జగన్ హామీలు.. కేసీఆర్‌కి చిక్కులు
13-06-201913-06-2019 08:31:06 IST
2019-06-13T03:01:06.429Z13-06-2019 2019-06-13T02:59:20.312Z - - 15-12-2019

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరు కేసీఆర్ గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తోందా? జగన్ హామీలు కేసీఆర్ కు చిక్కులు తెచ్చిపెడుతున్నాయా? అంటే అవుననే చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి జగన్. సీఎం పదవి చేపట్టానికి వయసు కంటే సమర్థతే ముఖ్యమన్న విషయాన్ని ఏపీ ప్రజలు గుర్తించినా.. కేసీఆర్ ఆ విషయంలో తప్పులో కాలేశారని చెప్పాలి. జగన్ ను అర్థం చేసుకోవటంలో ఆయన రాజకీయ పరిణతి చాలడం లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఏపీలో ఇదే విషయంలో స్పష్టమవుతోంది. చంద్రబాబుతో పోలిస్తే జగన్ బెటరని కేసీయార్ భావించారు. కానీ అది వాస్తవంలో బెడిసికొడుతోంది. టీఆర్ఎస్ వర్గాలు ఏ మాత్రం ఊహించని రీతిలో జగన్ తీరు ఉందని.. అతగాడి ప్లానింగ్ చూస్తుంటే.. కేసీఆర్ కు సైతం చెమటలు పట్టిస్తున్నాయని అంతా అంటున్నారు. డిప్యూటీ సీఎంల విషయం దగ్గర్నించి మహిళలకు మంత్రిపదవులు, రీటెండరింగ్, చంద్రబాబు నిర్ణయాలపై నిఘా వంటి అంశాలు పాలనలో కీలకంగా భావించవచ్చు. అయితే మరికొన్ని విషయాల్లో జగన్ స్పీడ్ కు కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా తెలుస్తోంది. జగన్ ఎన్నికల హామీల సంగతి అటుంచితే, వివిధ విషయాల్లో హామీలు ఇవ్వడం వాటిని తప్పనిసరిగా వాటిని ఫాలో కావాల్సిన పరిస్థితి కేసీఆర్ కు వచ్చిందంటున్నారు.కేసీఆర్ కు వచ్చిన మరో ఇబ్బంది ఇప్పుడు పలు అంశాల మీద సానుకూల నిర్ణయం తీసుకున్నా.. ఆ క్రెడిట్ అంతా జగన్ ఖాతాకు పోతుందే తప్పించి.. తన ఖాతాలోకి రాని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. సమ్మె తప్పదని భావించిన వారికి జగన్ నిర్ణయం షాకిచ్చిందనే చెప్పాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన నిర్ణయం.. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం లకు సంబంధించి జగన్ తీసుకున్న నిర్ణయాల్ని తెలంగాణ సీఎం తప్పనిసరిగా ఫాలో కాక తప్పదు. ఐఆర్ ను 27 శాతం పెంచటానికి కేసీఆర్ సుముఖంగా లేరు. అలా అని పెంచకుంటే జగన్ తో పోల్చి విమర్శలకు గురి కావటం ఖాయం. ఉద్యోగులలో వ్యతిరేకత తప్పదు. పూర్తి మెజారిటీతో ఉన్న జగన్ ఎప్పుడు ఏం చేస్తారోనని ఇటు టీడీపీ నేతలను, ఎప్పుడు ఏ హామీ ఇస్తారోనని తెలంగాణ టీఆర్ఎస్ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019

ఈ రంగులేంటి? వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
13-12-2019

విమర్శలను ఎదుర్కొనే దమ్ములేదా?
13-12-2019

చంద్రబాబుపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం
13-12-2019
ఇంకా