newssting
BITING NEWS :
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ *పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ *ముగిసిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం*ఏపీ శాసనమండలిలో టెన్షన్..పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదం..టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు యత్నించిన కొడాలి నాని*ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు..మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది..ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు..అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని..దానికోసం బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం : పవన్ *అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత *ఏపీ అసెంబ్లీ: సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు.. సత్వరమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన స్పీకర్

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

18-10-201918-10-2019 16:30:16 IST
Updated On 18-10-2019 16:32:37 ISTUpdated On 18-10-20192019-10-18T11:00:16.879Z18-10-2019 2019-10-18T11:00:12.923Z - 2019-10-18T11:02:37.973Z - 18-10-2019

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లోని తునిలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టు పాశవిక హత్యా ఘటనకు సంబంధించి తూర్పుగోదావరి పోలీసులు స్థానిక వైకాపా ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాడిసెట్టి రాజాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. తుని సమీపంలోని ఎస్ అన్నవరం గ్రామంలో సత్యనారాయణ నివాసం దగ్గర ఇద్దరు కిరాయి హంతకులు దాడి చేశారు. ఆఫీసు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నక్రమంలో విలేకరిపై దాడి జరిగినట్లు పోలీసులు చెప్పారు. 

హత్యకు గురైన జర్నలిస్టు కుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యేపై కేసు బుక్ చేశారు. హత్యకు పాల్పడిన వారికి ఎమ్మెల్యే మద్దతు ఉందని ఫిర్యాదు చేయడంతో రాజాతోపాటు మరొక అయిదుగురిపై కేసు నమోదు చేశారు.

తన ప్రాణాలకు హాని జరగనుందని జర్నలిస్టు నెల క్రితమే చెప్పినా పోలీసులు చర్య తీసుకోకపోవడం, రక్షణ కల్పించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. నీ అంతు చూస్తానని స్వయానా వైకాపా ఎమ్మెల్యే, చీప్ విప్ బెదిరించడం, తర్వాత అన్నంత పనీ జరగడం రాష్ట్రంలో శాంతి భద్రతలపై సందేహాలు రేకెత్తిస్తోంది. గతంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని జర్నలిస్టు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదును కూడా తాము పరిశీలిస్తున్నామని చెప్పారు. సరిగ్గా నెల క్రితం కూడా సత్యనారాయణ తనపై జరిగిన దాడినుంచి తప్పించుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు అతడికి తగు రక్షణ కల్పించలేకపోయారు. 

గత మేనెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగింపు సందర్భంగా రిపోర్టర్ల సమక్షంలోనే వైకాపా ఎమ్మెల్యే ఆంధ్రజ్యోతి జర్నలిస్టును బెదిరించినట్లు సమాచారం. సత్యనారాయణ అంతు చూస్తానని కూడా ఎమ్మెల్యే అన్నారని, తర్వాత చాలామంది తమకు బెదిరింపు కాల్స్ చేశారని మృతుడి సోదరుడు గోపాలకృష్ణ తెలిపారు.

పెద్ద పెద్ద ఐరన్ రాడ్లతో జర్నలిస్టుపై దుండుగులు దాడి చేసినట్లుందని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. గతంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని జర్నలిస్టు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదును కూడా తాము పరిశీలిస్తున్నామని చెప్పారు. సరిగ్గా నెల క్రితం కూడా సత్యనారాయణ తనపై జరిగిన దాడినుంచి తప్పించుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు అతడికి తగు రక్షణ కల్పించలేకపోయారు. 

అయితే జర్నలిస్టు హత్యకు కారకులపై కఠిన చర్య తీసుకుంటామని రాష్ట్ర సమాచార మంత్రి పేర్ని నాని తెలిపారు. హత్య కారకులపై తక్షణ చర్యలు చేపట్టవలిసిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించినట్లు నాని తెలిపారు.

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   10 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   10 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   11 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   12 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   13 hours ago


రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

   14 hours ago


హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

   14 hours ago


సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

   14 hours ago


ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

   15 hours ago


రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle