newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

జనానికి అవస్థలు..ఎందుకీ దీక్షలు!

27-12-201827-12-2018 16:07:44 IST
2018-12-27T10:37:44.364Z27-12-2018 2018-12-27T10:37:41.994Z - - 17-07-2019

జనానికి అవస్థలు..ఎందుకీ దీక్షలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర విభజన మిగిల్చిన ఆర్థిక కష్టాలనుంచి బయటపడడానికి ఏపీ నానా అవస్థలు పడుతోంది. విభజన హామీలను కేంద్రం అమలు చేయడం లేదు. కేంద్రంపై ఏపీ ప్రభుత్వం పోరాటం చేస్తోంది. అయితే ధర్మ పోరాట దీక్షల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు దారితీస్తోంది. ఏం చేసినా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ఉండాలి. కానీ చంద్రబాబు చేస్తున్న ఈ దీక్షలు మాత్రం మేలు చేయకపోగా జనాలందరికీ చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. ఏ జిల్లాలో ధర్మ పోరాట దీక్షచేసినా రాష్ట్రంలోని సగం ఆర్టీసీ బస్సులన్నీ అటువైపే వెళుతున్నాయి. దీంతో రోజు వారి ప్రయాణాలు చేసేవారు, ఉద్యోగులు, విద్యార్ధులు కష్టాల పాలవుతున్నారు. మిగిలిన బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేసేవారు మాత్రం బాబూ... ఎందుకీ దీక్షలు.. మాకెందుకీ అవస్థలు అంటున్నారు. ధర్మపోరాట దీక్షల కారణంగా స్కూలు బస్సులు వాడడం వల్ల కొన్ని స్కూళ్ళకు సెలవులు కూడా ఇస్తున్నారు. 

ఇష్టం ఉన్నా లేకున్నా.. స్కూలు పిల్లల్ని, ఉపాధిహామీ పథకం లబ్ధిదారుల్ని, డ్వాక్రా మహిళలను టీడీపీ నేతలు ధర్మపోరాట దీక్షల కోసం ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్నారు. ధర్మపోరాట దీక్షల పేరుతో ఇప్పటికే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు చంద్రబాబు. కేవలం కేంద్రాన్ని తిట్టడం, బీజేపీని నమ్మి మోసపోయామని విమర్శలు చేయడం, పనికిరాని శ్వేతపత్రాలు చదవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేయడం ఎంతవరకూ సమంజసం అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాల ద్వారా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఇటు చంద్రబాబు తీరుపై బీజేపీ, వైసీపీ నేతలు సైతం మండిపడుతున్నారు. నాజీలను మించిన నయా గోబెల్స్ చంద్రబాబు అంటూ ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రధాని మీద పేలుతున్న అవాకులు, చవాకులు చూస్తే చంద్రబాబుకి మతి భ్రమించేందేమో అన్న అనుమానం కలుగుతోందన్నారు కన్నా. ఎన్నికల్లో గెలుపు కోసమే ధర్మపోరాట దీక్షలు నిర్వహిస్తున్నారని వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సాధించలేనిది ఇప్పడు చేస్తామంటూ చంద్రబాబు కొత్త హామీలిస్తున్నారని ఆనం ఎద్దేవా చేశారు. మరోవైపు జనసేన సైతం చంద్రబాబు ధర్మపోరాట దీక్షల పేరుతో రూ.కోట్లు ఖర్చు పెడుతున్నారే తప్ప... చేనేతల ఆత్మహత్యలను నిలువరించలేకపోయారని విమర్శించింది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు మూకుమ్మడిగా టీడీపీపై దాడి చేయడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle