newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

జ‌గ‌న్‌కు గుడ్ న్యూస్ వినిపిస్తారా...?

06-08-201906-08-2019 12:05:24 IST
Updated On 08-08-2019 14:35:24 ISTUpdated On 08-08-20192019-08-06T06:35:24.880Z06-08-2019 2019-08-06T06:35:21.921Z - 2019-08-08T09:05:24.771Z - 08-08-2019

జ‌గ‌న్‌కు గుడ్ న్యూస్ వినిపిస్తారా...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఇజ్రాయిల్ ప‌ర్య‌ట‌న నుంచి వ‌చ్చిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయ‌న స‌మావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ఆయ‌న వారితో చ‌ర్చించ‌నున్నారు. అయితే, ఇటీవ‌ల జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాలకు కేంద్రం మోకాల‌డ్డుతోంది. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను కేంద్రం వ్య‌తిరేకిస్తోంది. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థికంగా ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌లు, విభ‌జ‌న హామీల అమ‌లుపై జ‌గ‌న్ కేంద్ర పెద్ద‌ల‌కు విన‌వించ‌నున్నారు. ఇక‌, ప్ర‌త్యేక హోదా ముగిసిన అద్య‌య‌మ‌ని కేంద్రం చెబుతున్నా జ‌గ‌న్ మాత్రం త‌న ప్ర‌య‌త్నాలు ఆప‌డం లేదు. ప్ర‌ధానిని క‌లిసిన‌ప్పుడ‌ల్లా ప్ర‌త్యేక హోదా అడుగుతాన‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న ప్ర‌త్యేక హోదాపై ఆయ‌న మ‌రోసారి ఇవాళ విన‌వించ‌నున్నారు.

ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ బీజేపీతో వైసీపీకి కొంత స‌ఖ్య‌త ఉండేది. కానీ, వైసీపీ ప్ర‌భుత్వంలోకి వ‌చ్చాక కేంద్రంతో దూరం పెరుగుతోంది. వైసీపీ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను కేంద్రం త‌ప్పుప‌డుతుండటం రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర‌డం లేదు. ముఖ్యంగా చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, వాటిని బ‌య‌ట‌పెట్టాల‌ని జ‌గ‌న్ ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు గానూ జ‌గన్ గుర్తించిన అస్త్రాలు పీపీఏ, పోల‌వ‌రం టెండ‌ర్లు.

ఈ రెండింటిలో ఎక్కువ అవినీతికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పాల్ప‌డింద‌ని, పీపీఏల‌ను పున‌స‌మీక్షించి, పోల‌వ‌రం రివ‌ర్స్ టెండరింగ్‌కు వెళ్ల‌డం ద్వారా చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టాలని జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, కేంద్రం జ‌గ‌న్‌ను అడ్డుకుంటోంది. పీపీఏల‌పై పున‌స‌మీక్ష వ‌ద్ద‌ని కేంద్రం జ‌గ‌న్‌కు ఉత్త‌రాల మీద ఉత్త‌రాలు రాస్తోంది. ఈ విష‌యాన్ని న‌రేంద్ర మోడీ తిరుప‌తి వచ్చిన‌ప్పుడు జ‌గ‌న్ ఆయ‌న దృష్టికి తీసుకెళ్లినా ఫ‌లితం లేకుండా పోయింది.

ఇక‌, పోల‌వరంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌నే రాష్ట్ర ప్ర‌భుత్వ వాద‌న‌ను కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. స్వ‌యంగా పార్ల‌మెంటులో ఈ విషయాన్ని కేంద్ర మంత్రి చెప్ప‌డం వైసీపీకి మింగుడు ప‌డ‌టం లేదు. అయినా వెన‌క‌డుగు వేయ‌ని జ‌గ‌న్ తాను నియ‌మించిన నిపుణుల క‌మిటీ సూచ‌న‌ల మేర‌కు పోల‌వ‌రం కాంట్రాక్ట‌రు న‌వ‌యుగ‌ను త‌ప్పించారు. ఈ నిర్ణ‌యాన్ని కూడా కేంద్రం త‌ప్పుప‌ట్టింది.

ఇక‌, ఐఏఎస్‌ల డిప్యూటేష‌న్‌ల వ్య‌వ‌హారాన్నీ కేంద్రం తేల్చ‌డం లేదు. తెలంగాణ‌లో ఉన్న ఐఏఎస్ శ్రీల‌క్ష్మీ, ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర‌లు ఏపీకి వెళ‌తామ‌ని ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం వారిని పంపేందుకు సానుకూలంగా ఉంది. కానీ, కేంద్రం ఈ విష‌యాన్ని నాన్చుతోంది. దీంతో స్వ‌యంగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఐఏఎస్ శ్రీల‌క్ష్మీని తీసుకొని వెళ్లి అమిత్ షాను క‌లిశారు. అయినా, వారికి డిప్యూటేష‌న్ మంజూరు కాలేదు.

దీంతో ఇవాళ మోడీ, అమిత్ షాను క‌ల‌వ‌నున్న జ‌గ‌న్ పోల‌వ‌రం, పీపీఏల్లో జ‌రిగిన అవినీతి, నిపుణుల క‌మిటీ నివేదిక‌ను వారికి వివ‌రించి విచార‌ణ‌కు వారు అనుమ‌తి కోర‌నున్నారు. అధికారుల‌ డిప్యూటేష‌న్ వ్య‌వ‌హారాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ల‌నున్నారు. మ‌రి, జ‌గ‌న్‌కు కేంద్ర పెద్ద‌లు ఏమాత్రం ఆస‌రా ఇస్తారో చూడాలి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle