newssting
BITING NEWS :
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ *పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ *ముగిసిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం*ఏపీ శాసనమండలిలో టెన్షన్..పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదం..టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు యత్నించిన కొడాలి నాని*ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు..మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది..ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు..అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని..దానికోసం బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం : పవన్ *అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత *ఏపీ అసెంబ్లీ: సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు.. సత్వరమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన స్పీకర్

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

18-10-201918-10-2019 14:23:12 IST
Updated On 18-10-2019 14:44:52 ISTUpdated On 18-10-20192019-10-18T08:53:12.261Z18-10-2019 2019-10-18T08:53:05.569Z - 2019-10-18T09:14:52.222Z - 18-10-2019

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనంతపురం రాజకీయాల్లో నిన్న మొన్నటి దాకా తిరుగులేని అధికారం చెలాయించిన మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లెక్కలు తేల్చుకోవడం మొదలైనట్లే అనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా జేసీ బ్రదర్స్‌కి చెందిన 23 ట్రావెల్ బస్సుల్ని ఒకే రోజు రవాణా శాఖ అధికారులు సీజ్ చేయడం రాష్ట్ర రవాణా చరిత్రలో ఇదే మొదలు కావడంతో జిల్లా ప్రజలు మాత్రమే కాకుండా జేసీ బ్రదర్స్ కూడా షాక్‌కి గురయినట్లు తెలుస్తోంది. 

కారణం సింపుల్, నిబంధనలకు విరుద్దంగా రాష్ట్రంలో బస్సులు నడిపిస్తున్నట్లు ఆరోపణ. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రానిదే ఇంత అనూహ్యమైన, ఆకస్మిక చర్యకు ఆర్టీఏ అధికారులు సిద్ధపడతారన్నది ఎవరూ ఊహించలేరు.  రాయలసీమలో అందులోనూ అనంతపురంలో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అఖండ విజయంతో కుదేలైన జేసీ బదర్స్ ఒక్కసారిగా రాజకీయ సన్యాసం ప్రదర్శించారు. ఎప్పుడో స్థానికంగా అరుదుగా తప్పితే వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణలతో దాడులు చేయడం కూడా గత ఆరునెలలుగా జేసీ బ్రదర్స్ మానుకున్నారు. 

కానీ ఇంతలోనే పిడుగుపాటులా ఒక్కసారిగా దివాకర్ ట్రావెల్స్ బస్సులపై రవాణా అధికారుల దాడి, 23 బస్సుల సీజ్ వెనక రాజకీయ ప్రేరేపిత చర్యే ఉందన్నది జనం మాట. వైఎస్ ప్రభుత్వానికి నీతి లేదని, పాలన అనుభవం లేదని, ప్రజా సంక్షేమం మాట నీటి మూటలని అనంతపురంలో స్థానిక మీడియాతో భేటీ సందర్భంగా దివాకర్ రెడ్డి స్వయానా జగన్‌ను అనుకరిస్తూ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర సీఎం దృష్టిలో పెట్టుకున్నట్లే ఉందని, అదును చూసి దెబ్బతీశారని అందరూ చెప్పుకుంటున్నారు. 

వివరాల్లోకి వెళితో మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డికి రవాణా శాఖ అధికారులు గట్టి షాక్‌ ఇచ్చారు. దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 23 బస్సులను ఆర్టీఏ అధికారులు గురువారం సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులపై రవాణా శాఖ కమిషనర్‌ సీతారామాంజనేయులు, జాయింట్‌ కమిషనర్‌ ప్రసాద్‌ రావు ఆధ్వర్యంలోని అధికారులు పలు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారంగా టికెట్‌ ధరలు వసూలు చేస్తున్న 23 బస్సులను అధికారులు గుర్తించి సీజ్‌ చేశారు. 

అంతేకాకుండా దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్‌ స్టేట్‌ క్యారియల్‌ బస్సుల పర్మిట్లను కూడా రద్దు చేశారు. అదేవిధంగా నిబంధనలను అతిక్రమించినందుకు పలు కేసులు నమోదు చేశారు. అయితే దివాకర్‌ ట్రావెల్స్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని అందులో భాగంగానే తనిఖీలు చేశామని, దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని జాయింట్‌ కమిషనర్‌ ప్రసాద్‌ రావు వెల్లడించారు. 

ఆర్టీఏ అధికారులు కారణాలు ఎన్ని చెబుతున్నా దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయడం ద్వారా జేసి బ్రదర్స్ ఆర్థిక మూలాలను దెబ్బ తీయడానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లే అనిపిస్తోంది. దీని పర్యవసానాలు ఎంతవరకు వెళతాయో తెలుసుకోవడానికి వేచి ఉండాల్సిందే.

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   10 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   11 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   11 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   12 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   13 hours ago


రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

   14 hours ago


హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

   14 hours ago


సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

   14 hours ago


ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

   15 hours ago


రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle