newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

జ‌గ‌న్‌కు ఎడ‌మ‌క‌న్ను అదురుతోందా..?

02-11-201902-11-2019 07:56:45 IST
2019-11-02T02:26:45.679Z02-11-2019 2019-11-02T02:26:19.646Z - - 13-08-2020

జ‌గ‌న్‌కు ఎడ‌మ‌క‌న్ను అదురుతోందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీబీఐ వైఖ‌రి చూస్తుంటే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయించేలా ఉంద‌ని ఇటీవ‌ల మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఓ టీవీ ఛాన‌ల్‌లో చెప్పిన విష‌యం విధిత‌మే. జ‌గ‌న్ మ‌ళ్లీ జైలుకు వెళ‌తార‌ని, అందుకే ఆయ‌న పెద్ద ఎత్తున ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నార‌ని కేసీఆర్ వ్యాఖ్యానించిన‌ట్లుగా ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ త‌న కొత్త ప‌లుకులో చెప్పుకొచ్చారు.

ఈ ఇద్ద‌రి వ్యాఖ్య‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అవుతుందా ? ఆయ‌న మ‌ళ్లీ జైలుకు వెళ్లాల్సి వ‌స్తుందా ? అనే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.

ఇవ‌న్నీ ఊహాగానాలు, జోస్యాలే అయినా ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం జ‌గ‌న్‌కు బ్యాడ్ సిగ్న‌ల్స్ పంపిస్తున్నాయి. స‌ద‌రు ఊహాగానాల‌కు బ‌లం చేకూరుస్తున్నాయి.

ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ భార‌తీయ జ‌న‌తా పార్టీతో జ‌గ‌న్ స‌ఖ్య‌త‌తో ఉన్నారు. చంద్ర‌బాబు వారి నుంచి దూరం కాగానే బాబును ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ ఏపీలో జ‌గ‌న్‌కు ఎంతోకొంత స‌హాయం చేసింది.

ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ మాట‌, ఏపీ బీజేపీ నేత‌ల మాట ఒక్క‌టే అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉండేది. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కూడా కొన్ని రోజులు జ‌గ‌న్‌కు బీజేపీ పెద్ద‌లు మంచి ప్రాధాన్య‌త‌నే ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. తాజాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా క‌ల‌వడానికి జ‌గ‌న్ ఎదురుచూడాల్సి వ‌చ్చింది. ఆయ‌న అపాయింట్‌మెంట్ క‌ష్టంగా దొరికింది.

ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా, టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ మీడియా సంస్థ అధినేత అమిత్ షాను క‌లిసి వ‌చ్చారు. మ‌రో వైపు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన చంద్ర‌బాబు స‌న్నిహిత‌, జ‌గ‌న్ వ్య‌తిరేక నేత‌లు వాయిస్ పెంచుతున్నారు. బీజేపీలో వారికి ప‌లుకుబ‌డి పెరిగింది.

ఏపీలో వైసీపీ, టీడీపీకి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న ఆ పార్టీ వైసీపీనే టార్గెట్ చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తోంది.

మొత్తంగా బీజేపీ - జ‌గ‌న్ మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా నిన్న సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు జ‌గ‌న్‌కు మింగుడుప‌డ‌కుండా ఉంది. ప్ర‌తి వారం కోర్టుకు హాజ‌రుకాకుండా మిన‌హాయింపు ఇవ్వాల‌ని జ‌గ‌న్ వేసిన పిటీష‌న్‌ను కోర్టు కొట్టేసింది. జ‌గ‌న్ సాక్షుల‌ను ప్ర‌భావం చేస్తార‌ని సీబీఐ గ‌ట్టిగా వాదించింది. దీంతో జ‌గ‌న్ ప్ర‌తీ వారం కోర్టుకు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

రాజ‌కీయ‌మో, క‌క్ష‌సాధింపో, యాధృచ్చిక‌మో కానీ బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్న వారు సీబీఐ, ఈడీ కేసుల్లో జైళ్ల‌కు వెళుతుండ‌టం ఇటీవ‌ల చూస్తూనే ఉన్నాం. శ‌శిక‌ళ‌, డీకే శివ‌కుమార్‌, చిదంబ‌రం త‌దిత‌రులే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఇప్పుడు జ‌గన్ కూడా బీజేపీకి దూర‌మైతే ఆయ‌న కేసుల్లో విచార‌ణ వేగం పెరిగే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

అంతేకాదు, ప్ర‌స్తుతం జ‌గ‌న్ బెయిల్‌పై ఉన్నందున ఆయ‌న బెయిల్ సైతం ర‌ద్దు అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్ప‌టికైతే ఇవ‌న్నీ ఊహాగానాలే అయినా కొట్టి పారేయ‌లేని విష‌యాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

మ‌రో వైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఆయ‌న నాగ్‌పూర్ వెళ్లి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌తో భేటీ అయ్యార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ ప‌రిణామాలు అన్నీ జ‌గ‌న్‌కు ప్ర‌తికూలంగా ఉండ‌టంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఏం జ‌రుగుతుందోన‌నే టెన్ష‌న్ మొద‌లైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో ఈ ఆందోళ‌న మ‌రింత ఎక్కువ‌గా ఉంది. కానీ, వైసీపీ పెద్ద‌లు మాత్రం బీజేపీతో స‌న్నిహిత సంబ‌ధాల కోస‌మే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   7 hours ago


తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

   8 hours ago


ఇళ్ళ పట్టాల పంపిణీ  మళ్లీ మళ్లీ వాయిదా

ఇళ్ళ పట్టాల పంపిణీ మళ్లీ మళ్లీ వాయిదా

   8 hours ago


విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

   10 hours ago


తూర్పుగోదావరి  వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

తూర్పుగోదావరి వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

   10 hours ago


కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

   15 hours ago


బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

   15 hours ago


సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

   15 hours ago


రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

   16 hours ago


మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle