newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

జనసేన ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్‌లో కుట్ర కోణముందా?

19-09-201919-09-2019 16:22:43 IST
Updated On 20-09-2019 15:35:57 ISTUpdated On 20-09-20192019-09-19T10:52:43.428Z19-09-2019 2019-09-19T10:52:40.397Z - 2019-09-20T10:05:57.543Z - 20-09-2019

జనసేన ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్‌లో కుట్ర కోణముందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ భూభాగంలోని నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు ప్రతిస్పందనగా జనసేన పార్టీకి చెందిన వందలాది ట్విట్టర్ అకౌంట్లను ఆ కంపెనీ తొలగించినట్లు జనసేన సోషల్ మీడియా వింగ్ ప్రకటించింది. ఆంద్రప్రదేశ్‌కి చెందిన జనసేన పార్టీ నిర్వహిస్తున్న 300 పైగా ట్విట్టర్ ఖాతాలను సోషల్ మీడియా ప్లాట్‌పాం మంగళవారం తొలగించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి దారితీసింది. తమ పార్టీకి చెందిన 90 శాతం ఖాతాలను మంగళవారం ఉదయానికే ట్విట్టర్ సస్పెండ్ చేసినట్లు జనసేన సోషల్ మీడియా కోఆర్డినేటర్ వినోద్ వర్మ ప్రకటించారు.

వివరాల్లోకి వెళితే జనసేన సోషల్ మీడియా అధికారిక అకౌంట్ అయిన శతఘ్ని టీమ్ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ తాత్కాలికంగా సస్పెండ్ చేయడంతో జనసేన పార్టీ శ్రేణుల్లో గగ్గోలు మొదలైంది. శతఘ్ని ట్విట్టర్ ఖాతా తెలుగు రాష్ట్రాల్లోని జనసేన అభిమానులకు దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది. శతఘ్ని ట్విట్టర్ టీమ్ ఎన్నడూ అసభ్య, నిందా వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా పోస్ట్ చేయలేదని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై నిర్మాణాత్మక విమర్శ చేస్తూ ఉన్నామని వినోద్ వివరించారు. జనసేన పార్టీకి 400 నుంచి 500 వరకు ట్విట్టర్ ఖాతాలు ఉంటున్నాయని వాటిలో 300 ఖాతాలను ఉన్నఫళాన ట్విట్టర్ సంస్థ సస్పెండ్ చేసిందని వినోద్ ఆరోపించారు. ఇలా సస్పెండ్ చేసిన జనసేన ఖాతాల్లో @trends_JSPK, @PawanismNetwork, @WorldPSPKFans and @DasPSPK వంటి ముఖ్యమైన ఖాతాలు కూడా ఉండటం గమనార్హం. 

జనసేన ట్విట్టర్ ఖాతాదారులకు మంగళవారం ట్విట్టర్ ఒక ఈమెయిల్ పంపిస్తూ ట్విట్టర్ ప్లాట్‌ఫామ్ నిబంధనలను ఉల్లంఘించిందుకు స్పామ్ మెయిల్స్ పంపించినందుకు మీ ఖాతాలను సస్పెండ్ చేస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. మల్టిపుల్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు, ఆటోమేషన్ లేక స్క్రిప్టింగ్‌ని ఉపయోగించడం ద్వారా సంభాషణలను కృత్రిమంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించే సమన్వయ కార్యాచరణను తాము అనుమతించబోమని ట్విట్టర్ పేర్కొంది. అందుకే మీ ఖాతాలను సస్పెండ్ చేసినట్లు తెలిపిన ట్విట్టర్ ఇదే ప్రయోజనం కోసం కొత్తగా తెరిచిన ఖాతాలను కూడా తొలగిస్తామని హెచ్చరించింది.

అయితే ట్విట్టర్ సస్పెండ్ చేసిన తమ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీంచామని, ఈ ఖాతాలన్నీ తెలంగాణ నల్లమల అటవీప్రాంతంలో యురేనియం మైనింగ్ కోసం కేంద్రం పథకరచనకు వ్యతిరేకంగా ట్వీట్ చేసినవేనని జనసేన ప్రకటించింది. జనసేన ఖాతాలను పలుకారణాల వల్ల సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ అధికారపూర్వకంగా తెలియజేసినప్పటికీ దీనివెనుక కుట్ర కోణం ఉందని జనసేన ఆరోపించింది. యురేనియం మైనింగ్ వ్యతిరేక ప్రచారం చేసిన శతఘ్ని ఖాతాలనే ట్విట్టర్ తొలగించినట్లు తాము గమనించామని పార్టీ తెలిపింది.

తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా టీమ్ 'YS JAGAN FAILED AS CM' అనే హ్యాష్ టాగ్‍‌ను, #SaveNallamala అనే హ్యాష్ టాగ్‍ని ప్రచారం చేస్తూ ట్రెండ్‌ని సమన్వయించిందని జనసేన పేర్కొంది. గత మూడురోజులుగా నల్లమలను కాపాడండి అనే హ్యాష్ టాగ్‌తో కార్యక్రమం ప్రారంభించామని, మా ప్రచారం పలువురు సెలబ్రిటీలను ఆకర్షించడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారని జనసేన పేర్కొంది. సోషల్ మీడియాలో మాకు భారీ మద్దతు ఉన్నందున జనసేన మద్దతుదారులనే వారు లక్ష్యంగా చేసుకున్నారని, మాకున్న వాణి అదొక్కటేనని, ప్రస్తుతం దాన్ని కూడా అణిచివేస్తున్నారని పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇంటర్నెట్‌లో ఖాతాలను, వెబ్ సైట్లను, ప్రొడక్టులను, సేవలను, లేదా ప్రారంభ చర్యలపట్ల నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి, ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయడానికి, సంభాషణను తారుమారు చేయడానికి ఎవరైనా ట్రెండింగ్‌ లేక పాపులర్ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి సింగిల్ లేదా మల్టిపుల్ ట్వీట్లను పోస్ట్ చేస్తే అలాంటి ఖాతాలను సస్పెండ్ చేస్తామని ట్విట్టర్ నిబంధనలు తెలుపుతున్నాయి. 

ఒక సంస్థకు, పార్టీకి, ప్రభుత్వానికి, వ్యక్తులకు, ప్రాయోజిత పథకాలకు వ్యతిరేకంగా సదుద్దేశంతో, ప్రజాహితాన్ని ఆశించి ప్రచారం చేసినప్పటికీ, సెలబ్రిటీలు దానికి మద్దతుగా నిలిచినప్పుటికీ అలాంటి ప్రచారానికి పూనుకున్న ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేయవచ్చని జనసేన శతఘ్ని ఖాతాల తొలగింపు వ్యవహారం వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో ఏది ప్రజాహితం, ఏది ఉద్దేశపూర్వకం అనే అంశంపై ట్విట్టర్ అవగాహన ఏమిటన్నది చర్చనీయాంశంగా మారుతోంది. 

 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

   29 minutes ago


రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

   2 hours ago


ములుగులో మావోల అరెస్ట్

ములుగులో మావోల అరెస్ట్

   3 hours ago


కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

   3 hours ago


కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

   4 hours ago


రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

   4 hours ago


విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

   5 hours ago


జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

   16 hours ago


గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

   a day ago


ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle