newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

జలకళతో ఉట్టిపడుతున్న శ్రీశైలం

15-08-201915-08-2019 08:45:55 IST
Updated On 20-08-2019 12:34:10 ISTUpdated On 20-08-20192019-08-15T03:15:55.699Z15-08-2019 2019-08-15T03:15:03.778Z - 2019-08-20T07:04:10.545Z - 20-08-2019

జలకళతో ఉట్టిపడుతున్న శ్రీశైలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం శ్రీశైలం జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 8లక్షల11వేల598 క్యూసెక్కులుగా ఉంది. ఏపీ జలవనరుల శాఖమంత్రి అనిల్‌కుమార్‌ శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

అవుట్ ప్లో 8.లక్షల60,344 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215  టిఎంసిలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 195.6605 టిఎంసిలుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 881.40. అడుగులకు చేరింది.

మరో రెండు రోజులు వరదనీరు వచ్చి చేరితే శ్రీశైలం రిజ్వరాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరనుంది. జూన్, జూలై నెలలో వరుణుడు ముఖం చాటేసినా ఆగస్టు నెలలో ఎగువున కురిసిన వర్షాలతో రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. వరదనీటితో కళకళలాడుతున్న శ్రీశైలం జలాశయానికి సందర్శకుల తాకిడి బాగా పెరిగింది. జలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle