newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

జేసీకి బీజేపీయే దిక్కా? వేరే ఆప్షన్ లేనట్టేనా?

07-01-202007-01-2020 09:12:29 IST
Updated On 07-01-2020 12:30:31 ISTUpdated On 07-01-20202020-01-07T03:42:29.811Z07-01-2020 2020-01-07T03:42:22.770Z - 2020-01-07T07:00:31.339Z - 07-01-2020

జేసీకి బీజేపీయే దిక్కా? వేరే ఆప్షన్ లేనట్టేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీరాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి సంచలనం. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో, ఎలాంటి కామెంట్లు చేస్తారో ఆయనకే తెలీదు. తన కామెంట్లతో ఇతరులను ఇబ్బంది పెడతారు. ఒక్కోసారి ఆయనే ఇబ్బందిపడతారు.

తాజాగా జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నట్టు అర్థం అవుతోంది. ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ఈ సందర్భంగా జేసీ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలిపితే తాను బీజేపీలో చేరతానని, విచిత్రమయిన మెలిక పెట్టడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇది తన స్వార్థం కోసం కాదని, దేశం కోసమేనని తెలిపారు.  ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు చంద్రబాబుతోనే కలసి ఉంటానని దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 

తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక వెలుగు వెలిగిన నేత జేసీ దివాకర్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీ అయిపోయారు. ఐదే్ళ్ళపాటు ఆయన ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ఆయన తరచూ చంద్రబాబుని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేసేవారు. అధికారం పోయాక కూడా ఆయన తీరు మారలేదు.

ఆయన గురించి తెలిసినవారు కూడా ఆయనంతే అనేవారు. తాజాగా ఆయనకు టైం బాగున్నట్టు లేదు. పోలీసులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన కోర్టు కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఇటీవల పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు గంటల తర్వాత జేసీకి బెయిల్ లభించింది.

పోలీస్ స్టేషన్లో పోలీసుల తీరుపై జేసీ మండిపడ్డారు. ఆయన అనుచరులు కూడా అక్కడ హడావిడి చేశారు. కోర్టు షరతులతో  కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. మరోమారు పోలీసులపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

బెయిల్ రావడంతో జేసీ దివాకర్ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో ఆయన బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తనకు బీజేపీలో చాలా మంది మిత్రులు ఉన్నారని.. జిల్లాకు వచ్చిన వారిని మర్యాద పూర్వకంగానే కలిసానన్నారు జేసీ.

జేసీ లాంటి వారు బీజేపీలోకి వస్తామంటే ఆహ్వానించేందుకు మేం రెడీ అంటున్నారు బీజేపీ అగ్రనేతలు. ఏపీలో జేసీ చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఆయన బీజేపీలో చేరితే సేఫ్ అని, వైసీపీ నేతలు ఆయన జోలికి రాకపోవచ్చని రాజకీయ నేతలు అంటున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle