newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

‘‘జేసీని ఎందుకు ఆపడంలేదు.. మీ అనుభవం ఏమైంది బాబూ’’

20-12-201920-12-2019 15:36:32 IST
Updated On 20-12-2019 16:54:16 ISTUpdated On 20-12-20192019-12-20T10:06:32.738Z20-12-2019 2019-12-20T10:06:30.990Z - 2019-12-20T11:24:16.555Z - 20-12-2019

‘‘జేసీని ఎందుకు ఆపడంలేదు.. మీ అనుభవం ఏమైంది బాబూ’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఎంపీ గోరంట్ల మాధవ్. టీడీపీ అధికారంలోకి వస్తే పోలీసుల చేత బూట్లు నాకిస్తానన్న జేసీని చంద్రబాబు ఎందుకు ఆపడంలేదన్నారు. ఈసందర్భంగా  పోలీసు బూటును ముద్దాడారు ఎంపీ మాధవ్. పోలీసులు బూట్లు అంటే యుద్ధంలో ఆయుధాలు.. వాటిని ముద్దాడుతాం అన్నారు. మా బూట్లు నాకమని చెప్పేందుకు మనసు ఎలా వచ్చిందని, అసలు మాజీ ఎంపీగా ఉండి జేసీ ఏంమాట్లాడుతున్నారో అర్థం కావడంలేదన్నారు.

సమాజం కోసం అహర్నిశలు కష్టపడేది పోలీసులేనన్నారు మాధవ్. జేసీతో గతంలో వివాదం కారణంగానే గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. జేసీని ఎదిరించి మరీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఎంపీగా గెలిచారు మాధవ్.

గతంలో మీపై నేను ఒక్కసారి మీసం తిప్పితే ఎంపీ అయ్యాను.. మీరు బజారున పడ్డారు. గతంలో పోలీసులను తిట్టినందుకే పతనావస్థకు చేరావు.. మీ పిల్లలకు అదే పరిస్థితి వచ్చింది. ఒక పోలీస్ గా నేను ఎంపీనయ్యా... పోలీసు అనుకుంటే ఏదైనా చేయగలరన్నారు మాధవ్.

మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న జేసీ అంత నీచంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నవ్వుతున్నారని, మహాభారతంలో దుర్యోధన చక్రవర్తి ని మించిపోతున్నారని, మీకు మనసు లేదా అని గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యావ్.. ఇంత వయసు వచ్చింది.. జేసీనోటికి తాళం ఎందుకు వేయడం ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాధవ్. బూట్లు నాకిన మాధవ్ అనూహ్య చర్యకు అంతా అవాక్కయ్యారు. అంతకుముందు పోలీసు బూట్లను తనే శుభ్రం చేశారు మాధవ్. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle