newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

జగన్ హోదా ఆశలపై చన్నీళ్ళు చల్లిన మోడీ

10-07-201910-07-2019 13:07:36 IST
Updated On 10-07-2019 14:33:01 ISTUpdated On 10-07-20192019-07-10T07:37:36.830Z10-07-2019 2019-07-10T07:37:35.221Z - 2019-07-10T09:03:01.802Z - 10-07-2019

జగన్ హోదా ఆశలపై చన్నీళ్ళు చల్లిన మోడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును.. మళ్ళీ మోడీ ఏపీ ఆశలపై నీళ్ళు చల్లారు. విభజన హామీల్లో అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా అంశం మరోసారి పార్లమెంట్‌లో చర్చకు వచ్చింది. వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించగా కేంద్రం పాత పాటే పాడింది.

విభజన తర్వాత ఏపీ ఆర్ధికంగా భాగా వెనుకబడిపోయిందని ఈనేపధ్యంలో ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. అయితే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖతపూర్వకంగా సమాధానమిచ్చారు. విభజన అంశం మరుగున పడిపోయిందని, హోదా కాకుండా దాని స్ధానంలో ప్రత్యేక సాయాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. 

14వ ఆర్ధిక సంఘం సిఫార్సులతోనే హోదా అంశం మరుగునపడిపోయిందని తెలిపారు కేంద్రమంత్రి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. ఇచ్చేవరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని ఏపీ సీఎం జగన్ అధికారాన్ని చేపట్టిన తొలిరోజే చెప్పారు. దీనికి అనుగుణంగానే వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రశ్నను లేవనెత్తారు.

అయితే కేంద్రం ప్రత్యేక హోదాను ఇచ్చే ప్రస్తక్తే లేదంటూ మరోసారి తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ విషయంలో జగన్ ఏ విధంగా ముందుకు వెళతారో అనేది చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో అధికారంలోకి రావడానికి జగన్ చేసిన వాగ్దానాల్లో ప్రత్యేక హోదా అంశం ఒకటి. ఇంతకుముందే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరిని స్పష్టం చేశారు. మరోసారి కేంద్రహోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రకటనతో ప్రత్యేక హోదా దారులు మూసుకుపోయాయి.  


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle