newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

జే.సీ. కామెంట్స్ వెనుక రీజన్ ఇదేనా...?

04-03-201904-03-2019 21:56:01 IST
2019-03-04T16:26:01.205Z04-03-2019 2019-03-04T16:24:03.850Z - - 20-09-2019

జే.సీ. కామెంట్స్ వెనుక రీజన్ ఇదేనా...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనంత‌పురం ఎంపీ జే.సీ.దివాక‌ర్ రెడ్డి స్టయిలే వేరు. స్వంత పార్టీ అని కూడా చూడకుండా కామెంట్లు చేస్తుంటారు. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు మీద చేసిన కామెంట్ల వెనుక చాలా రీజ‌నింగ్ ఉంది. జే.సీ. ఏదో నోటి దురుసుతోనే, అన్యాప‌దేశంగానో ఆ మాట‌లు అన‌లేదు. ఈ ఎన్నిక‌లు జే.సీ. దివాక‌ర్ రెడ్డికి స‌వాల్ కానున్నాయి. ముఖ్యంగా ఆయ‌న అనంత‌పురం ఎంపీ సీటు నుంచి ఈసారి గెల‌వ‌డం అంత సుల‌భం కాద‌ని అర్థం అవుతోంది. ఎందుకంటే... అనంత‌పురం పార్ల‌మెంట్ సీటు ప‌రిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అనంత‌పురం అర్బ‌న్, రాయ‌దుర్గం, ఉర‌వ‌కొండ‌, గుంత‌క‌ల్లు, తాడిప‌త్రి, శింగ‌న‌మ‌ల‌, క‌ల్యాణదుర్గం సీట్లు ఉన్నాయి. 

వీటిలో టీడీపీ సిట్టింగ్ స్థానాల్లో ఉన్న ఏ ఒక్క ఎంఎల్ఏ దివాక‌ర్ రెడ్డికి ఈసారి స‌హ‌క‌రించే ప‌రిస్థితిలో లేరు. ముఖ్యంగా అనంత‌పురం అర్బ‌న్ ఎంఎల్ఏ ప్ర‌భాక‌ర్ చౌద‌రి వీరిలో ముందుంటారు. దివాకర్ రెడ్డి పేరు అంటేనే ప్రభాకర్ చౌదరి కస్సుమంటున్నారు. అలాగే మిగిలినవారు, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచిన స్థానాల్లో ఇప్పుడు టీడీపీ నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న వారు జే.సీ.ని ఓ బూచిలా చూస్తున్నారు. దీనికి కార‌ణం ఒక్క‌టే. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వ‌ర్గానికి చెందిన వ్య‌క్తితో గ్రూపులు క‌ట్టించారు దివాక‌ర్ రెడ్డి. ఇప్పుడు వీరికే టిక్కెట్లు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. వీరైతేనే తాను పార్ల‌మెంట్ సీటులో గెలిచే అవ‌కాశం ఉంటుంద‌ని జే.సీ.కి బాగా తెల్సు. 

ఒక‌వేళ తాను కాకుండా త‌న కుమారుడు ప‌వ‌న్ రెడ్డిని నిల‌బెట్టినా ప‌రిస్థితి ఇలాగే ఉంటుంది. అందుకే దివాక‌ర్ రెడ్డి భ‌య‌ప‌డుతున్నారు. అంతేకాదు... త‌న వ‌ర్గానికి చెందిన వారికే టిక్కెట్లు ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు సిద్ధంగా లేర‌ని దివాక‌ర్ రెడ్డికి బాగా తెల్సు. అందుకే త‌న పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు సీట్ల‌తో పాటు మ‌రో 33 సీట్లు క‌లిపి 40 సీట్ల‌లో కొత్త వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని ప్ర‌క‌టించారు జే.సీ. దివాక‌ర్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో కొవ్వూరు, నిడ‌ద‌వోలు త‌దిత‌ర ప్రాంతాల్లో సిట్టింగుల మీద తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. దీన్ని అవ‌కాశంగా తీసుకున్న దివాక‌ర్ రెడ్డి... ఈ విధంగా చంద్ర‌బాబును ఇర‌కాటంలో పెట్టే విధంగా మాట్లాడారు. 

తాను చెప్పిన వారికి టిక్కెట్లు ఇవ్వ‌క‌పోతే అనంత‌పురం జిల్లాలో టీడీపీ మ‌టాష్ అన్నరీతిలో ఆయ‌న మాట్లాడారు. మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే... జ‌గ‌న్ హ‌వాలో టీడీపీ గెల‌వ‌ద‌ని దివాక‌ర్ రెడ్డికి బాగా తెల్సు. అందుకే చంద్ర‌బాబు తీరు మీద త‌న‌కు కొన్ని అనుమానాలు ఉన్నాయ‌ని చెప్పారు. మొత్తానికి ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ ఏ మేర‌కు గెలుస్తుందో జే.సీ. దివాక‌ర్ రెడ్డి మాట‌లతోనే అర్థం అవుతోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle