జగన్ ఓకే అంటే ఇద్దరూ వచ్చేస్తారట..!
17-11-201917-11-2019 12:29:55 IST
Updated On 17-11-2019 14:38:02 ISTUpdated On 17-11-20192019-11-17T06:59:55.348Z17-11-2019 2019-11-17T06:59:47.914Z - 2019-11-17T09:08:02.422Z - 17-11-2019

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఏళ్లుగా టీడీపీ జెండా మోసిన వారు కూడా ఇప్పుడు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇక, ఇతర పార్టీల నుంచి టీడీపీలో కొత్తగా చేరిన వారు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో చాలా మంది టీడీపీలో అయిష్టంగా కొనసాగుతున్నారు. టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా వైసీపీ గుర్తుపై, జగన్ ఫోటో పెట్టుకొని గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. వీరిలో నలుగురు మంత్రులు కూడా అయ్యారు. ఇందులో ఈ నలుగురిలో అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావు మాత్రం కష్టంగానో, ఇష్టంగానో టీడీపీతో ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఆదినారాయణరెడ్డి ఇప్పటికీ బీజేపీ గూటికి వెళ్లిపోయారు. అమర్నాథ్రెడ్డి టీడీపీలోనే ఉన్నా సైలెంట్‌గా ఉంటున్నారు. ఇక ఎన్నికల ముందు ఎస్వీ మోహన్ రెడ్డి, సుబ్బారావు, వైసీపీలో భేషరతుగా చేరిపోయారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో కేవలం అద్దంకి నుంచి గొట్టిపాటి రవి ఒక్కరే గెలిచారు. ఆయన కూడా టీడీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిన వారందరూ ఇప్పుడు పశ్చాత్తాప భావనతో ఉన్నారు. తాము ఓడిపోవడం, తమ పాత నాయకుడు జగన్ ముఖ్యమంత్రి కావడంతో వారు తొందరపడి, స్వల్పకాలిక ప్రయోజనాలకు ఆశపడి రాజకీయ జీవితాన్ని పాడుచేసుకున్నామని దిగులు చెందుతున్నారు. వీరిలో ఇద్దరు మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి 2014లో వైసీపీ తరపున ముత్తముల అశోక్‌రెడ్డి గెలిచారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయనకు మళ్లీ టిక్కెట్ లభించినా వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు చేతిలో సుమారు 70 వేల ఓట్లు తేడాతో దారుణంగా ఓడిపోయారు. దీంతో పార్టీ మారి తప్పు చేసినట్లుగా ఆయన గుర్తించారు. టీడీపీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనడం లేదు. మళ్లీ వైసీపీలోకి రావాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయనపై గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాత్రం ఇందుకు అంగీకరించే అవకాశం లేదు. ఇక, విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా టీడీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన తర్వాత టీడీపీలోకి వెళ్లారు. ఆ సమయంలో జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. గత ఎన్నికల్లో తన కూతురు షబానా ఖాతూన్‌ను విదేశాల నుంచి పిలిపించి మరీ పోటీ చేయించారు. ఆమెకు టిక్కెట్ ఇవ్వొద్దని మరో మైనారిటీ నేత నాగుల్ మీరా వంటి వారు ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబు ఆమెకు టిక్కెట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఆమె వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు వెల్లంపల్లి మంత్రి అయ్యారు. అయితే తన కూతురు ఓడిపోవడానికి టీడీపీలోనే కొందరు నేతలు కారణమని జలీల్ ఖాన్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆయన కూడా టీడీపీని వీడాలని ఆలోచిస్తున్నారు. జలీల్ ఖాన్ కూడా మళ్లీ వైసీపీలో చేరితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ముఖ్యమంత్రి జగన్ ఓకే అంటే వెంటనే వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే, గిద్దలూరులో అన్నా రాంబాబు, విజయవాడ వెస్ట్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీకి బలమైన నాయకులుగా ఉన్నారు. ఎన్నికల ముందు ఎస్వీ మోహన్ రెడ్డి, సుబ్బారావు వస్తే జగన్ చేర్చుకున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు.

సీఎం జగన్ ను అభాసుపాలు చేస్తున్న ఢిల్లీ ప్రతినిధులు
2 minutes ago

పోలీసులు సకాలంలో స్పందిస్తే జరిగేది ఇదే...!
17 minutes ago

పోలీసులపై పూల వర్షం. దేశమంతా హర్షధ్వానాలు..
32 minutes ago

బీజేపీలోకి మరో సీనియర్ హాస్య నటుడు..?
an hour ago

సజ్జనర్ సీన్ రిపీట్ చేశారు..?!
3 hours ago

వారి కంటే ముందే కలుస్తారా..?
3 hours ago

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!
18 hours ago

ఎంఐఎంకి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్‌గా అక్బరుద్దీన్ నియామకం
19 hours ago

అమరావతి వార్: వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలు
19 hours ago

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల లిస్ట్.. ఎక్కడో తేడా కొట్టేస్తుందే?!
20 hours ago
ఇంకా