newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

జనసేన పొత్తుల కథ

18-03-201918-03-2019 08:21:18 IST
Updated On 18-03-2019 18:34:13 ISTUpdated On 18-03-20192019-03-18T02:51:18.327Z18-03-2019 2019-03-18T02:51:14.090Z - 2019-03-18T13:04:13.435Z - 18-03-2019

జనసేన పొత్తుల కథ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల్లో పొత్తుల పంచాయితీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. జనసేన,లెప్ట్ పార్టీల మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. బెజవాడలో ఇరు పక్ష నేతలు సమావేశం అయి, సీట్ల పంపకంపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన, లెస్ట్ పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. సీపీఐకు ఏడు అసెంబ్లీ, 2 ఎంపీలు స్థానాలు,సీపీఎం కూడా ఏడు అసెంబ్లీ,2 ఎంపీ స్థానాలలోనూ, జనసేన పార్టీ 140 అసెంబ్లీ,8 ఎంపీ సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించాయి.

అలాగే బీఎస్పీతో కలిసి పని చేసేందుకు జనసేన నిశ్చయించుకుంది.లెప్ట్ పార్టీలతో ఈ రోజు జరిగిన సమావేశంలో పొత్తులు అంశం ఓ కొలిక్కి రాగా జనసేన బీఎస్పీ‌కి కొన్ని సీట్లను కేటాయించింది. అయిదు లోక్ సభ స్థానాలు , అలాగే 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించామని అధికారికంగా జనసేన పేర్కొంది. ఎన్నికల ముందు వరకూ తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం అన్న పవన్ ముందు కామ్రేడ్స్‌తో కలిశారు. తర్వాత బీఎస్పీతో దోస్తీ కట్టారు. పవన్ పొత్తుల్ని జనం హర్షిస్తారా? అసెంబ్లీలోకి ఎంతమంది జనసైనికులు వెళతారనేది చర్చనీయాంశంగా మారింది. వివిధ సంస్థలు నిర్వహించే సర్వేల్లో ఎక్కడా జనసేనకు చోటు దక్కడం లేదు. వాస్తవం ఎలా వుంటుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle