newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

జోలెలో డబ్బులేమయ్యాయి బాబూ?

14-02-202014-02-2020 08:32:33 IST
2020-02-14T03:02:33.413Z14-02-2020 2020-02-14T02:52:07.954Z - - 24-02-2020

జోలెలో డబ్బులేమయ్యాయి బాబూ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు మాటల దాడికి దిగుతున్నారు. చంద్రబాబువి దిగజారుడుమాటలు అంటూ మండిపడ్డారు. కేంద్ర,రాష్ర్ట సంబంధాలు చూసి చంద్రబాబుకు కడుపుమంటగా ఉందని, ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబులో మార్పు రాలేదని ఆయన మారడం లేదన్నారు. అధికారం లేకపోతే ఒక్క గంట కూడా గడపలేని పరిస్దితికి చంద్రబాబు చేరుకున్నారు. ప్రధాని,ముఖ్యమంత్రి మాట్లాడుకుంటే ఆ మాటలు మీకెలా తెలిసాయి.

మీరు ఏమైనా కార్పెట్లు క్లీన్ చేస్తున్నారా..కాఫీ కప్పులు తీస్తున్నారా? ప్రధానిమోది,సిఎం శ్రీ వైయస్ జగన్ భేటిపై టిడిపి దుష్ప్రచారం చేస్తోందని, చంద్రబాబు 32 సార్లు ఢిల్లీ వెళ్లినా ఏమీ సాధించలేకపోయారని వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు.

పచ్చమీడియాలో ఢిల్లీ వెళ్లినా ప్రతిసారీ చంద్రగర్జన...మోదిగారి గురించి విమర్శలు చేస్తూ ప్రచురించేవారు. ఏదిపడితే అది ఆరోజు మాట్లాడి ఈరోజు తగుదునమ్మా అంటూ జగన్ పర్యటనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. 

వ్యక్తిగత అవసరాలకోసం కాళ్లు పట్టుకునే పరిస్దితి చంద్రబాబుదన్నారు. కొన్ని పత్రికలు జగన్  పర్యటనపై ఏవేవో  రాస్తున్నారని, శాసనమండలి రద్దు చేస్తున్నామంటే యనమల,లోకేష్ ల మైండ్ బ్లాక్ అయిందన్నారు. యనమల ప్రపంచంలో తానొక్కడే మేధావి అని అనుకుంటున్నారని, మీరు ఎన్ని అబద్దాలు చెప్పినా నమ్మటానికి ప్రజలు సిధ్దంగా లేరన్నారు.

ఢిల్లీనుంచి దావోస్  వరకు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చారు. రాజధానిని తరలిస్తున్నట్లు చంద్రబాబు కృత్రిమ ఉద్యమం సృష్టించారు. రాష్ర్టంలో ఏదో జరిగిపోతుందన్నట్లు భ్రమలు సృష్టించారన్నారు

ఉద్యమం కోసం జోలె పట్టుకుని బాబ్బాబు అంటూ అడుక్కుంటున్నట్లు డ్రామాలు ఆడారు.. జోలెలో పడ్డ బంగారం,వెండి,డబ్బు ఏమయ్యాయో చంద్రబాబు చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి చంద్రబాబుకు తెలియదా?

అక్కడి ప్రజల మనోభావాలు చంద్రబాబుకు పట్టవా?  పార్టీని బతికించుకోవాలనే తపన తప్ప రాష్ర్ట ప్రయోజనాలు కనిపించడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. ఆర్దిక సంక్షోభంలోకి ఎవరు ఎవర్ని నెట్టారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టింది మీరు కాదా,ఆర్దికపరిస్దితిని ఛిన్నాభిన్నం చేసింది యనమలే.. దొరికిన చోటల్లా అఫ్పులు తెచ్చి పప్పుబెల్లాల్లా పంచిపెట్టారని, పోలవరంలో కమీషన్లకోసం కక్కుర్తి పడ్డారని విమర్శించారు.

 

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

   11 hours ago


తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

   15 hours ago


‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

   15 hours ago


నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

   16 hours ago


మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

   16 hours ago


భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

   17 hours ago


విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

   17 hours ago


సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

   17 hours ago


12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   22-02-2020


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   22-02-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle