newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

జూపూడి చేరిక‌పై వైసీపీలో వ్య‌తిరేక‌త‌..!

09-10-201909-10-2019 12:14:42 IST
2019-10-09T06:44:42.543Z09-10-2019 2019-10-09T06:44:38.031Z - - 14-10-2019

జూపూడి చేరిక‌పై వైసీపీలో వ్య‌తిరేక‌త‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఎన్నిక‌ల త‌ర్వాత నేత‌ల వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. ఈ విష‌యంలో ఇంత‌కాలం చేరిక‌ల‌పై దృష్టిపెట్ట‌ని అధికార వైసీపీ కొంత వెనుక‌బ‌డ్డా ఇప్పుడు చేరిక‌ల‌కు గేట్లు తెరిచింది. దీంతో వైసీపీలోకి చేరిక‌లు పెరిగాయి. దీంతో ప‌లువురు నేత‌లు వైసీపీలో చేరుతున్నారు.

ఎవ‌రి చేరిక‌పైనా పెద్ద‌గా వ్య‌తిరేక‌త రాకున్నా నిన్న చేరిన జూపూడి ప్ర‌భాక‌ర్‌రావును పార్టీలో చేర్చుకోవ‌డం ప‌ట్ల వైసీపీ శ్రేణులే పెద‌వి విరుస్తున్నాయి.

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్రోత్సాహంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జూపూడి ప్ర‌భాక‌ర్ ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత జ‌గ‌న్ వెంట న‌డిచారు. 2014లో ప్ర‌కాశం జిల్లా కొండ‌పి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే, త‌న ఓట‌మికి జ‌గ‌న్ బంధువులు, ప్ర‌కాశం జిల్లా వైసీపీ కీల‌క నేత‌లు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కార‌ణ‌మ‌ని భావించిన ఆయ‌న త‌ర్వాత టీడీప‌లో చేరారు.

వైసీపీలో ఉన్న‌ప్పుడు పార్టీ త‌ర‌పున బ‌లమైన వాయిస్‌గా ఉండే జూపూడి టీడీపీలో చేరాక కూడా అలానే కొన‌సాగారు. వైసీపీ, జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ఆయ‌న‌కు చంద్ర‌బాబు ఎస్సీ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కూడా ఆయ‌న వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ, టీడీపీ ప‌ట్ల కూడా అసంతృప్తితో ఉన్నారు.

పార్టీ ఓట‌మిపై జ‌రిగిన మేధోమ‌థ‌న స‌ద‌స్సులో జూపూడి టీడీపీ త‌ప్పిదాల‌ను చెబుతుంటే చంద్ర‌బాబు వారించారు. దీంతో జూపూడి నొచ్చుకున్నారు. అప్ప‌టి నుంచే కొంత అసంతృప్తితో ఉన్నారు.

కానీ, గ‌త ఐదేళ్లుగా తీవ్రంగా విమ‌ర్శించిన వైసీపీలోకే మళ్లీ ఆయ‌న వెళ‌తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. కాగా, ఇంత‌కాలం త‌మ నేత‌ను, పార్టీని విమ‌ర్శించిన జూపూడిని తిరిగి పార్టీలో చేర్చుకోవ‌డాన్ని వైసీపీ శ్రేణులు బాహాటంగానే త‌ప్పుప‌డుతున్నాయి.

అయితే, ఆయ‌న చేరికకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం వెనుక జ‌గ‌న్ ఆలోచ‌న‌లు వేరు అని తెలుస్తోంది. త‌న‌ను విమ‌ర్శించిన నేత‌ను చేర్చుకోవ‌డం ద్వారా ఎవ‌రైనా పార్టీలో చేర‌వ‌చ్చు అని టీడీపీ నేత‌ల‌కు ఒక సిగ్న‌ల్ ఇస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది.

ఇక‌, జూపూడి మాల సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌. సామాజ‌క‌వ‌ర్గ సమీక‌ర‌ణాల దృష్ట్యా కూడా జూపూడి చేరిక అవ‌స‌రంగా భావించి ఉండ‌వ‌చ్చు.

ఇక‌, గ‌త ఐదేళ్లుగా టీడీపీలోకి వెళ్లి జ‌గ‌న్‌ను జూపూడి విమ‌ర్శించారు కానీ అంత‌కుముందు ఐదేళ్లు ఎమ్మెల్సీగా ఉండి, అధికార కాంగ్రెస్ పార్టీ వ‌దిలి జూపూడి జ‌గ‌న్ వంట న‌డిచారు. ఇది కూడా జూపూడి ప‌ట్ల జ‌గ‌న్‌కు ఒక సాఫ్ట్ కార్న‌ర్ ఉండేందుకు కార‌ణం కావ‌చ్చు.

ఇక‌, జ‌గ‌న్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జ‌రిగిన‌ప్పుడు టీడీపీ నేత‌ల వాద‌న‌కు భిన్నంగా జూపూడి మాట్లాడారు. ఈ దాడిని ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ చేయించార‌ని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్ర‌సాద్ ఆరోపించిన స‌మ‌యంలో ఆయ‌న‌ను జూపూడి మీడియా ముందే జోక‌ర్‌గా పోల్చారు.

సానుభూతి కోసం త‌న‌పైనే దాడి చేయించుకునే వ్య‌క్తి జ‌గ‌న్‌ కాద‌ని సైతం జూపూడి చెప్పారు. అయితే, ఇవేవీ వైసీపీ శ్రేణుల‌ను జూపూడి చేరిక ప‌ట్ల సంతృప్త‌ర‌చ‌లేక‌పోతున్నాయి. అయితే, రాజ‌కీయ పార్టీల్లో ఇటువంటివి స‌హ‌జ‌మ‌ని, గ‌తంలో జ‌గ‌న్‌ను తీవ్రంగా విమ‌ర్శించి బొత్స స‌త్య‌నారాయ‌ణ వంటి వారు ఇప్పుడు జ‌గ‌న్ క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు.

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   7 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle