జీతాలు పెంచుతాం.. ప్రైవేట్ ప్రాక్టీసు ఆపండి ప్లీజ్
19-09-201919-09-2019 11:43:11 IST
2019-09-19T06:13:11.920Z19-09-2019 2019-09-19T06:12:58.492Z - - 09-12-2019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీసు చేయడంపై పూర్తి నిషేధం విధిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల వెలుపల తమ సేవలను అందించకపోవడం ద్వారా ప్రభుత్వ డాక్టర్లకు కలిగే నష్టాలకు ఉపశమన చర్యగా ప్రభుత్వ వైద్యుల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ప్రైవేట్ సేవలు అందించడానికి అలవాటు పడిన వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీసును నిషేధం విధించడం విప్లవాత్మక చర్యగానే చెప్పాల్సి ఉంటుంది. బుధవారం తాడేపల్లి గూడెంలోని సీఎం వైఎస్ జగన్ నివాసంలో డాక్టర్ సుజాతారావు కమిటీ రాష్ట్ర వైద్యరంగంపై తమ నివేదిక సమర్పించిన తరుణంలో ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య రంగంలో కనీసం 100 సంస్కరణలను చేపట్టాలని కమిటీ నివేదించింది. ఈ నిర్ణయాన్ని మొదట్లో కొంతమంది ప్రభుత్వవైద్యులు వ్యతిరేకించవచ్చు కానీ కొత్త నిబంధనలకు వారు లోబడాల్సి ఉంటుంది. హాస్పిటల్ యాజమాన్యంలో పరిస్థితులను మెరుగుపర్చాక, నిరుపేద రోగుల్లో నమ్మకం పెరిగే క్రమంలో డాక్టర్లలో అసంతృప్తి సమస్య వైదొలుగుతుంది అని కమిటీ సభ్యుడు డాక్టర్ సాంబశివారెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరింతగా వైద్యులను నియమించడం ద్వారా రోగులకు మెరుగైన ప్రవేశం కల్పించాలని సీఎం జగన్ గతంలోనే చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బందిని, మౌలిక వసతులను మెరుగుపర్చినప్పుడు, ప్రైవేట్ ప్రాక్టీసు నుంచి ఎదురవుతున్న పోటీని ప్రభుత్వ ఆసుపత్రులు తట్టుకుని నిలబడగలవని ముఖ్యమంత్రి కమిటీతో చెప్పారు. ఆసుపత్రుల గోడలు, బాత్ రూమ్లు, పడకలు, దిండ్లు వంటి వాటి విషయంలో మౌలిక వసతులను గణనీయంగా పెంచాలని సీఎం అభిప్రాయపడ్డారు. అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎయిర్ కండిషనర్లు కూడా ఏర్పాటు చేయాలి. రోగుల హృదయాలను గెల్చుకోవడానికి కొత్త ప్యాన్లు, లైట్లుకూడా తప్పకుండా అమర్చాలని జగన్ చెప్పారు. అలాగే నర్సింగ్ విద్యను గణనీయంగా మెరుగుపర్చాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలన్నింటిలోనూ నర్సింగ్ కాలేజీలను తప్పక ఏర్పాటు చేయాలని, ఒకప్రత్యేక, సత్వర అంబులెన్స్ (104, 108) వ్యవస్థను, ప్రాథమిక సేవల విభాగాన్ని నెలకొల్పాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుగుల నియంత్రణ, పారిశుధ్యం, స్టోరేజ్ టెక్నాలజీలలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను అనుసరించాల్సి ఉందని సీఎం సూచించారు. ఇక నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన మందులను మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులు కొనుగోలుచేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సరం నుంచి 1200 నుంచి 2000 వరకు వ్యాధులు,ఆరోగ్య సమస్యలను కవర్ చేస్తూ నూతన ఆరోగ్య శ్రీ ఉచిత వైద్య సేవల పథకాన్ని తిరిగి ప్రారభించనుంది. పేదల్లోకెల్లా నిరుపేదలకు చికిత్స సమయంలో అందిస్తున్న అలొవెన్సును రూ.5,000లకు పెంచాలని కూడా సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీసును నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. కానీ అదే సమయంలో జీతాలు పెంచినప్పటికీ తమ ప్రైవేట్ ప్రాక్టీసు అలవాటును ప్రభుత్వ వైద్యులు ఏమేరకు నియంత్రించుకుంటారనేది ప్రశ్నార్థకం అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలకు గానూ తీసుకుంటున్న వేతనం కంటే ఎన్నో రెట్లు ఆదాయం సంపాదిస్తున్న ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడతారా అనేది పెద్దప్రశ్న. ప్రభుత్వం సదాశయంతో తీసుకున్న నిర్ణయం నూటికి నూరు శాతం అమలయితే సామాన్యులకు వైద్య సేవలు కొత్తపుంతలు తొక్కుతాయనడంలో సందేహమే లేదు.

దిశ నిందితుల పోస్ట్ మార్టం... నివ్వెరపరిచే నిజాలు
8 hours ago

కులాల కుంపటి రాజేస్తున్నారు..!
8 hours ago

వెనక్కు తగ్గిన సీఎం జగన్.. కిటికీల జీవోలు రద్దు!
14 hours ago

డేటా చోరీ కేసు ఏమైంది? జగన్ కు కన్నా లేఖ
17 hours ago

జనానికి షాక్.. సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలకు బ్రేక్
18 hours ago

అధికారంతోనే అత్యాచారాలకు అడ్డుకట్ట: ప్రియాంకా గాంధీ
07-12-2019

ఆపరేషన్ టీడీపీ.. సీఎం జగన్ వ్యూహమిదేనా?
07-12-2019

టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి బీద మస్తాన్ రావు
07-12-2019

ఐఏఎస్, ఐపీఎస్ల ఒత్తిడికి లొంగే సజ్జనార్ అలా చేశారా?
07-12-2019

రేపిస్టుల లిస్టులో ఎంపీ గోరంట్ల మాధవ్.. నేషనల్ మీడియా టార్గెట్
07-12-2019
ఇంకా