newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

జగన్ సైలెన్స్ వెనుక పక్కా ప్లాన్

17-05-201917-05-2019 08:22:49 IST
Updated On 27-06-2019 17:06:37 ISTUpdated On 27-06-20192019-05-17T02:52:49.737Z17-05-2019 2019-05-17T02:51:08.534Z - 2019-06-27T11:36:37.080Z - 27-06-2019

జగన్ సైలెన్స్ వెనుక పక్కా ప్లాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు ముగిసి నెల రోజులు గ‌డుస్తున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మాత్రం సైలెన్స్ మోడ్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. పోలింగ్ రోజు మీడియా ముందుకు వ‌చ్చిన ఆయ‌న తాము భారీ విజ‌యం సా‌ధిస్తామ‌ని న‌మ్మ‌కంగా చెప్పారు. త‌ర్వాత రెండుమూడు శుభ‌కార్యాల‌కు ఆయ‌న హాజర‌య్యారు. కుటుంబంతో క‌లిసి విహార యాత్ర‌కు వెళ్లి వ‌చ్చారు.

ఓ వైపు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మీక్ష‌లు, కేంద్ర రాజ‌కీయాలు, ఈసీ, ఈవీఎంల‌పై యుద్ధం అంటూ బిజీబిజీగా ఉంటూ హ‌డావుడి చేస్తుంటే జ‌గ‌న్ మాత్రం మౌన‌మునిలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేవ‌లం కొంద‌రు ముఖ్య నాయ‌కుల‌తో ఆయ‌న ఒక‌టి రెండుసార్లు భేటీ అయ్యి పోలింగ్ స‌ర‌ళిపై చ‌ర్చించారు. అయితే, వివిధ స‌ర్వేలు, ప్ర‌శాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ టీమ్ ఇచ్చిన రిపోర్ట్ తో విజ‌యంపై ధీమాగా ఉన్నందునే జ‌గ‌న్ సైలెంట్ గా ఉన్నార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో పోల్ మేనేజ్ మెంట్ లో విఫ‌ల‌మైన వైసీపీ ఈసారి స‌క్సెస్ అయ్యింద‌ని అంటున్నారు. ఈ వాద‌న‌ను టీడీపీ అభ్య‌ర్థులు సైతం అంగీక‌రిస్తున్నారు. త‌మకంటే ఈ అంశంలో వైసీపీ ఈసారి ముందుంద‌ని ఒప్పుకుంటున్నారు. ఇక‌, ఇంతే జాగ్ర‌త్త‌గా కౌంటింగ్ రోజు వ‌ర‌కు వ్య‌వ‌హ‌రించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. పైకి సైలెంట్ గా ఉంటున్నా కౌంటింగ్ వ‌ర‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఆయ‌న ప‌క్కా వ్యూహంతోనే ఉన్నార‌ట‌.

ఇందులో భాగంగానే వైసీపీ అభ్య‌ర్థుల‌కు, కౌంటింగ్ ఏజెంట్ల‌కు కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. పార్టీ ముఖ్య‌నేత‌లతో పాటు మాజీ సీఎస్ అజ‌య్ క‌ల్లాం, విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై కౌంటింగ్ ఏజెంట్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు.

ఇక‌, ఇప్ప‌టికే కార్యాల‌యాన్ని హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి త‌ర‌లించిన జ‌గ‌న్ 19వ తేదీన అమ‌రావ‌తి వెళ్ల‌నున్నారు. అభ్య‌ర్థులు, నేత‌ల‌కు ఆయ‌న అందుబాటులో ఉంటారు. ఇక‌, మ్యాజిక్ ఫిగ‌ర్ కు అటూఇటూ ఆగిపోతే టీడీపీ త‌మ ఎమ్మెల్యేల‌ను లాక్కునే అవ‌కాశం ఉంద‌ని కూడా వైసీపీ కొంత అనుమానంతో ఉంది. అవ‌స‌రం లేకున్నా గ‌త అసెంబ్లీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీ తీసుకున్నందున ఇప్పుడు అవ‌స‌రం ప‌డితే క‌చ్చితంగా టీడీపీ త‌మ ఎమ్మెల్యేల‌ను లాక్కునే ప్ర‌య‌త్నం చేయ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

అందుకే ఒక్కో జిల్లా అభ్య‌ర్థుల బాధ్య‌త ఒక్కో సీనియ‌ర్ నేత‌కు జ‌గ‌న్ అప్ప‌గించార‌ట‌. కౌంటింగ్ ముగియ‌గానే వారిని తీసుకొని స‌ద‌రు నేత‌లు అమ‌రావ‌తిలోని పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చేయాల‌ని ఆదేశాలు ఇచ్చారు. ఇలా ఎటువంటి ప‌రిస్థితి ఎదురైనా త‌మ ఎమ్మెల్యేలు ఎవ‌రూ చేజార‌కుండా జ‌గ‌న్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. మొత్తంగా ఈసారి విజ‌యంపై ధీమాగా ఉన్న కౌంటింగ్ వ‌ర‌కు అలెర్ట్ గా ఉండాల‌ని భావిస్తున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle