newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

జేడీ లక్ష్మీనారాయణ ఎంట్రీ లాభమా..నష్టమా?

19-03-201919-03-2019 08:24:03 IST
Updated On 19-03-2019 17:30:42 ISTUpdated On 19-03-20192019-03-19T02:54:03.420Z19-03-2019 2019-03-19T02:45:36.414Z - 2019-03-19T12:00:42.233Z - 19-03-2019

జేడీ లక్ష్మీనారాయణ ఎంట్రీ లాభమా..నష్టమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేన పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో ఆ పార్టీకి నష్టమా, లాభమా అన్న చర్చ ఇప్పుడు తెర మీదకు వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నారట. తాను టీడీపీలో చేరితో ఆ పార్టీకి తన వల్ల డ్యామేజి అవుతుందన్న కారణంతోనే ఆయన జనసేనలో చేరారట. అంటే ఆయనకు టీడీపీ మీద ఇప్పటికీ సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు తేలిపోయిందని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు. 

చంద్రబాబు కూడా లోపాయికారిగా జనసేన వైపు వెళ్లమన్నట్లు సలహా ఇచ్చారని కూడా కొందరు వాదిస్తున్నారు. అంటే ఏ విధంగా చూసినా ఈ ఎన్నికల్లో ఆయన టార్గెట్ వైసీపీనే. టీడీపీ ఏమాత్రం కాదు. ఇదే సమయంలో జగన్ కేసుల అంశంలో తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది కూడా ఆయనే. ఈ పరిస్థితిని లక్ష్మీనారాయణ ఎలా ఎదుర్కొంటారనేదే అసలు ప్రశ్న.

ఎందుకంటే... తాను చట్టానికి కట్టుబడి కేసులు విచారణ చేశానని చెబితే, ఆయనలో సత్తా లేదనీ, అంతా ఓ వర్గం మీడియా చేసిన హడావుడేనని తేలిపోతుంది. 

ఎందుకంటే... జగన్ మీద నమోదైన కేసులు, ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయి. అంటే కచ్చితంగా ఒకరి ప్రోద్భలంతోనే జగన్ మీద కేసులు కట్టారని స్పష్టం అవుతోందని రాజకీయ పండితులు చెబుతున్నారు. అలా కాకుండా, తనపై వచ్చిన ఆరోపణల మీద ఏదో సైలెంటుగా ఉండి టీడీపీకి ఇబ్బంది రాకుండా చూడాలని లక్ష్మీనారాయణ భావిస్తే... జనం నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది.

అంటే ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఏ రకంగా చూసినా జే.డీ. లక్ష్మీనారాయణతో జనసేనకు వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఇక లక్ష్మీనారాయణ వల్ల టీడీపీకి నష్టం రాదు కానీ, వైసీపీకి కచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే జేడీ జనసేనలో చేరడం మీద వైసీపీ నేతలు కూడా ప్రస్తుతానికి ఏం మాట్లాడటం లేదు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle