newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

జూపూడి బాటలో మరికొందరు...జగన్ గేట్లు తెరిచారా?

08-10-201908-10-2019 13:04:00 IST
2019-10-08T07:34:00.359Z08-10-2019 2019-10-08T07:33:50.058Z - - 08-12-2019

జూపూడి బాటలో మరికొందరు...జగన్ గేట్లు తెరిచారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీలో మిగిలేదెవరు?

ఆపరేషన్ ఆకర్ష్ కు జగన్ గేట్లు తెరిచారా?

జనసేన, టీడీపీల నుంచి మరిన్ని వలసలు ఖాయమేనా?

టీడీపీ అధికారప్రతినిధులంతా ఖాళీ?

టీడీపీ వాయిస్ వినిపించేది ఎవరు?

మరో నాలుగైదేళ్ళు పార్టీ నిలబడడం కష్టమేనా?

స్థానిక ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి ఏంటి?

ఏపీలో టీడీపీ భవితపై నీలినీడలు కమ్ముకుంటున్న వేళ ఉదయిస్తున్న ప్రశ్నలివే. ఏపీ టీడీపీ షాకిచ్చారు మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు. ఆయన టీడీపీనీ వీడి తిరిగి వైసీపీలో చేరారు. జగన్ పార్టీ పెట్టిన సమయంలో ఆయనతో కలిసి నడిచారు జూపూడి. అనంతరం వివిధ పరిణామాల నేపథ్యంలో టీడీపీలోకి వెళ్లారు.

2014 ఎన్నికల్లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జూపూడి ఓడిపోయారు. అయితే, వైసీపీలోకి ఒక ముఖ్య నేత కారణంగానే తాను ఓడానంటూ ఆరోపణలు చేసారు. ఇక, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటంలో అందులో చేరారు. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు తరువాతి రోజుల్లో ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమించారు.

గత కొంతకాలంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు జూపూడి. వివిధ సంప్రదింపుల అనంతరం ఇప్పుడు తిరిగి సొంత పార్టీలోకి చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి జగన్ సాదర స్వాగతం పలికారు. టీడీపీ నేతలతో పాటు జనసేన నేతలు కూడా వైసీసీలోకి క్యూ కట్టారు.

ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన రాజమండ్రి అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఆయన సతీమణి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన జూపూడి టీడీపీ లోకి వెళ్లి పొరపాటు చేసానని కామెంట్లు చేశారు. సీఎం జగన్ అమలుచేస్తున్న పదవుల రిజర్వేషన్ విధానం దేశం మొత్తంగా ఆదర్శంగా మారడం ఖాయమన్నారు.

జూపూడిని టీడీపీనుంచి రప్పించడంలో  రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డిదే కీలకపాత్ర అని వైసీపీ నేతలే చెబుతున్నారు. పార్టీ వదిలి వెళ్లినా..తిరిగి వచ్చిన తనను ఇంత ఆదరణతో చూడటం తనకు సంతోషాన్నిచ్చిందని జూపూడి చెప్పుకొచ్చారు.

జనసేన పార్టీనుంచి రాజమండ్రి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ ఓడిపోయారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాల పైన ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసారు. తిరిగి బీజేపీలోకి వెళ్లాలని భావించినా..ఆయన తన సతీమణితో కలిసి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రితో ఆయనకు సన్నిహిత సంబందాలు ఉన్నాయి.

దీంతో ఆకుల సత్యనారాయణ తన సతీమణితో పాటుగా అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ బాధ్యతలు ఆకులకే అప్పగించనున్నారు. ఆకుల చేరికతో తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రి ప్రాంతంలో వైసీపీ మరింత బలంగా తయారవడం ఖాయం అంటున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle