newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

జగన్ సర్కార్ వెనకడుగు.. వైజాగ్‌లో కాదు.. బెజవాడలోనే రిపబ్లిక్ డే

21-01-202021-01-2020 12:48:06 IST
2020-01-21T07:18:06.869Z21-01-2020 2020-01-21T07:18:02.424Z - - 24-02-2020

జగన్ సర్కార్ వెనకడుగు.. వైజాగ్‌లో కాదు.. బెజవాడలోనే రిపబ్లిక్ డే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ సర్కార్ వైజాగ్ విషయంలో వెనకడుగు వేసింది. అదేదో సెక్రటేరియట్ విషయంలోనే కానే కాదు. రిపబ్లిక్ డే విషయంలో జగన్ ప్రభుత్వం పునస్సమీక్షించింది. విశాఖలో గణతంత్ర వేడుకలు జరపాలన్న నిర్ణయాన్ని మార్చుకుంది వైసీపీ సర్కార్. విజయవాడలోనే రిపబ్లిక్ డే జరపాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో విజయవాడలోనే నిర్వహించడం ద్వారా అక్కడ ప్రజల్లో ఉన్న అభద్రతాభావాన్ని తొలగించే యోచనలో వుంది ప్రభుత్వం.

మొదట వైజాగ్‌లో నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం విశాఖలో ప్రభుత్వ అధికారికంగా నిర్వహించే రిపబ్లిక్ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సారి విజయవాడలోని మునిసిపల్ గ్రౌండ్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది.

దీంతో విశాఖలో రిపబ్లిక్ వేడుకల ఏర్పాట్లను అధికారులు రద్దుచేశారు. బీచ్ రోడ్డులో సన్నాహక పెరేడ్‌లో ఉన్న దళాలను వెనక్కి రావాలంటూ అధికారులు ఆదేశించారు. దీంతో వైజాగ్ నుంచి వివిధ విభాగాలకు చెందిన అధికారులు విజయవాడకు తిరుగు ముఖం పట్టారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle