newssting
BITING NEWS :
*సమ్మెపై మధ్యవర్తిత్వానికి కెకె రెడీ.. స్వాగతించిన ఆర్టీసీ జేఏసీ *అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

జగన్ సర్కార్ పై నక్సల్స్ లెటర్ బాంబ్!

28-09-201928-09-2019 13:31:29 IST
Updated On 28-09-2019 16:48:27 ISTUpdated On 28-09-20192019-09-28T08:01:29.824Z28-09-2019 2019-09-28T08:01:23.719Z - 2019-09-28T11:18:27.234Z - 28-09-2019

జగన్ సర్కార్ పై నక్సల్స్ లెటర్ బాంబ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర్రప్రదేశ్ లో జగన్ నేతృత్వంలోని వైకాపా సర్కార్ ఏర్పాటై వంద రోజులు దాటి పోయింది. ఎన్నికలలో విజయం సాధించి, ప్రజామద్దతుతో అధికారంలోనికి వచ్చిన ఏ ప్రభుత్వంపైనైనా విపక్షాలు విమర్శలతో విరుచుకుపడానికి ఒకింత సందేహిస్తాయి. కొంత కాలం వేచి చూసి ఆ తరువాత సదరు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంటే ఎండగట్టడానికి సమాయత్తమౌతాయి. 

ఏపీలో జగన్ సర్కార్ విషయంలో ఆయన ప్రభుత్వం విపక్షాలకు ఏ మాత్రం సమయం ఇవ్వడం లేదు.  ఇన్ని చేస్తున్నా విమర్శించరేమిటి అన్నట్లుగా ఒక దాని తరువాత ఒకటిగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నది. తెలుగుదేశం, వామపక్షాలు, జనసేన, బీజేపీ ఇలా అన్ని పార్టీలూ కూడా జగన్ సర్కార్ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. పీఏపీల రద్దు, రివర్స్ టెండరింగ్, ప్రజా వేదిక కూల్చివేత, కరకట్టపై కట్టడాల కూల్చివేతకు నోటీసులు ఇలా జగన్ సర్కార్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదంగానే మారుతోంది.  ఆ కారణంగానే రాష్ట్రంలో జగన్ సర్కార్ కొలువు దీరిన రోజుల వ్యవధిలోనే విపక్షాలు విమర్శల అస్త్రాలను సంధిస్తున్నాయి. 

తాజాగా మన్యం ప్రజల ఆగ్రహాన్ని కూడా జగన్ సర్కార్ ఎదుర్కొంటున్నది. మావోయిస్టులు జగన్ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగానూ, పాదయాత్ర సందర్భంగానూ జగన్ ఇచ్చిన వాగ్గానాలన్నీ బూటకమేనని వంద రోజుల పాలనలోనే జగన్ రుజువు చేసుకున్నారని మావోయిస్టులు అంటున్నారు.

రెండు దశాబ్దాలుగా మావోయిస్టులు ఏవోబీలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. ఇందు కోసం గిరిజనం కోసం పోరాటాలు సాగిస్తున్నారు. గత ప్రభుత్వం మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. జగన్ అధికారంలోనికి వచ్చిన తరువాత వంద రోజులకు ఆ అనుమతిని రద్దు చేస్తూ జీవో జారీ చేశారు. ఇందుకు హర్షం వ్యక్తం చేయాల్సిన మావోయిస్టులు ఎందుకు జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాక్సైట్ తవ్వకాల అనుమతి రద్దు గిరిజనుల, ఆదివాసాల పోరాట ఫలితమని...ఒక చేత్తో జీవోను రద్దు చేసి..మరో చేత్తో  ఉద్యమాలను, గిరిజనుల పోరాటాన్ని అణచివేయడానికి అత్యంత కృరంగా వ్యవహరించిన పోలీసు అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి మన్యంపై కాటుకు సమాయత్తమవ్వడాన్ని మావోయిస్టులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. 

బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వారు లక్ష్యంగా మన్యాన్ని జల్లెడ పడుతున్నారన్నది మావోయిస్టుల అభియోగం. వేలాది మంది  గిరి జనులను అక్రమంగా నిర్బంధించడమే కాకుండా, ప్రజల పక్షాన నిలిచి న్యాయం కోసం గొంతెత్తుతున్న కామ్రేడ్లను (మావోయిస్టు) ఎన్ కౌంటర్ పేరిట ఖతం చేస్తున్న ప్రభుత్వం జగన్ ది అని మావోయిస్టులు ఒక లేఖలో పేర్కొన్నారు.

జగన్ సర్కార్ అధికారం చేపట్టిన తరువాత మావోయిస్టుల నుంచి ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడం ఇదే మొదటి సారి. జీవో రద్దు సంగతి పక్కన పెడితే ఈ నెల 22న మన్యంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించిన సంఘటనను  మావోలు జగన్ ప్రభుత్వం చేసిన హత్యలుగా అభివర్ణిస్తున్నారు. వందల మంది కమాండోలు, పారామిలిటరీ దళాలతో జగన్ ప్రభుత్వం మన్యంలో గిరిజనంపై యుద్ధం ప్రకటించిందని ఆ లేఖలో మావోలు పేర్కొన్నారు.

బాక్సైట్ తవ్వకాల రద్దు పేరిట జగన్ సర్కార్ ఆడుతున్న డ్రామాను ప్రజలు నమ్మరని, ప్రజాపోరాటాల ద్వారా జగన్ సర్కార్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చిరించిన మావోలు ఆ లేఖలో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరిక కూడా చేశారు.

మొత్తం మీద బాక్సైట్ తవ్వకాల రద్దు జీవో వల్ల జగన్ మావోలను మంచి చేసుకుందామన్న యత్నం ఫలించినట్లు కనిపించదు. ఎన్ కౌంటర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మావోయిస్టుల కదలికల పట్ల ప్రభుత్వం అప్రమత్తమైనట్లు కనిపిస్తున్నది. మన్యంలో పరిస్థితిని డీజీపీ సావంగ్ సమీక్షించారు.

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

   6 hours ago


అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

   11 hours ago


కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

   13 hours ago


 కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

   14 hours ago


ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

   14 hours ago


‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

   14 hours ago


సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

   14 hours ago


పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

   15 hours ago


మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

   16 hours ago


సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle