newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

జ‌గ‌న్‌కు వార్నింగ్ బెల్స్‌.. మేల్కోక‌పోతే అంతే..!

23-08-201923-08-2019 14:40:37 IST
Updated On 23-08-2019 15:45:32 ISTUpdated On 23-08-20192019-08-23T09:10:37.579Z23-08-2019 2019-08-23T09:10:34.852Z - 2019-08-23T10:15:32.129Z - 23-08-2019

జ‌గ‌న్‌కు వార్నింగ్ బెల్స్‌.. మేల్కోక‌పోతే అంతే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఎంత‌టి వివాదాల‌ను రాజేస్తున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే, ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు జ‌గ‌న్ అన్నీ ఆలోచించి, వివాదాల‌ను ఎదుర్కునేందుకు సిద్ధ‌ప‌డే తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టంగా చెబుతున్నారు. కానీ, ఇటీవ‌ల కొన్ని విష‌యాల్లో జ‌గ‌న్, ప్ర‌భుత్వ ప్ర‌మేయం లేకుండా వివాదాలు చుట్టుముడుతున్నాయి. చిన్న చిన్న నిర్ల‌క్ష్యాల కార‌ణంగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి అస్త్రాలుగా మారుతున్నాయి.

క్రైస్త‌వ మ‌తాన్ని ఆచ‌రించే జ‌గ‌న్‌పై ముందు నుంచీ మ‌త ముద్ర వేసేందుకు ప్ర‌త్య‌ర్థులు ప్ర‌య‌త్నాలు చేశారు. ఆయ‌న త‌ల్లి విజ‌య‌మ్మ బైబిల్ ప‌ట్టుకొని తిర‌గ‌డం, బావ అనీల్ కుమార్ మ‌త ప్ర‌చారం చేయ‌డం వంటివి ప్ర‌త్య‌ర్థులూ లేవ‌నెత్తేవారు.

అయితే, జ‌గ‌న్ మాత్రం అన్ని మ‌తాలు త‌న‌కు స‌మాన‌మే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం, హిందూ ఆల‌యాలు సంద‌ర్శించ‌డం, స్వరూపానందేంద్ర, చిన‌జీయ‌ర్ స్వాముల ఆశీస్సులు తీసుకోవ‌డం వంటివి చేయ‌డంతో ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌పై మ‌త ముద్ర ప‌నిచేయ‌లేదు.

అయితే, అధికారంలోకి వ‌చ్చాక మాత్రం మతం ఆధారంగా జ‌గ‌న్‌, ఆయ‌న ప్ర‌భుత్వం వివాదాల్లో చిక్కుకుంటోంది. ముఖ్యంగా రాష్ట్రంతో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాల‌ని భావిస్తున్న బీజేపీకి ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతోంది. చిన్న నిర్ల‌క్ష్యాలు, అప్ర‌మ‌త్తంగా లేక‌పోవ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.

టీటీడీ ఛైర్మ‌న్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియ‌మించే స‌మ‌యంలో ఆయ‌న క్రైస్త‌వుడు అంటూ పెద్ద ఎత్తున బీజేపీ అనుకూల సోష‌ల్ మీడియా ప్ర‌చారం చేసింది. సుబ్బారెడ్డి ప‌క్కా హిందువు అని వైసీపీ ముందే స‌మ‌ర్థంగా చెప్ప‌లేక‌పోయింది.

ఇక‌, ఇటీవ‌ల శ్రీశైలంలో దుకాణాల వేలం సంద‌ర్భంగా పెద్ద వివాదం చెల‌రేగింది. అన్య‌మ‌త‌స్తుల‌కు దుకాణాలు కేటాయిస్తున్నార‌ని ఆరోపిస్తూ బీజేపీ చ‌లో శ్రీశైలం కార్య‌క్ర‌మాన్ని పిలుపునివ్వ‌డం, పోలీసులు అడ్డుకోవ‌డం వంటివి జ‌రగ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం హిందువుల‌పై దాడిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం జ‌రిగింది.

కేవ‌లం ఎండోమెంట్ అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల అన్య‌మ‌త‌స్తులు దుకాణాల వేలంలో పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో దేవాద‌య శాఖ మంత్రి త‌ర్వాత విష‌యం తెలుసుకొని ఈవీపై బ‌దిలీ వేటు వేశారు.

నిన్న తిరుమ‌ల వెళ్లే బ‌స్సు టిక్క‌ట్ల వెన‌కాల జెరూస‌లేం, హ‌జ్ యాత్ర‌కు సంబంధించిన ఓ ప్ర‌క‌ట‌న ద‌ర్శ‌న‌మివ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌యాణికులు ఈ ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయడం, హిందువుల‌కు ఎంతో ప‌విత్ర‌మైన తిరుమ‌ల‌లో అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని, జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌ల్లే ఇలా జ‌రుగుతోంద‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇక్క‌డ కూడా అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం తిరుమ‌ల‌లో అన్య‌మ‌తాన్ని ప్రోత్స‌హిస్తోంద‌ని అనే ఆరోప‌ణ‌ల‌ను మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇక‌, అమెరికా ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్.. జ్యోతిప్ర‌జ్వళ‌ణ‌ను నిరాక‌రించి హిందువుల‌ను అవ‌మానించారని బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జి సునిల్‌, ఎంపీ సీఎం ర‌మేశ్, బీజేపీ అధికారిక పేజీ సోష‌ల్ మీడియాలో ఓ చిన్న వీడియో పోస్ట్ చేయ‌గా ఇది విస్తృతంగా వైర‌ల్ అయ్యింది.

త‌ర్వాత విష‌యం గుర్తించిన వైసీపీ అక్క‌డ జ‌గ‌న్ త‌ప్పు లేదు బాబోయ్ అది ఎల‌క్ట్రానిక్ దీపం అంటూ స‌మాధానం చెప్పుకోవాల్సి వ‌చ్చింది. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

నిన్న‌నే తిరుప‌తిలో అలిపిరి వెళ్లే మార్గంలో మ‌ద్యం దుకాణాలు పెట్ట‌కుండా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒక మంంచి నిర్ణ‌యం తీసుకుంది. కానీ టిక్కెట్లలో మ‌త ప్ర‌చారం వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డంతో ఇదే హైలెట్ అయ్యింది.

ఈ వివాదాల‌న్నీ జ‌గ‌న్‌కు, ప్ర‌భుత్వానికి ఒక వార్నింగ్ బెల్స్ వంటివి. మ‌తం విష‌యంలో అప్ర‌మ‌త్తంగా లేక‌పోతే జ‌గ‌న్‌కు రానున్న రోజుల్లో మ‌రిన్ని తిప్ప‌లు త‌ప్ప‌వు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle