newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

జేసీ పంతం నెర‌వేరుతుందా..?

16-03-201916-03-2019 12:38:04 IST
2019-03-16T07:08:04.854Z16-03-2019 2019-03-16T07:03:01.733Z - - 21-08-2019

జేసీ పంతం నెర‌వేరుతుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
126 మంది అభ్యర్థుల‌ను ప్రక‌టించేసి ఎన్నిక‌ల బ‌రిలో ముందున్న చంద్రబాబు నాయుడుకు అనంత‌పురం జిల్లా పెద్ద త‌ల‌నొప్పిలా మారింది. ముఖ్యంగా అనంత‌పురం పార్లమెంటు ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కూ ఆయ‌న అభ్యర్థుల‌ను ప్రకటించ‌లేదు. సిట్టింగ్ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి పెడుతున్న పేచీల‌తోనే అభ్యర్థుల‌ను ఖ‌రారు చేయ‌డం లేద‌ని తెలుస్తోంది.

అనంత‌పురం పార్లమెంటు నుంచి ఈసారి త‌న కుమారుడు జేసీ ప‌వ‌న్ రెడ్డిని బ‌రిలో దింపాల‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి భావించారు. స్వంత నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రి నుంచి త‌మ్ముడు ప్రభాక‌ర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని పోటీ చేయించాల‌ని అనుకున్నారు. వీరికి టిక్కెట్లు ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు అంగీక‌రించారు. అయితే, జేసీ మాత్రం ఇప్పుడు కొత్త ఫిటింగ్ లు పెడుతున్నారు. అనంత‌పురం పార్లమెంటు ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్యర్థుల‌ను మార్చాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అనంత‌పురం, గుంత‌క‌ల్లు, శింగ‌న‌మ‌ల టిక్కెట్లను తాను చెప్పిన వారికే ఇవ్వాలని జేసీ డిమాండ్ చేస్తున్నారు. 

పార్లమెంటు ప‌రిధిలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌పై త‌న ప‌ట్టు ఉండేలా ఆయ‌న చూసుకుంటున్నారు. సిట్టింగ్ అభ్యర్థుల‌కే క‌నుక టిక్కెట్లు ఇస్తే ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని, ఎంపీగా త‌న కుమారుడు పోటీ చేయ‌డ‌ని చెబుతున్నారు. దీంతో అధిష్టానం పున‌రాలోచ‌న‌లో ప‌డింది. జేసీ డిమాండ్‌కు అంగీక‌రించి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి టిక్కెట్ నిరాక‌రిస్తే ఇంకా పెద్ద స‌మ‌స్యగా మారుతుంద‌ని భావిస్తోంది.

అనంత‌పురం అర్బన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రభాక‌ర్ చౌద‌రి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న‌తో జేసీ కుటుంబానికి విభేదాలు ఉన్నాయి. ప్రభాక‌ర్ చౌద‌రికి టిక్కెట్ ఇస్తే ఆయ‌న ఎంపీ స్థానానికి క్రాస్ ఓటింగ్ చేయించి త‌మ‌కు న‌ష్టం చేస్తార‌ని జేసీ భావిస్తున్నారు. ఇక‌, ప్రభాక‌ర్ చౌద‌రి అభ్యర్థిత్వాన్ని స్థానికంగా కూడా ప‌లువురు బీసీలు నేత‌లు వ్యతిరేకిస్తున్నారు.

ఇక‌, శింగ‌న‌మ‌ల స్థానంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాల‌కు టిక్కెట్ ఇవ్వొద్దని జేసీ ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడి నుంచి తాను సిఫార్సు చేస్తున్న శ్రావ‌ణి అనే అభ్యర్థికే టిక్కెట్ ఇవ్వాలంటున్నారు. దీంతో ఈ స్థానం కూడా టీడీపీకి ఇబ్బందిగా మారింది. గుంత‌క‌ల్లులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా జితేంద్రగౌడ్ ఉన్నారు. అయితే, తాను పార్టీలోకి తీసుకువ‌చ్చిన మ‌ధుసూద‌న్ గుప్తాకు టిక్కెట్ ఇవ్వాల‌ని జేసీ డిమాండ్ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీసీని త‌ప్పిస్తే త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌ని చంద్రబాబు భావిస్తున్నారు.

ఇలా, తాము చెప్పిన వారికి అసెంబ్లీ టిక్కెట్లు ఇస్తేనే ఎంపీగా పోటీ చేయ‌గ‌ల‌మ‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఈ సీట్ల వ్య‌వ‌హారం చంద్రబాబుకు స‌మ‌స్యగా మారింది. అయితే, జేసీ ప‌వ‌న్ కాకుండా మ‌రో ప్రత్యామ్నాయంగా మంత్రి కాలువ శ్రీనివాసులును అయినా పోటీ చేయించాల‌ని టీడీపీ భావిస్తుండ‌ట‌. అందుకే రాయ‌దుర్గం అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ప్రక‌టించ‌కుండా పెండింగ్ లో పెట్టార‌నే ప్రచారం జ‌రుగుతోంది. మొత్తానికి రాష్ట్రంలో ఎక్కడా లేని స‌మ‌స్యను చంద్రబాబుకు అనంత‌పురంలో చూపిస్తున్నారు అక్కడి నేత‌లు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle