newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

జనం సొమ్ముతో జగన్ ఇంటికి సోకులు..

27-11-201927-11-2019 12:56:06 IST
Updated On 27-11-2019 15:12:27 ISTUpdated On 27-11-20192019-11-27T07:26:06.790Z27-11-2019 2019-11-27T06:51:19.241Z - 2019-11-27T09:42:27.282Z - 27-11-2019

జనం సొమ్ముతో జగన్ ఇంటికి సోకులు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుబారా చేయడం లేదు.. గట్టిగా మాట్లాడితే అయన అందరు అధికారుల మాదిరే రూ. 20 కిన్లే వాటర్ బాటిల్ మాత్రమే తాగుతారు. మాజీ సీఎం చంద్రబాబు లాగా ప్రజాధాన్ని మంచినీళ్లలా తాగేయరు. ఇలాంటి మాటలు ఓ వందకు పైనే రాసుకోవచ్చు.. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైసీపీ నేతల తమ ప్రియతమ నేత గురించి చెప్పిన మాటలు.

అయితే మాటలు చెప్పేందుకే కానీ ఆచరణకు కాదని ఎప్పటికప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తూనే ఉన్నారు. సచివాలయంలో వాస్తు మార్పుల దగ్గర నుండి మొదలైన ప్రజాధనం కేటాయింపు ప్రతినెలా లక్షలలోనే సీఎం సొంత అవసరాలకు నిధులను కేటాయిస్తున్నారు. తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి ముందు సెక్యూరిటీ, ఎలక్ట్రికల్ అవసరాల నిమిత్తం కొంత నిధులకు కేటాయించారు.

అనంతరం తాడేపల్లి ఇంటికే కిటికీలు, దోమలకు జాలీలు, గదులకు ఏసీలు అని మరికొంత మొత్తాన్ని కేటాయిస్తూ జీవోలు జారీచేశారు. మొత్తంగా ఇప్పటికే సుమారు కోటికిపైనే ఆ ఇంటికి ప్రజల సొమ్మును కేటాయించారు. ఈ సొమ్మంతా జగన్ తర్వాత వచ్చే ముఖ్యమంత్రికి కూడా ఉపయోగపడేలా వినియోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు జగన్ సొంత ఇల్లే అధికారిక నివాసం కనుక దానికే ఖర్చు పెట్టేస్తున్నారు.

ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని అనుకున్నారో ఏమో కానీ జగన్ హైదరాబాద్ నివాసమైన లోటస్ పాండ్ కి కూడా హంగులను అద్దెందుకు ఏపీ ప్రజల సొమ్మునే వాడేసుకుంటున్నారు. ఇందుకు గానూ తాజాగా 35.50 లక్షలను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వ రోడ్లు & భవనాల శాఖ జీవోను ఇచ్చేసింది.  లోటస్ పాండ్ నివాసానికి ఫెన్సింగ్, హైదరాబాద్ సచివాలయంలోని ఎల్‌ బ్లాక్‌ సీసీటీవీ కెమెరాల రీ ఇన్‌స్టాల్ చేసేందుకు, ఇతరత్రా ఖర్చులకు ఈ నిధులు ఉపయోగించబోతున్నారు.

Image result for Rs 35 lakhs allocation to Jagan Hyderabad in lotus pond

త్వరలోనే హైదరాబాద్ బంజారాహిల్స్ లోని జగన్ లోటస్ పాండ్ నివాసానికి పనులు మొదలు కానున్నాయి. ఇప్పుడు తాజాగా కేటాయించిన నిధులతో కలిపి జగన్ మొత్తంగా దాదాపు ఒకటిన్నర కోటి ప్రజాధనాన్ని వినియోగించుకున్నారు. ప్రభుత్వంలో ఏ శాఖలో నిధులు లేవని అధికారులు చెబుతున్నారు. చిన్నా చితకా పనులకు కూడా అధికారులు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని తెగేసి చెప్తున్నారు.

కానీ సీఎం సొంత అవసరాలకు ఆగమేఘాల మీద మాత్రం నిధులు కేటాయింపు జరిగిపోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. జగన్ నివాసాలకే కాకుండా అయన పర్యటనలకు కూడా ప్రజాధనం ఖర్చుపెట్టడం మరో వివాదంగా మారుతుంది. ఆ మధ్య సీఎం తన కుమార్తె కోసం విదేశాలకు వెళ్లారు. ఆ పర్యటనలో అయన వెంట వచ్చిన అధికారులకు విమాన ఖర్చుల దగ్గర నుండి తిండి ఖర్చులు కూడా ప్రభుత్వ ఖజానా నుండే కేటాయించారు.

మరి లీటర్ మంచినీళ్ల బాటిల్ లో ముప్పై రూపాయలు మిగిలించే ముఖ్యమంత్రి ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేని పర్యటనకు వెళ్లిన సీఎం వెంట వచ్చిన అధికారుల ఖర్చులకు ఎందుకు ప్రజాధనం ఉపయోగించారో ప్రజలకు సమాధానం చెప్పరా అని అప్పుడే ఆరోపణలు చేశారు. ప్రతినెలా లక్షలకు లక్షలు కేటాయింపులు జరిగిపోతున్నాయని విమర్శలు వస్తున్నా నిధులకు మాత్రం బ్రేక్ పడకుండా ఇంకా పెరిగిపోవడం ఏమిటన్నది ఆశ్చర్యంగా మారుతుంది.

 

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle