newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

జనసేన కూరలో కరివేపాకేనా?

31-01-201931-01-2019 15:22:32 IST
Updated On 31-01-2019 15:22:41 ISTUpdated On 31-01-20192019-01-31T09:52:32.457Z31-01-2019 2019-01-31T09:50:54.378Z - 2019-01-31T09:52:41.934Z - 31-01-2019

జనసేన కూరలో కరివేపాకేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో త్వరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అనేక జాతీయ సంస్థలు ప్రీపోల్ సర్వేల పేరుతో ఫలితాలు విడుదలచేస్తూ నానా హడావిడి చేస్తున్నాయి. తాజాగా టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ సంస్థలు విడుదలచేసిన సర్వేలో వైసీపీ, టీడీపీ ప్రస్తావన ఉంది కానీ, జనసేన గురించి అసలు ఊసేలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీకి 23 సీట్లు వస్తాయని, టీడీపీ కేవలం రెండు సీట్లకు పరిమితం కానుందిన సర్వే తేల్చింది. అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని తెలిపింది. జనసేనను అసలు సర్వే సంస్థలు సోదిలోకి కూడా తీసుకోవడం లేదని తెలుస్తుంది.

ఈ సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీకి 49.5 శాతం ఓట్లు, టీడీపీకి 36 శాతం ఓట్లు పడతాయని వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ ఏపీలో 8 చోట్ల గెలిచింది. ఈసారి వైసీపీ బలంగా ఉందని, టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని సర్వేలు చెబుతున్నా, కనీసం జనసేనకు వచ్చే ఓట్ల శాతం కూడా తెలపకపోవడం గమనించాల్సిన అంశం. సర్వేలు ఎంత విశ్వసనీయమైనవో చెప్పలేం. కొన్నిసర్వేలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఆయా పార్టీల వాళ్లు కూడా ఈ సర్వేల పట్ల రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఎవరికి అనుకూలంగా వాళ్లు తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తారు. చంద్రబాబుతో పోలిస్తే జగన్ మీడియాను మేనేజ్ చేయలేరు. కానీ జాతీయ స్థాయి మీడియా సంస్థలు వైసీపీకి ఎందుకు పట్టం కడతాయి? చంద్రబాబు కథ పూర్తయిపోయిందని, జగన్ శకం రాబోతోందని సర్వే సంస్థలు కోడైకూస్తున్నాయి. 

జగన్, చంద్రబాబు సంగతి కాసేపు పక్కన పెడితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వంతంగా పోటీచేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్నిపార్టీల గురించి చెబుతున్న మీడియా సంస్థలు జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పకపోవడం ఆ పార్టీనేతలను తీవ్ర అసహనం కలిగిస్తోంది. రాబోయే కాలంలో కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ ఆయన అభిమానులు, జనసైనికులు తెగ ఊదరగొడుతున్నారు. కానీ జనసేనకు కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా వస్తుందని చెప్పడం లేదు.  ఇండియాటుడే, రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ ...ఇలా తాజాగా విడుదలైన సర్వే సంస్థలు జనసేనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం జనసైనికులను వేధిస్తోంది. దీంతో ఈసర్వేలపై పవన్ వీరాభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. అంతకుముందు మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యానికి అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అల్లు అరవింద్ స్వయంగా పోటీ చేసినా ఎంపీగా గెలవలేకపోయాడు. ప్రజారాజ్యం అలా లోక్‌సభలోకి ఎంటర్ కాకుండా జెండా పీకేసింది. అలాంటిది పవన్ జనసేన ప్రస్థానం పార్లమెంటు వరకూ సాగుతుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తమను తక్కువ అంచనా వేయవద్దని, సర్వే ఫలితాల్లో లేని తమ పార్టీ అసలు సిసలు ఫలితాల నాటికి సత్తా చాటుతుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle