జడ్జి ఎదుట డీజీపీ హాజరు.. ఇకనైనా కళ్ళు తెరుచుకునేనా?
13-03-202013-03-2020 12:03:38 IST
Updated On 13-03-2020 13:04:48 ISTUpdated On 13-03-20202020-03-13T06:33:38.663Z13-03-2020 2020-03-13T06:33:36.155Z - 2020-03-13T07:34:48.545Z - 13-03-2020

ఒక రాష్ట్ర డీజీపీ హైకోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ఇది ఒకసారి కాదు రెండోసారి కూడా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టు ధర్మాసనం ముందు హాజరై సంజాయిషీ ఇచ్చుకున్నారు. తమ డిపార్ట్మెంట్ చేసింది తప్పేనని అందుకు బాధ్యులపై చర్యలు కూడా తీసుకుంటానని ధర్మాసనానికి చెప్పారు. గత ఫిబ్రవరి నెలలో ఇదే తరహా జరిగినా మళ్ళీ తాజాగా గురువారం కూడా హైకోర్టులో సేమ్ సీన్ రిపీట్ అయింది. అంతకు ముందు ఫిబ్రవరిలో గుంటూరు జిల్లాకి చెందిన ఒక యువకుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు తీసుకెళ్లి ఎక్కడుంది? ఎందుకు తీసుకెళ్లారు? అన్నది ఆ యువకుల కుటుంబాలకు కూడా తెలియకుండా చేయడంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. యువకులను తమ ముందు హాజరుపరచాలని కోరిన హైకోర్టు డీజీపీని తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు జోక్యంతో ఆందోళన చెందిన పోలీసులు అప్పటికప్పుడు ఆ యువకులపై కేసులు బుక్ చేశారు. హైకోర్టు రాష్ట్ర పోలీసు శాఖకు చివాట్లు పెట్టి డీజీపీకి సైతం హెచ్చరికలు చేసింది. కానీ షరామామూలే అన్న చందంగా తయారైంది ఏపీలో పరిస్థితి. నెలతిరిగేసరికి మళ్ళీ అదే హైకోర్టు అదే డీజీపీని తన ఎదుటకి పిలిచి మళ్ళీ అదే చివాట్లు పెట్టింది. రాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుతం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రజా చైతన్య యాత్ర చేపట్టేందుకు వెళ్లిన సమయంలో అక్కడ వైసీపీ కార్యకర్తలు చేసిన దౌర్జన్యకాండ రాష్ట్రం మొత్తం చూసిందే. మొత్తం 24 పాటు అక్కడ హైడ్రామా నడిపించి చివరికి చంద్రబాబు హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించారు. అంటే పోలీసు శాఖ అక్కడ శాంతిభద్రతలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైంది. దీనిపై తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తాజాగా విచారణకి వచ్చింది. ఈ పిల్‌ను గతంలో విచారించిన హైకోర్టు.. విచారణకు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని డీజీపీని ఆదేశించిన నేపథ్యంలో ధర్మాసనం ఎదుట ఆయన హాజరయ్యారు. చీఫ్ జస్టిస్ జికె మహేశ్వరి, న్యాయమూర్తులు ఏవి శేషసాయి, సత్యనారాయణ మూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉదయం కోర్టు బిగియింగ్ అవర్స్ నుండి ఎండింగ్ అవర్స్ వరకు డీజీపీ కోర్టులో ఉండాల్సిరాగా ధర్మాసనం పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రతిపక్ష నేత ప్రజా యాత్రకి మీరే అనుమతి ఇచ్చి.. మళ్ళీ మీరే నోటీసులు ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని సూటిగా ప్రశ్నించింది. అసలు రాష్ట్రంలో పాలన సాగించే పద్ధతి ఇదేనా? ఇక్కడ పోలీస్ పాలన నడుస్తుందా? అసలు చట్టాలు.. వాటి అమలు.. బాధ్యత ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించింది. చంద్రబాబును అడ్డుకున్న వాళ్ళని అదుపులోకి తీసుకోకుండా అనుమతి తీసుకున్న ఆయన్ను 151 సెక్షన్ కింద నోటీసు ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని? అసలు 151 సెక్షన్ అంటే ఏంటో తెలిసే ఇచ్చారా అని ప్రశ్నించింది. అది కింది స్థాయి అధికారులు ఇచ్చిన నోటీసు అని అందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ వివరణ ఇచ్చుకున్నారు. అంటే కనీసం అధికారాలు కూడా తెలియని పోలీసులు ఉన్నారా మీ శాఖలో అని కోర్టు ప్రశ్నించడం విశేషం. ఈ కేసులో 151 నోటీసు ఇచ్చిన ఏసీపీ, నోటీసును బలపర్చిన విశాఖ పోలీస్ కమిషనర్‌పై కూడా చర్యలు చేపట్టాలని ధర్మాసనం నిర్దేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన విచారణను వాయిదా వేసింది. ఇక అమరావతి ఉద్యమం మహిళలపై పోలీసుల దౌర్జన్యంపై కూడా హైకోర్టు ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది. ప్రజలు గ్రామాలలో తిరగవద్దని చెప్పడానికి మీకే అధికారం ఉంది? అసలు గ్రామాలలో పోలీసులు కవాతులు చేయాల్సిన పని ఏముంది? అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనైనా చట్టబద్ధంగా పాలన చేస్తారా లేదా? అని ప్రశ్నించడంతో చట్ట ప్రకారమే విధుల్ని నిర్వహిస్తామని డీజీపీ హైకోర్టుకు హామీ ఇచ్చారు. మరి ఇకనైనా కళ్ళు తెరుచుకుంటాయా? అంత సులభమైతే ఇంతదాకా ఎందుకులే!

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..
3 hours ago

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!
8 hours ago

తెలంగాణ పాలిటిక్స్ లోకి దర్శకుడు రాఘవేంద్ర రావు
10 hours ago

అంబటి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్
8 hours ago

ఎన్నికలకు వెళ్లకుంటే.. ఏపీ సర్కార్ కి సీరియస్ ప్రాబ్లమే.. ఎలాగో తెలుసా..?
11 hours ago

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక
6 hours ago

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు
4 hours ago

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక
12 hours ago

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హజారే
11 hours ago

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ
9 hours ago
ఇంకా