newssting
BITING NEWS :
*ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం *ఏపీలో మరో ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్.. తెలంగాణలో ప్రభుత్వ విప్ సునీతకు కరోనా పాజిటివ్ నిర్దారణ *గోల్కొండ, చార్మినార్ సందర్శనకు అనుమతి *అమరావతి ఉద్యమానికి 200 రోజులు... కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే నిరసనలు తెలపాలని పిలుపు. ఊరిలో 10 మంది చొప్పున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చిన అమరావతి జేఏసీ. *హైదరాబాద్: పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ నేడు కాంగ్రెస్ ఆందోళనలు. తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్న కాంగ్రెస్*తెలంగాణలో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1892 పాజిటివ్ కేసులు న‌మోదు, ఎనిమిది మంది మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,658 కొత్త క‌రోనా కేసులు*ఏపీ: మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర అరెస్ట్.. తుని మండలం సీతారాంపురం ద‌గ్గ‌ర కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు*ఢిల్లీ: కరోనా వ్యాప్తి కారణంగా జేఈఈ, నీట్ వాయిదా.. జేఈఈ మెయిన్ ప‌రీక్ష‌లు సెప్టెంబర్ 1 నుంచి 6 వ తేదీ మధ్య, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ సెప్టెంబర్ 27న.. నీట్ సెప్టెంబర్ 13న నిర్వ‌హ‌ణ*ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో కంపించిన భూమి... రిక్ట‌ర్ స్కేల్‌పై తీవ్ర‌త 4.5గా న‌మోదు*ఢిల్లీ: లోకసభ స్పీకర్‌ను క‌లిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై ఫిర్యాదు*భారత ప్రధాని మోడీ లఢఖ్ పర్యటన గురించిన సమాచారం మాకు ముందే తెలుసని చైనా విదేశాంగ శాఖ ప్రకటన*ఏపీలో కొత్తగా 837 కరోనా కేసులు నమోదు. 9 మరణాలు. ఏపీలో 16,934కి చేరిన కరోనా కేసులు. ఇప్పటి వరకు 206కరోనా మరణాలు*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 6,44,404...మరణాలు 18597

జ‌గ‌న్‌కు బలాన్నిచ్చిన య‌డియూర‌ప్ప నిర్ణ‌యం

24-02-202024-02-2020 07:37:09 IST
Updated On 24-02-2020 17:31:16 ISTUpdated On 24-02-20202020-02-24T02:07:09.891Z24-02-2020 2020-02-24T02:06:52.559Z - 2020-02-24T12:01:16.606Z - 24-02-2020

జ‌గ‌న్‌కు బలాన్నిచ్చిన య‌డియూర‌ప్ప నిర్ణ‌యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ జ‌రిపి రాష్ట్రానికి మూడు రాజ‌ధానులు ఏర్పాటుచేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇప్పుడు భారీ అండ దొరికింది. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తున్న‌, రాజ‌ధాని మొత్తం ఒకే చోట ఉండాల‌ని డిమాండ్ చేస్తున్న వారికి క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఇబ్బందిక‌రంగా మారింది. ఇదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ నిర్ణ‌యం జ‌గ‌న్ ఆలోచ‌న‌కు బ‌లం చేకూర్చేలా ఉంది. పైగా వైస్ జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ఆలోచ‌న‌కు బ‌లం చేకూరింది.

క‌ర్ణాట‌క‌లో రాజ‌ధానిని వికేంద్రీక‌రించాల‌ని అక్క‌డి భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టింది. ఉత్త‌ర క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల్లో త‌మ ప్రాంతానికి అన్యాయం జ‌రుగుతుంద‌నే భావ‌న చాలా రోజులుగా ఉంది. అందుకే ఈ ప్రాంతానికి కూడా రాజ‌ధానిని వికేంద్రీక‌రించాల‌నే ఆలోచ‌న రెండు ద‌శాబ్దాలుగా ఉంది. చివ‌ర‌కు ఇప్పుడు య‌డియూర‌ప్ప స‌ర్కార్ బెంగ‌ళూరు నుంచి తొమ్మిది ప్ర‌భుత్వ కార్యాలయాల‌ను ఉత్త‌ర క‌ర్ణాట‌క‌కు త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను బీజేపీ స‌హా విప‌క్ష పార్టీలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. రాజ‌ధాని అనేది ఒకే ప్రాంతంలో ఉండాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కో కార్యాల‌యం ఒక్కో చోట ఉండ‌టం వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌తార‌ని, ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో ఎక్క‌డా ఇలా లేద‌ని వాదిస్తున్నాయి. ఈ వాద‌న‌ల‌కు ఖండించ‌డానికి క‌ర్ణాట‌క తీసుకున్న నిర్ణ‌యం ఒక ఉదాహ‌ర‌ణ‌గా మ‌న రాష్ట్ర ప్ర‌భుత్వానికి మార‌బోతోంది.

క‌ర్ణాట‌క‌లో ఈ నిర్ణ‌యం తీసుకుంది బీజేపీ ప్ర‌భుత్వం కావ‌డం జ‌గ‌న్‌కు మ‌రింత క‌లిసొచ్చింది. జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని ఏపీలో బీజేపీ, ఆ పార్టీ మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన పార్టీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. అమ‌రావ‌తిలో మాత్ర‌మే రాజ‌ధాని ఉండాల‌ని ఉంటున్నాయి. ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో బీజేపీనే రాజ‌ధాని వికేంద్రీక‌రించాల‌ని నిర్ణ‌యించ‌డంతో నైతికంగా ఏపీ బీజేపీ చేస్తున్న వాద‌న‌కు ఇబ్బంది ఎదురుకానుంది. జ‌న‌సేన ప‌రిస్థితి కూడా అంతే.

ఇక‌, రాజ‌ధాని ఎక్క‌డ పెట్టాల‌నేది రాష్ట్ర ప్ర‌భుత్వం ఇష్ట‌మ‌ని, కేంద్రం జోక్యం ఉండ‌ద‌ని ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇచ్చింది. కానీ, కేంద్రం ఒకే రాజ‌ధాని ఉండాల‌ని చెప్పింద‌ని, బ‌హుళ రాజ‌ధానుల‌కు అంగీక‌రించ‌లేద‌ని, జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని కేంద్రం అడ్డుకుంటుంద‌ని అమ‌రావ‌తికి అనుకూలంగా ఉన్న వారు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు.

ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో రెండు రాజ‌ధానులు కాక‌పోయినా రాజ‌ధానిని వికేంద్రీక‌రించాల‌ని నిర్ణ‌యించ‌డాన్ని కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ వ్య‌తిరేకించే అవ‌కాశ‌మే లేదు. ఈ రకంగా జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ఆలోచ‌న‌నూ కేంద్రం వ్యతిరేకించే అవ‌కాశాలు త‌క్కువే.

క‌ర్ణాట‌క‌లో ద‌క్షిణాదిన ఉన్న బెంగ‌ళూరులో అధికారం, అభివృద్ధి కేంద్రీకృత‌మైంది. దీనిపై ఉత్త‌ర క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంది. త‌మ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవ‌డం లేద‌నే భావ‌న ఉంది. ఇప్పుడు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఉత్త‌ర క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గుర్తించింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇదే ప‌రిస్థితి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ఉంది. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌లు అభివృద్ధికి దూరమ‌వుతున్నాయ‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది. దీంతో తాము కూడా క‌ర్ణాట‌క‌లానే అభివృద్ధికి నోచుకొని ప్రాంతాల ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించి అభివృద్ధిని వికేంద్రీక‌రిస్తున్నామ‌ని చెబుతుంది. ఇలా ఏ ర‌కంగానైనా య‌డ్యూర‌ప్ప స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యం జ‌గ‌న్‌కు మూడు రాజ‌ధానుల విష‌యంలో చాలా మేలు చేసే అవ‌కాశం ఉంది.

 

బందరులో ఇంకో అలజడి... మరో హత్యాయత్నం, దాడి

బందరులో ఇంకో అలజడి... మరో హత్యాయత్నం, దాడి

   an hour ago


‘‘జనం ఆశలు గల్లంతు.. జగన్ ఉండేది ఇంకో ఏడాదే ’’

‘‘జనం ఆశలు గల్లంతు.. జగన్ ఉండేది ఇంకో ఏడాదే ’’

   2 hours ago


టీటీడీ పాలకమండలి భేటీ... ఉద్యోగులకు కరోనా పరీక్షలు

టీటీడీ పాలకమండలి భేటీ... ఉద్యోగులకు కరోనా పరీక్షలు

   2 hours ago


ఓ జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి.. జగన్‌కు రఘురామ లేఖ

ఓ జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి.. జగన్‌కు రఘురామ లేఖ

   8 hours ago


వైసీపీ ఎమ్మెల్యే, ఓ మాజీమంత్రికి కరోనా పాజిటివ్

వైసీపీ ఎమ్మెల్యే, ఓ మాజీమంత్రికి కరోనా పాజిటివ్

   8 hours ago


రైళ్ళు తిరగక.. ఆదాయం లేక ...హైదరాబాద్ మెట్రోకి కరోనా కష్టాలు

రైళ్ళు తిరగక.. ఆదాయం లేక ...హైదరాబాద్ మెట్రోకి కరోనా కష్టాలు

   9 hours ago


విజయసాయిని ఇలా ఎప్పుడైనా చూశారా?

విజయసాయిని ఇలా ఎప్పుడైనా చూశారా?

   10 hours ago


సేవ్ అమరావతి ఉద్యమానికి 200 రోజులు.. అంగుళం కదల్చలేరన్న విపక్షాలు

సేవ్ అమరావతి ఉద్యమానికి 200 రోజులు.. అంగుళం కదల్చలేరన్న విపక్షాలు

   11 hours ago


ఎంపీ రఘురామ వ్యవహారం.. కాగల కార్యం స్పీకర్ తీరుస్తారా?

ఎంపీ రఘురామ వ్యవహారం.. కాగల కార్యం స్పీకర్ తీరుస్తారా?

   11 hours ago


తునిలో అరెస్ట్... గూడూరు పీఎస్‌లో కొల్లు రవీంద్ర ప్రత్యక్షం

తునిలో అరెస్ట్... గూడూరు పీఎస్‌లో కొల్లు రవీంద్ర ప్రత్యక్షం

   12 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle