newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

జగన్ స్ట్రోక్‌... బాబుకి షాక్

02-04-201902-04-2019 12:27:14 IST
Updated On 02-04-2019 17:50:25 ISTUpdated On 02-04-20192019-04-02T06:57:14.194Z02-04-2019 2019-04-02T06:56:29.872Z - 2019-04-02T12:20:25.382Z - 02-04-2019

జగన్ స్ట్రోక్‌... బాబుకి షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల సమరంలో ఎవరికి వారు కొత్త కొత్త అస్త్రాలు తెరమీదకు తెస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబుకి గట్టి స్ట్రోక్ ఇచ్చారు జగన్. నిరుద్యోగులను ఆకట్టుకునేలా వున్న హామీపైనే ఏపీలో చర్చ జరుగుతోంది. 2014లో చంద్రబాబు అన్ని వర్గాల వారికి వరాల జల్లు కురిపించాడు. అయితే ఇప్పుడు ఐదేళ్ల తరువాత ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదు. బాబు వస్తే జాబు వస్తుందన్న మాటను నమ్మామని.. ఆ హామీని తన ఇంటి వరకు మాత్రమే అమలు చేసుకున్నారంటూ మండిపడుతున్నారు.

ఈ జాబు హామీలనే ప్రత్యర్ధి పార్టీలు విమర్శలకు ఉపయోగించుకుంటున్నాయి. ప్రధాని మోడీ సైతం ఇదే అంశాన్ని తెరమీదకు తెచ్చారు.  బాబు హామీ వల్ల జాబు వచ్చింది కొడుకు లోకేష్‌కి మాత్రమే అంటున్నారు. జాబు విషయంలో ఏపీ యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు .చంద్రబాబు ఏ విషయంలో ఫెయిల్ అయ్యారో.. ఇప్పుడదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న జగన్ తీరు ఏపీ ప్రజల్లో కొత్త ఆశలు ఉదయించేలా చేస్తున్నాయంటున్నారు.

తాజాగా ఆయన ఉద్యోగాలకు సంబంధించి చేసిన ప్రకటన ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి ఒకే నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు. ఇప్పటివరకూ ఏ పార్టీ చేయని రీతిలో తాము పవర్లోకి వచ్చిన వెంటనే ఉద్యోగ భర్తీపైన దృష్టి పెడతామన్న జగన్ మాట టీడీపీ వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా మారింది.

అలాగే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందేలా చట్టం చేస్తామని ఇస్తున్న హామీ కూడా ఆసక్తికరమని చెప్పాలి. తాజా ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాల విషయమై జగన్ చేస్తున్న కీలక ప్రకటన తమ పాలిట శాపంగా మారుతుందన్న భయాందోళనల్ని తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రాలో జగన్ వేవ్ క్లియర్‌గా కనిపిస్తోందన్న వార్తలతో తెలుగు దేశం శ్రేణులు కలవరపడుతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle