newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

జేసీ ఝలక్... ఎన్నికల ఖర్చు రూ 10వేల కోట్లట

22-04-201922-04-2019 16:08:41 IST
Updated On 04-07-2019 16:56:17 ISTUpdated On 04-07-20192019-04-22T10:38:41.091Z22-04-2019 2019-04-22T10:38:14.518Z - 2019-07-04T11:26:17.702Z - 04-07-2019

జేసీ ఝలక్... ఎన్నికల ఖర్చు రూ 10వేల కోట్లట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆయనో టీడీపీ ఎంపీ.. కానీ ఆయన కామెంట్లు ఒక్కోసారి విపక్షం కంటే ఘాటుగా, మోటుగా ఉంటాయి. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏపీ ఎన్నికలపై ఆసక్తికర కామెంట్లు చేశారు. టీడీపీ సమావేశం అనంతరం బయటకు వచ్చిన జేసీ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఏపీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్ధి ఎంతెంత ఖర్చుపెట్టారో, తన కొడుకు కోసం తానెంత ఖర్చుపెట్టానో తెలియచేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబే ఏపీ సీఎంగా మరోసారి ఎన్నికవుతారని కుండబద్ధలు కొట్టారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఎంత కష్టపడ్డారో ప్రజలకు తెలుసన్నారు. 

టీడీపీ ప్రభుత్వం 120 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఏపీలో పసుపు - కుంకుమ, వృద్ధాప్య పింఛన్లు.. తమకు ఓట్లు తెస్తాయని అభిప్రాయపడ్డారు. చివరి రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలే టీడీపీని గట్టెక్కించనున్నాయని జేసీ అన్నారు. చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. ఎన్నికల్లో ఈసారి వేలకోట్లు ఖర్చయిందని, ఒక్కో అభ్యర్థి రూ.50 కోట్లు చొప్పున ఖర్చు పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మొత్తం అన్ని పార్టీలూ కలిసి ఏపీలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టాయని జేసీ అన్నారు. అన్ని పార్టీల అభ్యర్థులూ వందలకోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. ఓటేయ్యాలంటే రూ.2వేలు ఇవ్వాలంలటూ ప్రజలే డిమాండ్ చేశారని జేసీ అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఓటుకి నోటు రూ 5వేలు పలికినా అవాక్కవాల్సిన పనిలేదన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించేందుకు మేధావులను కలుపుకొని ముందుకు వెళ్తానన్న జేసీ.. వచ్చే ఐదేళ్లలో కచ్చితంగా ఎన్నికల ఖర్చులు తగ్గించేందుకు ప్రయత్నిస్తానని ముక్తాయింపు ఇవ్వడం విశేషం. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle