‌ల‌యుద్ధం, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా చేస్తున్న ట్వీట్ల‌ను చూస్తుంటే ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. జ‌గ‌న్‌ను అస‌లు ముఖ్య‌మంత్రిగా సంబోధించడానికి కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇష్ట‌ప‌డ‌టం లేదు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నాటి నుంచి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుటుంబానికి బ‌ద్ధ వ్య‌తిరేకి. 2009లో యువ‌రాజ్యం అధ్య‌క్షుడి హోదాలో ప్ర‌జారాజ్యం పార్టీ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ విస్తృతంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు.

ఈ స‌మ‌యంలో వైఎస్‌పై, కాంగ్రెస్‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసే వారు. ఒకానొక స‌మ‌యంలో కాంగ్రెస్ నేత‌ల‌ను పంచ‌లూడ‌దీసి కొట్టాల‌ని ఆయ‌న పిలుపునివ్వ‌డం వివాదాస్పద‌మైంది. ఆ స‌మ‌యంలో త‌న వ్యాఖ్య‌లు త‌ప్పేన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌ర్వాత అంగీక‌రించారు.

ఇక‌, 2014లో మ‌ళ్లీ జ‌న‌సేన ద్వారా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీ, బీజేపీతో జ‌ట్టుక‌ట్టి జ‌గ‌న్‌ను, వైసీపీని తీవ్రంగా వ్య‌తిరేకించారు. తీవ్ర విమ‌ర్శ‌లు చేసే వారు. త‌ర్వాత ఐదేళ్ల పాటు వివిధ సంద‌ర్భాల్లోనూ జ‌గ‌న్‌ను ప‌వ‌న్ వ్య‌తిరేకిస్తూ వ‌చ్చారు. జ‌గ‌న్ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఒకానొక స‌మ‌యంలో వ్య‌క్తిగ‌త జీవితంపై విమ‌ర్శ‌లు చేశారు.

దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయ వైరం కాస్తా వ్య‌క్తిగ‌త వైరంగా మారింది. జ‌గ‌న్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రిని కానివ్వ‌న‌ని, ఇదే త‌న శాస‌నం అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు.

కానీ, ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ విజ‌యం సాధించ‌డంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ శ‌ప‌థం నెర‌వేర‌లేదు. త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వ విధానాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, జ‌గ‌న్ ఇద్ద‌రూ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెళ్లిల గురించి మ‌రోసారి జ‌గ‌న్ మాట్లాడారు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆగ్ర‌హం మ‌రింత పెరిగింది.

ఇటీవ‌ల జ‌గ‌న్‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నీసం జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రి అంటూ కూడా సంబోధించ‌డం లేదు. కేవ‌లం వైసీపీ లీడ‌ర్ జ‌గ‌న్ రెడ్డి అని మాత్ర‌మే రాస్తున్నారు.

ఇప్ప‌టికే జ‌గ‌న్ సామాజ‌క‌వ‌ర్గాన్ని ఒత్తి ప‌లికి ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌నే వ్యూహంతో జ‌న‌సేన మొత్తం ఆయ‌న‌ను జ‌గ‌న్ రెడ్డి అని పిలుస్తోంది. ఇప్పుడు ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి అని కాకుండా వైసీపీ లీడ‌ర్ అని మాత్ర‌మే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుస్తుండ‌టంతో జ‌న‌సేన శ్రేణులు కూడా ఇదే ఫాలో అవుతున్నారు.

ఇదే స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ద‌వికి త‌గ్గ గౌర‌వం ఇస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాల‌ని కేసీఆర్‌ను ట్విట్ట‌ర్‌లో కోరిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పెద్ద‌లు, గౌర‌వ ముఖ్య‌మంత్రి అని సంబోధించారు. ఇక‌, చంద్రబాబు నాయుడు గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న‌ను గౌర‌వ ముఖ్య‌మంత్రి గారూ అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంబోధిస్తూ ట్వీట్లు చేసే వారు.

జ‌గ‌న్ - ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య తీవ్ర రాజ‌కీయ వైరం వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దారి తీయ‌డంతోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా కూడా సంబోధించ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదా, లేక మ‌రే ఇత‌ర వ్యూహం ఉందా అనేది ఆయ‌నే క్లారిటీ ఇవ్వాలి. నాయ‌కుల మ‌ధ్య తీవ్ర వైరం రాజ‌కీయాల‌కు అంత మంచిది కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle