జూనియర్ కి వైసీపీ నుంచి ఇంత మద్దతా.. సరైన వ్యూహమేనా?
19-11-201919-11-2019 15:04:53 IST
Updated On 19-11-2019 15:08:33 ISTUpdated On 19-11-20192019-11-19T09:34:53.070Z19-11-2019 2019-11-19T09:34:42.515Z - 2019-11-19T09:38:33.604Z - 19-11-2019

గత కొన్ని రోజులుగా వైకాపా నేతలు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నుంచి బయటపడి వైకాపాలో చేరిన, చేరబోతున్న నేతలు టీడీపీ నాయకత్వంపై దాడి చేసే పేరుతో జూనియర్ ఎన్టీఆర్ పేరును వాడేసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. చంద్రబాబు చేతిలో, ఆయన తనయుడు నారా లోకేష్ చేతిలో టీడీపీ ఉంటే ఆ పార్టీ గతి అధోగతే అని చెప్పడం వరకు అర్థం చేసుకోవచ్చు కానీ జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప టీడీపీకి పూర్వ వైభవం రాదని వైకాపా నేతలు చెప్పడం ఏమిటా అని జనం విస్తుపోతున్నారు.
ప్రత్యేకించి ఇటీవలే టీడీపీ నుంచి బయటపడి వైకాపాలో చేరుతున్నానని ప్రకటించిన వల్లభనేని వంశీ... నారా లోకేష్‌ను పైకి తేవడం అనే ఒకే ఒక్క లక్ష్యంతోటే చంద్రబాబు 2009 ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ని ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టేశారని ఆరోపించారు.
జూనియర్ ఎన్టీఆర్ తన జీవితాన్ని ఫణంగా పెట్టి 2009లో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని కానీ 2014లో మళ్లీ జూ. ఎన్టీఆర్‌ని ప్రచారానికి తీసుకురాకుండా పవన్ కల్యాణ్ మద్దతుకోసం ప్రాధేయపడ్డాడని వంశీ విమర్శించారు. లోకేష్ రాజకీయ అభివృద్ధికి ఎక్కడ అడ్డుపడతాడో అనే భయంతోటే బాబు జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం పెట్టాడని వంశీ చెప్పారు.
అదేవిధంగా ఏపీ మంత్రి కొడాలి నాని కూడా లోకేష్‌ని ఎద్దేవా చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోనే టీడీపీ రేపు మనగలుగుతుందని ప్రకటించారు. వైకాపా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా లోకేష్‌కి ప్రత్యామ్నాయంగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఇంతలా ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఎన్టీఆర్‌కు పగ్గాలు ఇస్తే టీడీపీ మరింత బలంగా తయారవుతుందని చెప్పడం ఏంటి.. పైగా అది టీడీపీ అంతర్గత వ్యవహారం కదా.. పైగా జూనియర్ ఎన్టీఆర్‌కి అంత శక్తి ఉందనుకుంటే వైకాపాకు అది కచ్చితంగా సమస్యే అవుతుందని జనం భావిస్తున్నారు.
అయితే వైకాపా నేతలకు ఇది తెలీని విషయం కాదు. లోతుగా చూస్తే టీడీపీ కేడర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వైకాపా నేతలు మైండ్ గేమే ఆడుతున్నారనిపిస్తుంది. జూ. ఎన్టీఆర్‌ని ముందుకు నెట్టడం ద్వారా చంద్రబాబును, లోకేష్ బాబును బద్నాం చేయడానికి వైకాపా ఆడుతున్న గొప్పమైండ్ గేమ్‌లో ఇదంతా భాగమే అనే అభిప్రాయం బలపడుతోంది.
పదే పదే జూ. ఎన్టీఆర్ పేరును ప్రచారంలో పెట్టడం ద్వారా చంద్రబాబు తన కుమారుడిని ప్రమోట్ చేసుకోవడంపైనే ఎక్కువ ఆసక్తి పెడుతున్నారనే సందేశం టీడీపీ కేడర్ వరకు తీసుకెళ్లవచ్చనే వ్యూహంలో భాగంగా వైకాపా ఇలా చేస్తోందని భావిస్తున్నారు.
అయితే ఇక్కడ అసలు విషయం స్పష్టం కావడం లేదు. టీడీపీ కుప్పగూలే ప్రమాదంలో పడిందని బాబు ఆలోచించినట్లయితే లోకేష్‌ని కూడా పక్కనబెట్టి జూ.ఎన్టీఆర్‌ని తీసుకునిరావడానికైనా చంద్రబాబు వెనకాడరు. ఆ ప్లాన్‌లో భాగంగా టీడీపీ తిరిగి శక్తిని పుంజుకుంటే అప్పుడు వైకాపాకి నిజంగానే సవాల్ ఎదురవుతుంది. వైకాపా నాయకత్వానికి ఈ గ్రహింపు లేదా అన్నది కొత్త సందేహం.

చంద్రబాబుపై ఆనం వ్యాఖ్యకు పడిపడి నవ్విన జగన్.. విభేదాలు తొలగినట్లేనా?
11 minutes ago

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్.. విప్ జారీ
an hour ago

ఓడిపోయాం. ఒప్పుకుంటున్నాం.. కర్నాటక్ బైపోల్స్‌పై శివకుమార్
2 hours ago

20 మంది ఎమ్యెల్యేలను ఎదుర్కొనడానికి 150 మందికి శిక్షణా?
2 hours ago

పవన్‌లో అసహనం పెరుగుతోందా?
3 hours ago

ఉల్లి కష్టాలపై పవన్ సూటి ప్రశ్న
3 hours ago

రహస్య జీవోలు.. జగన్ పారదర్శకత చేతల్లో చూపించరే?
4 hours ago

విషాదం.. ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ జయరాజ్ హఠాన్మరణం
5 hours ago

అధికారుల గొడవలు.. నివురుగప్పిన నిప్పులా ఏపీ సచివాలయం
6 hours ago

‘‘అంతా శరద్ పవారే చేశారు’’
8 hours ago
ఇంకా