newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

జేడీ నయా ఒరవడి

08-04-201908-04-2019 08:07:22 IST
Updated On 08-07-2019 13:48:54 ISTUpdated On 08-07-20192019-04-08T02:37:22.906Z08-04-2019 2019-04-08T02:37:02.096Z - 2019-07-08T08:18:54.005Z - 08-07-2019

జేడీ నయా ఒరవడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సాగరతీరం విశాఖలో లోక్ సభ సీటు హాట్ హాట్ గా మారుతోంది. విశాఖపట్నం లోక్‌ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉన్న జనసేన పార్టీ విశాఖ పార్లమెంట్‌ అభ్యర్థి సీబీఐ పూర్వ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం మేనిఫెస్టోను ఆయన 100 రూపాయల బాండ్‌ పేపర్‌పై తన హామీలను పొందుపరిచారు.

జర్నలిస్టుల సమక్షంలో సంతకం చేసి మీడియాకు విడుదల చేసి సంచలనానికి దారితీసారు. నామినేషన్‌ దాఖలకు ముందు తాను చేయబోయే అభివృద్ధిని బాండ్‌ పేపర్‌ పై రాసి మరీ ప్రకటిస్తానని, చేయకపోతే నిలదీయాలని ప్రకటించినట్లుగానే వీవీ లక్ష్మీనారాయణ అలాగే ప్రకటించి రాజకీయంలో ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యారు. తాను మాట మీద నిలబడే వ్యక్తినని ఆ విధంగా చాటుకున్నారు. 

తాను విశాఖ వాసిని కాకపోయినా ఇక్కడే ఉంటానన్నారు. విశాఖలోనే ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఒక ఆదర్శ పార్లమెంట్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తానని 100 రూపాయల బాండ్‌ పేపర్‌లో పొందుపరిచిన మేనిఫెస్టోలో వీవీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంట్‌లో తన వంతు కృషి చేస్తానన్నారు. విశాఖ సమగ్రాభివృద్ధికి ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా  లక్ష్మీనారాయణ చెప్పారు. 

ప్రతి మూడు నెలకోసారి ఇచ్చిన హామీలను సమస్యలను పరిష్కరించేందుకు పురోగతిపై నివేదిక సెర్చి యువర్‌ ఎంపీ పేరిట యాప్‌ని విడుదల చేసి ప్రజల ముందు ఉంచుతానని వెల్లడించారు. ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరా కోసం ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు, కాలుష్య నియంత్రణ కోసం అయిదేళ్లలో విద్యార్థుల భాగస్వామ్యంతో రెండు కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం అన్నారు.

తన ఎన్నికల హామీలు అమలు చేయకపోతే కోర్టుకు కూడా లాగొచ్చని లక్ష్మీనారాయణ విశదీకరించారు. లక్ష్మీనారాయణ వ్యక్తిత్వం పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విశాఖను అవకాశాలకూ, ఆనందమయ జీవితానికీ కేంద్రంగా మారుస్తానని ప్రజలందరి భాగస్వామ్యంతో సమిష్టి కృషితో ఈ కలను సాకారం చేస్తానని చేసిన ప్రకటనలో మొత్తం 15 అంశాలను బాండ్‌లో పొందుపరిచారు.

విశాఖ యువతకు క్రీడా రంగంలో అన్ని రకాల సదుపాయాల కల్ప నతో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొనేలా ప్రోత్సా హం అందిస్తానని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని, ప్రత్యేకంగా వారికి ఒక కార్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని కూడా వెల్లడించారు.

ఈ హామీలతో కూడిన 100 రూపాయల బాండ్‌ పేపర్‌పై వీవీ లక్ష్మీనారాయణ మీడియా ప్రతినిధుల సమక్షంలో సంతకం చేసి విడుదల చేయగా సాక్షి  ఒక విజువల్‌ ఛానల్‌, ఆంగ్ల పత్రికల ప్రతినిధులు సంతకాలు చేసారు. ఆ తరువాత మీడియాకు విడుదల చేశారు. మరి గుణాత్మక రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న జేడీకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. 

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   an hour ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   an hour ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   an hour ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   2 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   2 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   2 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   21 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   a day ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   a day ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   24-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle