newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

జీవీఎంసీ ఎన్నిక‌ల్లో వైసీపీకి ఎదురుదెబ్బేనా..?

27-12-201927-12-2019 10:02:10 IST
Updated On 27-12-2019 10:59:08 ISTUpdated On 27-12-20192019-12-27T04:32:10.966Z27-12-2019 2019-12-27T04:31:59.283Z - 2019-12-27T05:29:08.716Z - 27-12-2019

జీవీఎంసీ ఎన్నిక‌ల్లో వైసీపీకి ఎదురుదెబ్బేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌స్తుత విశాఖ‌ప‌ట్నం వైసీపీ శ్రేణులు కీడెంచి.. మేలెంచాలి అన్న సూత్రాన్ని తూ.చ త‌ప్ప‌క పాటిస్తున్న‌ట్టు స‌మాచారం. కాగా, ఈ ఏడాది జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో విశాఖ జీవీఎంసీ ప‌రిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అదే సీన్‌ను త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న జీవీఎంసీ ఎన్నిక‌ల్లోనూ రిపీట్ చేయాల‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు.

అయితే, ఏపీలో తాజాగా చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు, మారిన ప‌రిస్థితులు జీవీఎంసీ ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపుకు స‌హ‌క‌రించేలా లేవ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అంతేకాకుండా, వారు అలా అభిప్రాయ‌ప‌డ‌టానికి గ‌ల కార‌ణాల‌ను కూడా క్షుణ్ణంగా చెబుతున్నారు.

జీవీఎంసీ ఎన్నిక‌ల్లో వైసీపీకి ఎదురుదెబ్బ త‌ప్ప‌దంటు చెప్పుకొస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కుల కార‌ణాల్లో మొద‌ట‌గా ఇసుక కొర‌త‌ను తెర‌పైకి తెస్తున్నారు. జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చిన నాటి నుంచి నిన్నా.. మొన్న‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొర‌త ఏర్ప‌డిన విష‌యం విధితమే. ఈ ప్ర‌భావం భ‌వ‌న నిర్మాణ రంగ కార్మికుల‌పై తీవ్రంగానే చూపింది. కూలీకెళ్తేగానీ.. పూట‌గ‌డ‌వ‌ని కొంద‌రు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన ఉదంతాలు లేక‌పోలేదు. మ‌రికొంద‌రు అప్పుల ఊబిలో చిక్కుకుని ఇప్ప‌టికి తేరుకోలేని ప‌రిస్థితి.

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొర‌త కార‌ణంగా ఉపాధి కోల్పోయిన భ‌వ‌న నిర్మాణ రంగ కార్మికులు జ‌గ‌న్ స‌ర్కార్‌పై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఒకానొక స‌మ‌యంలో రోడ్డుపై వెళ్తున్న మంత్రుల వాహ‌నాల‌ను సైతం అడ్డ‌గించి ఇసుక కొర‌త‌పై ప్ర‌శ్నించిన సంద‌ర్భాలూ ఉన్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో నేను ఉన్నా.. నేను విన్నా అని చెప్పిన జ‌గ‌న్‌, అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆరు నెల‌ల‌పాటు త‌మ క‌డుపు కొట్టారంటూ త‌మ‌కు క‌నిపించిన మంత్రుల ముందు కార్మికులు వారి ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కారు.

ఇసుక కొర‌త స‌మ‌స్య అన్ని ప్రాంతాల‌పైక‌న్నా విశాఖ‌పై తీవ్ర ప్ర‌భావం చూపింద‌నే చెప్పొచ్చు. ఆఖ‌ర‌కు స్టీల్‌, సిమెంట్ ఫ్యాక్ట‌రీలు సైతం న‌ష్టాల‌బాట ప‌ట్టాయి. దీంతో భ‌.ని.కా.ల‌కు ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ నిలిచాయి. రాజ‌కీయ నాయ‌కులు, మేధావులు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు జ‌గ‌న్ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధ్య‌క్షుడిగా ఉన్న జ‌న‌సేన ఒక అడుగు ముందుకేసి కార్మికుల‌కు అండ‌గా నిల‌వ‌డంతోపాటు స‌మ‌స్య‌పై తీవ్ర‌స్థాయిలో గ‌ళ‌మెత్తింది. విశాఖ న‌డిబొడ్డున కార్మికుల‌తో కలిసి లాంగ్ మార్చ్ కార్య‌క్ర‌మాన్ని కూడా నిర్వ‌హించింది. కార్మిక కుటుంబ స‌భ్యుల స‌మ‌స్య‌ల‌ను రాష్ట్ర‌మంతా తెలిసేలా బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసిన జ‌న‌సేన వారితో స‌భా ప్రాంగ‌ణంపై మాట్లాడించింది.

ఇలా భ‌వ‌న నిర్మాణ కార్మికుల కోసం జ‌న‌సేన నిర్వ‌హించిన ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌తో విశాఖ‌లో ఆ పార్టీ మైలేజ్ విప‌రీతంగా పెరిగింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ మైలేజ్ కాస్తా జీవీఎంసీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు లాభించే అంశంగా వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle