newssting
BITING NEWS :
* జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం *మెట్రో రైలు సర్వీసులకు .. అంతర్జాతీయ విమానాలకు అనుమతి లేదు *సినిమా హాల్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ వేదికలకు అనుమతి లేదు* ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కరోనా కలకలం *ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు.. 2944 కి చేరిన కేసులు .. ఏపీలో యాక్టివ్ కేసులు 792 *పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు..మొదట మే 31వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలు

జూన్ 8న ముహూర్తం? జగన్ కేబినెట్లో బెర్త్‌లు దక్కేదెవరికో?

31-05-201931-05-2019 16:35:32 IST
Updated On 25-06-2019 13:27:04 ISTUpdated On 25-06-20192019-05-31T11:05:32.942Z31-05-2019 2019-05-31T11:05:24.530Z - 2019-06-25T07:57:04.630Z - 25-06-2019

జూన్ 8న ముహూర్తం? జగన్ కేబినెట్లో బెర్త్‌లు దక్కేదెవరికో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం ఘట్టం ముగిసింది. ఇక అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది మాత్రం కేబినెట్ కూర్పు గురించే. జగన్ మంత్రి వర్గం జూన్ 8న కొలువు తీరనుందని సమాచారం. కేబినెట్‌లో 15 మందికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేస్తారు. అనంతరం జూన్ 11 తర్వాత మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి తగినట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వివిధ జిల్లాలతో పాటు ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని జగన్ తన జట్టుని రూపొందిస్తున్నట్టు సమాచారం. జగన్ కేబినెట్లో  కాపు సామాజిక వర్గానికి ముగ్గురు లేదా నలుగురికి చోటు దక్కే అవకాశం ఉంది. జగన్‌తో పాటు తన మంత్రివర్గంలో 26 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. గుంటూరు జిల్లా నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు జగన్ కేబినెట్‌లో చోటు దక్కనుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి  మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కళావతి, రెడ్డి శాంతి, విజయనగరం జిల్లా నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ,  రాజన్నదొర, విశాఖపట్నం జిల్లా నుంచి గుడివాడ అమరనాధ్‌, గొర్లె బాబూరావు,, ముత్యాలనాయుడు పోటీలో ఉన్నారు.

ఇక తూర్పుగోదావరి నుంచి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌,  కన్నబాబు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఆళ్ల నాని,  తానేటి వనిత, గ్రంథి శ్రీనివాస్‌ మంత్రి పదవి రేసులో ఉన్నారు. క‌ృష్ణా జిల్లా నుంచి పేర్ని నాని, ఉదయభాను, పార్థసారథి, గుంటూరు జిల్లా నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్‌, వి.రజిని, అంబటి రాంబాబు, కోన రఘుపతి మంత్రులు కావాలని కోరుకుంటున్నారు.

ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి  మేకపాటి గౌతంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి రేసులో ఉన్నారు. చిత్తూరు జిల్లానుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రోజా పోటీలో ఉన్నారు. కడప జిల్లా నుంచి శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌ బాషా పోటీపడుతున్నారు. కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, అనంతపురం నుంచి అనంత వెంకట్రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరికి జగన్ అవకాశం ఇస్తారో చూడాలి మరి. 

బ్రేకింగ్: జూన్ 30 వరకూ లాక్ డౌన్ 5.O

బ్రేకింగ్: జూన్ 30 వరకూ లాక్ డౌన్ 5.O

   28 minutes ago


మెడికల్ స్టూడెంట్స్‌కు జగన్ బంపర్ ఆఫర్

మెడికల్ స్టూడెంట్స్‌కు జగన్ బంపర్ ఆఫర్

   41 minutes ago


వారసులకే జయ ఆస్తులు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

వారసులకే జయ ఆస్తులు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

   4 hours ago


ఒక వైపు కరోనా ఉధృతి.. పిడుగురాళ్ళలో సున్నపురాయి దోపిడీ

ఒక వైపు కరోనా ఉధృతి.. పిడుగురాళ్ళలో సున్నపురాయి దోపిడీ

   7 hours ago


నిమ్మగడ్డ రమేష్ కేసు.. ఎవరెవరు ఏమన్నారంటే...?

నిమ్మగడ్డ రమేష్ కేసు.. ఎవరెవరు ఏమన్నారంటే...?

   8 hours ago


అనంతలో కలకలం రేపిన మిడతల దండు..శాస్త్రవేత్తల భరోసా

అనంతలో కలకలం రేపిన మిడతల దండు..శాస్త్రవేత్తల భరోసా

   8 hours ago


దేశాన్నే అబ్బురపరిచే కేసీఆర్ ‘తీపి కబురు’ ఏమిటి? సర్వత్రా ఆసక్తి

దేశాన్నే అబ్బురపరిచే కేసీఆర్ ‘తీపి కబురు’ ఏమిటి? సర్వత్రా ఆసక్తి

   8 hours ago


వరవరరావుని వెంటనే విడుదల చేయాలి.. భార్య హేమలత డిమాండ్

వరవరరావుని వెంటనే విడుదల చేయాలి.. భార్య హేమలత డిమాండ్

   9 hours ago


వరవరరావుకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

వరవరరావుకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

   10 hours ago


ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కరోనా కలకలం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కరోనా కలకలం

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle