newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

జనసేనలో జోష్.. అన్ని సీట్లు వస్తాయా?

27-04-201927-04-2019 08:31:25 IST
Updated On 04-07-2019 11:43:53 ISTUpdated On 04-07-20192019-04-27T03:01:25.053Z27-04-2019 2019-04-27T02:55:28.117Z - 2019-07-04T06:13:53.389Z - 04-07-2019

 జనసేనలో జోష్.. అన్ని సీట్లు వస్తాయా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇప్పుడు సీట్ల లెక్కలు ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రామాల నుంచి రాజధాని అమరావతి వరకూ అంతే ఇదే చర్చ.. ఇదే రచ్చ. ఏపీలో ఈసారి ఎన్నికల్లో పోటీచేసిన జనసేనకు ఏ సర్వే కూడా లెక్కలోకి తీసుకోవడం లేదు. అయితే జనసేన క్రియాశీలక పాత్ర పోషిస్తుందని, గెలిచే సీట్లు ఎన్ని అనేది పక్కన పెడితే ఓట్లు మాత్రం బాగా చీలిపోవడం ఖాయం అంటున్నారు. ఏపీలో జనసేనను టీడీపీ,వైసీపీ తక్కువ అంచనా వేస్తున్నాయని ఓ సర్వే సంస్థ అభిప్రాయపడింది.

పవన్ కళ్యాణ్ పార్టీకి రెండుమూడు కంటే ఎక్కు సీట్లు రావని అందరూ చెబుతున్నా..అందులో వాస్తవం లేదని ఆసర్వే ఉవాచ. ఏపీలో బెట్టింగుల జోరు బాగా పెరిగింది. టీడీపీ కంటే వైసీపీకి ఎక్కువ సీట్లు రావడం ఖాయం అంటున్నాయి సర్వేలు. అలాగే మెజారిటీ సర్వేలు మాత్రం వైసీపీకే పట్టంగడుతున్నాయి.  మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన జనసేనకు నామమాత్రమే సీట్లే వస్తాయని సింగిల్ డిజిట్ సీట్లు రానున్నాయని అంటున్నారు.

అయితే ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం లగడపాటి టీం గురించిన చర్చ జరుగుతోంది. అసలు లగడపాటి సర్వే చేశారో లేదో తెలీదు, ఒక వేళచేస్తే మాత్రం ఈసీ నిబంధనల ప్రకారం మే 19 వరకూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం కుదరదు. 

లగడపాటి టీం చెప్పినట్టుగా చెబుతున్న సర్వేలో జనసేనకు 15-22 సీట్ల వరకు వస్తాయని అంటున్నారు. రెండుమూడు ఎంపీ సీట్లు రావచ్చని అంటున్నారు. ఎంపీ జాబితాలో అమలాపురం, నరసాపురం, విశాఖ పట్నం సీట్లు ఉండొచ్చని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశం జనసైనికుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. తమ గురించి తక్కువ అంచనా వేసేవారికి తగిన విధంగా ఓటర్లు బదులిస్తారని జనసైనికులు అంటున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle