newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

జాతీయ మీడియా ధాటికి చేతులెత్తేసిన జగన్ అడ్వైజర్లు..!

09-05-202009-05-2020 11:25:35 IST
Updated On 09-05-2020 11:32:53 ISTUpdated On 09-05-20202020-05-09T05:55:35.198Z09-05-2020 2020-05-09T05:55:32.983Z - 2020-05-09T06:02:53.114Z - 09-05-2020

జాతీయ మీడియా ధాటికి చేతులెత్తేసిన జగన్ అడ్వైజర్లు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లోకల్ మీడియా ఎలా ఉన్నా జాతీయ మీడియా మాత్రం ఏపీ ప్రభుత్వంపై ఓ కన్నేసి ఉంటుంది. తొలినాళ్ళలో ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుండి నిన్నటి ఎస్ఈసి తొలగింపు వరకు ఏపీ ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలపై జాతీయ మీడియా చానెళ్లు కొన్ని డిబేట్లు పెట్టి మరీ ఏకిపారేశారు. ఈక్రమంలో జాతీయ మీడియాను ఎదుర్కొనేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మీడియా సలహాదారులను కూడా నియమించుకున్నారు.

ప్రతిరాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శులు, సలహాదారులను నియమించుకోవడం సహజమే. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యేక కార్యదర్శులు, సలహాదారుల పేరుతో తనకి కావాల్సిన వారిని కొందరిని ప్రజా అలవెన్సులతో ప్రభుత్వాన్ని కాపాడుకొనేలా నిర్ణయాలు తీసుకున్నారని ఇప్పటికీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రజాధనం వీరికి కేటాయించినా కనీసం ప్రభుత్వ విమర్శలను తిప్పికొట్టడంలో చేతులెత్తేశారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన గురించి యావత్ దేశంలో అందరికీ తెలిసిందే. ఇందులో కంపెనీ వైఫల్యం ఎంత, ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం ఎంత అన్నదానిపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనలో నిజానిజాలు తేల్చేందుకు ఇప్పటికే దీనిపై రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీ కూడా వేశామని ప్రకటించింది. కాగా మొత్తం ఘటనపై నేషనల్ మీడియా తీవ్రంగా స్పందించింది.

ఘటన జరిగిన తీరు, ప్రభుత్వ స్పందన, తక్షణ చర్యలు, కంపెనీ బాధ్యతారాహిత్యం ఇలా అన్ని కోణాల్లో కొన్ని జాతీయ న్యూస్ చానెళ్లు డిబేట్లు నిర్వహించారు. ఈ డిబేట్లలో ప్రభుత్వం తరపున ఏపీ ప్రభుత్వ బాధ్యులుగా పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు ఏకంగా డిబేట్ల నుండి బయటకి వచ్చేశారు. డిబేట్లలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక డిబేట్ల నుండి వాకౌట్ చేశారు.

గ్యాస్ లీకేజీ ఘటనపై రిపబ్లిక్ టీవీలో అర్ణబ్ గోస్వామి నిర్వహించిన డిబేట్ లో ఏపీ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న పీవీ రమేష్ పాల్గొన్నారు. అయితే అర్ణబ్ ప్రశ్నల వేగం.. లౌడ్ వాయిస్ దెబ్బకు రమేష్ సూటిగా సమాధానాలు చెప్పలేకపోయారు. స్వతహాగా డాక్టర్.. రిటైర్డ్ ఐఏఎస్ అయిన రమేష్ డిబేట్ లో ఏ ప్రశ్న అడిగినా కోటి రూపాయల పరిహారం, కమిటీ నివేదిక అనే సమాధానాలు చెప్తుండడంతో అర్ణబ్ రెచ్చిపోయారు.

చివరికి రమేష్ డిబేట్ నుండి వెళ్లిపోగా మళ్ళీ వచ్చారు. కానీ అర్ణబ్ అయనను పెద్ద పట్టించుకోకుండానే డిబేట్ కొనసాగించారు. ఇక టైమ్స్ నౌ నిర్వహించిన డిబేట్ లో సీఎం జగన్ కు మీడియా సలహాదారుగా ఉన్న దేవులపల్లి అమర్ పాల్గొన్నారు. మీడియా రంగంలో విశేష అనుభవం ఉన్న అయన కూడా చర్చాకార్యక్రమంలో ప్రశ్నల ధాటిని ఎదుర్కోలేక పక్కకి తప్పుకున్నారు.

నిజానికి విశాఖ ప్రమాదంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వాలు వేగంగా స్పందించాయని లోకల్ మీడియా ప్రసారం చేసింది. కోటి రూపాయల పరిహారం కూడా పెద్దదే అనేలా ప్రసారాలు చేశాయి. కానీ నేషనల్ మీడియా ఘటన జరిగిన తీరు, ప్రభుత్వ, పరిశ్రమల అలసత్వంపై ఫోకస్ పెట్టాయి. అయితే డిబేట్లకు వెళ్లిన వారి ఆ కోణంలో ప్రిపేర్ అవకుండా ప్రభుత్వ స్పందన, చర్యలపై సబ్జెక్టుతో వెళ్లారు. దీంతో దేశం మొత్తం గమనించే చర్చావేదికలలో చేతులెత్తేయాల్సి వచ్చినట్లుగా కనిపిస్తుంది.

 

 

 

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

   4 hours ago


ఎంసెట్ నిర్వహణపై ఏపీ సర్కార్ మల్లగుల్లాలు

ఎంసెట్ నిర్వహణపై ఏపీ సర్కార్ మల్లగుల్లాలు

   5 hours ago


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే కరోనా కిట్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే కరోనా కిట్

   5 hours ago


సీఎం కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్... హైకోర్టు ఫైర్

సీఎం కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్... హైకోర్టు ఫైర్

   7 hours ago


ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రులివే!

ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రులివే!

   7 hours ago


కరోనా ఎఫెక్ట్... పిల్లలా....అప్పుడే వద్దులే!

కరోనా ఎఫెక్ట్... పిల్లలా....అప్పుడే వద్దులే!

   8 hours ago


కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టనుందా?

కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టనుందా?

   8 hours ago


5 వేల‌కు పైగా ఎన్‌కౌంట‌ర్‌లు..నేర‌స్థుల‌పై యోగీ మార్క్ ట్రీట్‌మెంట్‌

5 వేల‌కు పైగా ఎన్‌కౌంట‌ర్‌లు..నేర‌స్థుల‌పై యోగీ మార్క్ ట్రీట్‌మెంట్‌

   9 hours ago


గ్రేటర్ గజగజ.. కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్

గ్రేటర్ గజగజ.. కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్

   9 hours ago


కోవిడ్ రోగులకు నరకం చూపించిన ఫాతిమా హాస్పిటల్

కోవిడ్ రోగులకు నరకం చూపించిన ఫాతిమా హాస్పిటల్

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle