newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

జేడీ నిర్ణయం బాబుకి ప్లస్సా...మైనస్సా?

13-03-201913-03-2019 07:06:20 IST
2019-03-13T01:36:20.103Z13-03-2019 2019-03-13T01:32:16.287Z - - 22-09-2019

జేడీ నిర్ణయం బాబుకి ప్లస్సా...మైనస్సా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ టీడీపీలో చేరుతున్నారనే వార్తలు తాజాగా మీడియాలో  హల్ చల్ చేస్తున్నాయి. లక్ష్మీనారాయణకు, టీడీపీకి మధ్య రాయబారిగా మంత్రి గంటా శ్రీనివాస రావు వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి దాకా తాను పలానా పార్టీలో చేరతానని లక్ష్మీనారాయణ ఓపెన్ అవ్వలేదు.

వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో మీడియాలోని ఓ వర్గం, లక్ష్మీనారాయణను ఆకాశానికి ఎత్తింది. ఇలాంటి వారితో సమాజం బాగుపడుతుందని కథనాలు ప్రచురించింది. అప్పటి కాంగ్రెస్ పాలకుల రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి జగన్ కేసులో రెచ్చిపోయారన్న ఆరోపణలు వచ్చినా, మీడియాలో వచ్చిన హైప్ ముందు అవి గాల్లో కొట్టుకుపోయాయి.

ఇదంతా గతమైతే... ఇప్పుడు అదే మీడియా ఆయన టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటిస్తోంది. ఈ సంగతి ఎలా ఉన్నా... గతంలో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు చెప్పారు జేడీ లక్ష్మీనారాయణ. అప్పట్లో ఆయన పొలిటికల్ ఎంట్రీ మీద ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కాపు సామాజికవర్గానికి చెందిన లక్ష్మీనారాయణకు కొంత ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. ఆ బంధంతో ఆయన బీజేపీలో చేరతారనీ, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ జేడీ... లోక్ సత్తా పార్టీలో చేరారు.

తాను రెడీ చేసిన పీపుల్స్ మేనిఫెస్టోతో జనంలోకి వెళ్తానని అప్పట్లో ప్రకటించారు. కానీ ఆ తర్వాత నుంచీ ఆయన జనానికీ, మీడియాకు బహు దూరం అయ్యారు. ఇప్పుడు ఎన్నికల వేళ టీడీపీలో చేరతారన్న వార్తతో మళ్లీ తెర మీదకు వచ్చారు. విశాఖ జిల్లా భీమిలి నుంచి ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ మనిషిగా భావించాలా అన్న అనుమానాలు వస్తున్నాయి.

తాను టీడీపీలో చేరుతున్నట్లు ముందుగానే ప్రకటిస్తే, ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. కానీ ఇలా డొంక తిరుగుడు వ్యవహారమే, ఇప్పుడు జేడీ లక్ష్మీ నారాయణ మీద జనానికి అనుమానం కలుగుతోంది. అంటే ఆయన్ని ఇప్పుడు జనం ఏ మేరకు నమ్ముతారనేది ప్రశ్నగా మారింది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle