newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

జనసైనికులకు భరోసా ఏది పవన్?

24-06-201924-06-2019 14:32:26 IST
2019-06-24T09:02:26.498Z24-06-2019 2019-06-24T09:02:21.500Z - - 15-12-2019

జనసైనికులకు భరోసా ఏది పవన్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత కూడా జ‌న‌సేన అధినేతకు రాజ‌కీయం అంటే ఏంటో బోధ‌ప‌డ‌లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. తాను పోటీ చేసిన రెండు సీట్లలో దారుణ ప‌రాభ‌వం ఎదుర్కొన్న ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఓట‌మి మీద స‌మీక్ష చేయ‌క‌పోగా, పార్టీని గాలికి వ‌దిలేసినట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ట‌. 

ఎన్నిక‌ల‌కు ముందే జ‌న‌సేన మీద చాలా అభియోగాలు వ‌చ్చాయి. మొద‌ట్లో టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు మీద‌, ఆయ‌న కుమారుడు లోకేష్ బాబు మీద ఎన్నో ఆరోప‌ణ‌లు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఆ త‌ర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ప్రతిచోట రెచ్చిపోయి మాట్లాడ‌టం మిన‌హా, ఓట్ బ్యాంక్ పటిష్టం చేసుకునేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిందేమీ లేదు. 

అంతేకాదు, లోకేష్ చేసిన కోట్లాది రూపాయ‌ల అవినీతి త‌న‌కు తెల్సనీ, రుజువులు, సాక్షాల‌తో బ‌య‌ట పెడ‌తానంటూ రెచ్చిపోయిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ త‌ర్వాత ఊసే ఎత్తక పోవ‌డంతో ఆయ‌న పార్టీ మీద జ‌నానికి న‌మ్మకం పోయింది. అందుకే ఫ‌లితాలు అంత ఘోరంగా వ‌చ్చాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్రజారాజ్యం పెట్టిన కొత్తలో టిక్కెట్లు అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఆ పార్టీ మీద వ‌చ్చాయి. జ‌నం కూడా ఎన్నిక‌ల్లో ఇలాంటివి స‌హ‌జ‌మే అన్న ధోర‌ణితో ఆ పార్టీని ఆద‌రించారు. 

కానీ ఓ అధికార పార్టీ అవినీతి బ‌య‌ట‌పెడ‌తాన‌నీ, ఆ త‌ర్వాత ఆ ఊసే ఎత్తని ప‌వ‌న్ క‌ల్యాణ్, వ్యక్తిగ‌తంగా టీడీపీ అమ్ముడుపోయాడ‌న్న ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం క‌రువైంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఈ ఆరోప‌ణే జ‌న‌సేన కొంప ముంచింద‌ని స్పష్టం చేస్తున్నారు. స‌రే, ఈ ఆరోప‌ణ‌ల్లో నిజానిజాలు ఏంటో ఎవ్వరికీ తెలీదు.

కేవ‌లం ఆరోప‌ణ‌ల‌తోనే ఓ వ్యక్తి నిజాయితీని కించప‌ర్చడం కూడా స‌రైంది కాదని కూడా విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు. అయితే ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత తదుప‌రి కార్యాచ‌ర‌ణ‌, పార్టీ బ‌లోపేతం మీద ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టి సారించ‌డం లేద‌నీ, కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌కు భ‌రోసా ఇవ్వడం లేద‌ని ఆరోపిస్తున్నారు. 

ఎందుకంటే, ఓటమి త‌ర్వాత జ‌న‌సేన నేత‌లు ప‌క్క పార్టీ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్ల‌డానికి ఇష్టప‌డ‌ని జ‌న‌సేన నేత‌లు ఇప్పుడు బీజేపీలో చేరేందుకు ఉత్సాహ ప‌డుతున్నార‌ట‌. ఎన్నిక‌ల‌ ఫ‌లితాలు రాక‌ముందే, జ‌న‌సేన‌లో కీల‌కంగా వ్యవ‌హ‌రించిన రాఘ‌వ‌య్య, అద్దేప‌ల్లి శ్రీధ‌ర్ వంటి నేత‌లు పార్టీకి రాజీనామా చేశారు.

ఇక వ్యక్తిగ‌త కార‌ణం పేరుతో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా ప‌వ‌న్ పార్టీకి గుడ్ బై కొట్టేశారు. ఇక ఎంఎల్ఏ ప‌ద‌వికి రాజీనామా చేసి, జ‌న‌సేన నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆకుల స‌త్య‌నారాయ‌ణ కూడా ఇప్పుడు పార్టీని వీడుతున్న‌ట్లు తెలుస్తోంది. 

మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఫ‌లితాల త‌ర్వాత పార్టీకి చాలా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరంతా బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే, అధికార వైసీపీలో ఏ ప‌ద‌వీ ఖాళీగా ఉన్నట్లు వీరికి క‌నిపించ‌డం లేదు. రాజ‌కీయ ఉక్కపోత వైసీపీ నేత‌ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. 

ఈ స‌మ‌యంలో ఆ పార్టీలోకి చేరినా ఉప‌యోగం ఉండ‌ద‌ని వీరు భావిస్తున్నారు. అందుకే ఏపీలో బ‌లం పుంజుకుంటున్న బీజేపీలో చేరేందుకు సిద్ధ ప‌డుతున్నార‌ట‌. రాజ‌కీయ పార్టీలో నేత‌లు రావ‌డం, పోవ‌డం స‌హ‌జ‌మే అయినా, పార్టీని న‌మ్ముకున్న కార్యక‌ర్తల‌కు దిశానిర్దేశం చేయ‌డం ఆ పార్టీ అధినేత బాధ్య‌త‌. ఇప్పుడు ఈ బాధ్యత గుర్తించ‌డంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ విఫ‌లం అవుతున్నట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle